Devi sri Prasad: హీరోగా మారనున్న టాప్ సంగీత దర్శకుడు ... పాటలే కాదు, నటన, డ్యాన్సుల్లో కూడా దంచుడే ఇక
దేవి శ్రీ ప్రసాద్ టాప్ టాలీవుడ్ డైరెక్టర్. త్వరలో హీరోగా కూడా మారనున్నారట.
పుష్ప సినిమా విడుదలవ్వడానికి ముందే అందులోని పాటలు హిట్ కొట్టాయి. జనాల్లో నోట్లో నానిపోయాయి. ‘ఏయ్ బిడ్డా... ఇది నా అడ్డా...’, ‘దాక్కో దాక్కో మేక...’ ఈ పాటలకు పిల్లలు కూడా పాడేస్తున్నారు. ఇక ఊ అంటావా మావా పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. దానిపై విమర్శలు, మెచ్చుకోళ్లు సమానస్థాయిలో వచ్చాయి. 2021లో హిట్ అయినా పాటల్లో అదీ ఒకటి. మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా బిజీగా ఉన్నారు దేవి శ్రీ. పుష్ప పార్ట్ 2 సినిమాకు సంగీతం కూర్చే పనిలో ఉన్నారాయన.
కరోనా వల్ల లాక్ డౌన్ రావడం, ఆ టైమ్ లో తన ఆలోచన మార్చుకున్నట్టు చెప్పారు దేవి శ్రీ. అంతకుముందు తాను టాప్ సంగీత దర్శకుడు అవ్వాలని మాత్రమే కోరుకున్నారట. మొదటి ప్రాధాన్యత సంగీతానికే ఇచ్చారు. కానీ లాక్ డౌన్ తరువాత తన మనసు మార్చుకున్నట్టు చెప్పారు. జీవితం తనకి ఏ అవకాశం ఇచ్చినా తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. ఆ సమయంలోనే హీరోగా ఛాన్సు వస్తే నటించేందుకు ఒప్పుకున్నారు దేవిశ్రీ. ఆ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్టు చెప్పారు. అయితే ఆ సినిమా ఇప్పట్లో విడుదల కాదట. పుష్ప పార్ట్ 2 విడుదలయ్యాకే తన సినిమా విడుదల ఉంటుందని తెలిపారు.
దేవి శ్రీ ప్రసాద్ సొంతూరు తూర్పుగోదావరి జిల్లా వెదురుపాక. సంగీతమంటే చిన్నప్పట్నించి చాలా ఇష్టం. మాండోలిన్ శ్రీనివాస్ దగ్గర మాండోలిన్ నేర్చుకున్నారు. కేవలం 20 ఏళ్ల వయసుకే సంగీత దర్శకుడిగా మారారు. 1999లో దేవి సినిమాకు సంగీతం అందించారు. ఆ ఏడాదే నీకోసం అనే సినిమాకు కూడా సంగీతం కూర్చారు. ఈ రెండు సినిమాల్లోని పాటలు చాలా హిట్ అయ్యాయి.
Also Read: మహేష్ బాబుకు ఇష్టమైన కో-డైరెక్టర్... దర్శకుడిగా కోలీవుడ్‌లో సత్తా చాటాడోయ్!
Also Read: భీమ్లా నాయక్... పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ స్పెషల్ క్లైమాక్స్!
Also Read: నా చేతుల్లో ఏమీ లేదు... ఫ్యాన్స్‌కు క్షమాపణలు - 'భీమ్లా నాయక్' నిర్మాత
Also Read: విడాకుల తర్వాత చనిపోతాననుకున్నా! కానీ... - సమంత
Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకులపై సమంత స్పందన
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి