By: ABP Desam | Updated at : 23 Dec 2021 10:27 AM (IST)
ధనుష్
ప్రముఖ తమిళ కథానాయకుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన శ్రీమతి సాయి సౌజన్యా శ్రీనివాస్ నిర్మాతగా స్థాపించిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఓ సినిమాను నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. దీనిని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించనున్నారు. 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' సినిమాలు తీసిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. బుధవారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. గురువారం టైటిల్ వెల్లడించారు.
ధనుష్(Dhanush) హీరోగా రూపొందనున్న ఈ తొలి తెలుగు సినిమాకు 'సార్' (SIR) టైటిల్ ఖరారు చేశారు. తమిళంలో వాతి (Vaathi)టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు టైటిల్ ప్రకటించడంతో పాటు టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. విద్యా వ్యవస్థ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించనున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన టైటిల్ మోషన్ పోస్టర్‌లో ఆయన అందించిన మ్యూజిక్ బావుంది. నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్.
An ambitious & heartwarming journey of a common man❤️
— Sithara Entertainments (@SitharaEnts) December 23, 2021
Presenting you @dhanushkraja in & as #Vaathi / #Sir 🤩
▶️ https://t.co/HEFmYFfCP2#SIRMovie @iamsamyuktha_ #VenkyAtluri @gvprakash @dineshkrishnanb @NavinNooli @vamsi84 #SaiSoujanya @Fortune4Cinemas @SitharaEnts pic.twitter.com/zgW7ty0nqt
Also Read: 'భీమ్లా నాయక్' బ్యూటీకి మరో క్రేజీ సినిమాలో ఛాన్స్!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమా ప్రకటించారు. అయితే... ఆ సినిమా కంటే 'సార్' ముందుగా సెట్స్ మీదకు వెళ్లనుంది. అందుకే, ధనుష్ కూడా ఈ సినిమా గురించి చేసిన ట్వీట్ లో తన ఫస్ట్ డైరెక్ట్ తెలుగు సినిమా అని పేర్కొన్నారు.
Also Read: నాది అంత కంఫర్టబుల్ కాదు... ఒరిజినల్ స్ట్రగుల్స్ వేరే ఉన్నాయ్! - నాని ఇంటర్వ్యూ
Also Read: అమ్మో... అప్పుడు చాలా భయపడ్డాను! - సాయి పల్లవి ఇంటర్వ్యూ
Also Read: 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లుగా చిరంజీవి, బాలకృష్ణ..?
Also Read: శంకర్-చరణ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. అదే ఫార్ములా..
Also Read: అదీ ప్రభాస్ రేంజ్... 'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్‌కు యంగ్ హీరో & హాట్ బ్యూటీ రష్మీ యాంకరింగ్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Month Of Madhu Trailer : ఇండియన్ భార్యాభర్తల మధ్యలో అమెరికన్ అమ్మాయి - నెలలో ఏమైంది మధు?
Gruhalakshmi September 27th: విక్రమ్ ప్రేమకు దివ్య ఫిదా - తులసిని చంపేస్తానని నందుని బెదిరించిన రత్నప్రభ
Krishna Mukunda Murari September 27th: మురారితో తాళి కట్టించుకుంటానన్న ముకుంద - కృష్ణ ఏం చేయబోతోంది!
Hero Nani : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?
Mahesh Babu Rajamouli : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు
Bhainsa News: బైంసాలో గణేష్ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్
Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు
గ్రేటర్లో నేడు డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక - ఆ లక్కీ పర్సన్స్ని ఎంపిక ఇలా
/body>