Nene Vasthunna: ‘పొన్నియన్ సెల్వన్’తో ధనుష్ పోటీ, ‘నేనే వస్తున్నా’ అంటూ ఇలా షాకిచ్చాడు!
ప్రముఖ తమిళ హీరో ధనుష్ నటించిన తాజా సినిమా 'నానే వరువెన్'. ఈ సినిమాను తెలుగులో 'నేనే వస్తున్నా' పేరుతో రిలీజ్ అవుతుంది. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు.
తమిళ టాప్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ 'నానే వరువెన్'. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది. సెల్వా రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే 'నానే వరువెన్' సినిమాకు సంబంధించి విడుదలై పోస్టర్లు, పాటలు ప్రేక్షకులలో మంచి ఆసక్తిని కలిగించాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా ఈ నెల (సెప్టెంబర్) 29న విడుదల కాబోతుంది.
హీరో, విలన్ పాత్రల్లో ధనుష్
ఈ సినిమాలో ధనుష్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఒకటి హీరో పాత్ర కాగా, మరొకటి విలన్ రోల్. ఈ రెండు పాత్రల్లోనూ ధనుష్ గతంలో ఎప్పుడూ కనిపించని మాదిరిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ధనుష్ విలన్ రోల్ పోషించడంతో కోలీవుడ్ లో ఈ సినిమా ఆసక్తిని కలిగిస్తోంది. అటు ఇదే ఆసక్తిని కంటిన్యూ చేసేలా సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించి వరుస అప్ డేట్స్ అందిస్తోంది.
తెలుగు పోస్టర్ విడుదల
తాజాగా ఈ సినిమా యూనిట్ తెలుగు పోస్టర్ ను విడుదల చేసింది. తెలుగులో 'నేనే వస్తున్నా' అనే టైటిల్ ను ఖరారు చేసింది. ఈ మేరకు ధనుష్ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించారు. ధనుష్‌కు జోడీగా ఎల్లిడ్ ఆవ్రమ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే 'తిరు' మూవీతో మంచి హిట్ అందుకున్న ధనుష్ ఈ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ ‘సార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.
Happy to acquire the Telugu theatrical release rights of @dhanushkraja & @selvaraghavan's #NaaneVaruvean ~ #NeneVasthunna ✨
— Geetha Arts (@GeethaArts) September 14, 2022
In cinemas worldwide this September 2022!#AlluAravind #KalaippuliSThanu @thisisysr @theedittable @omdop @Rvijaimurugan @theVcreations @saregamasouth pic.twitter.com/Fk9cUIVAwu
‘పొన్నియన్ సెల్వన్’తో ‘నేనే వస్తున్నా’ ఢీ
మరోవైపు ‘నేనే వస్తున్నా’ సినిమా మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాతో పోటీకి దిగబోతోంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా ఈనెల 30న విడుదల కానుంది. తెలుగులో దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందు రోజు ధనుష్ నటించిన ‘నేనే వస్తున్నా’ రిలీజ్ కానుంది. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేస్తున్నాడు. దీంతో ఇద్దరు నిర్మాతలు తమ సినిమాలను ఒకేసారి విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read : బాయ్‌కాట్ ట్రెండ్‌ను తీసి పారేసిన నాగార్జున - వందో సినిమా గురించి ఏం చెప్పారంటే?