Vijay Devarakonda: దేవర శాంటా... పదివేలు చొప్పున వంద మందికి! అయితే... ఓ కండిషన్
వంద మందికి పదివేల రూపాయల చొప్పున ఇస్తానని విజయ్ దేవరకొండ చెప్పారు. అయితే... ఓ కండిషన్ పెట్టారు. అదేమిటి? ఏంటి? అనే వివరాలు తెలుసుకోండి.
క్రిస్మస్ వస్తే చాలు... రౌడీ బాయ్, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాస్త 'దేవర శాంటా'గా మారతారు. ఆయన 2017 నుంచి దేవర శాంటా పేరుతో ప్రజల దగ్గరకు వెళ్లి బహుమతులు ఇస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా తాను ఏం చేయాలని అనుకుంటున్నదీ ఆయన చెప్పారు. వంద మందికి పదివేలు చొప్పున ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అయితే... ఓ కండిషన్ పెట్టారు. అదేమిటో తెలుసా? ఆయన మాటల్లోనే చదవండి.
"దేవర శాంటా టైమ్ వచ్చింది. మీ అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ ఇయర్ నేను కొంత మందికి మనీ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను ఓ మిలియన్ (రూ. 10 లక్షలు) ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా జీవితంలో ఒకానొక సమయంలో నేను మిలియనీర్ అవ్వాలని అనుకున్నాను. ఈ రోజు మీ- అందరికీ మిలియన్ ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నందుకు హ్యాపీగా ఉన్నాను. మీలో వంద మందిని ఎంపిక చేసి... పదివేలు చొప్పున జనవరి 1న ఇస్తా. మీరూ ఈ మంచి కార్యక్రమంలో పార్ట్ కావాలి. మీ కోసం మీరు అడగొద్దు. మీ ఫ్రెండ్ కోసం, ఫ్యామిలీ కోసం అడగండి. ఎవరికి, ఎందుకు డబ్బులు ఇవ్వాలనేది చెప్పండి. వంద మందిని ఎంపిక చేసి... జనవరి 1న వాళ్ల పేర్లు వెల్లడిస్తాం. ఒకవేళ మీరు రౌడీ క్లబ్‌లో సభ్యులు అయితే... మీ రౌడీ కోడ్ లేదా రౌడీ ఐడీ పేర్కొనండి. వంద మందిలో కనీసం యాభై మంది రౌడీ కమ్యూనిటీ సభ్యులు ఉండేలా చూస్తా" అని విజయ్ దేవరకొండ ఓ వీడియో విడుదల చేశారు.
#DeveraSanta21
— Vijay Deverakonda (@TheDeverakonda) December 25, 2021
Sharing my journey and some money I made with my community.
1 MILLION give away 😁
You be Santa and gift someone 10,000/-
Tell me why and who should get the money.
100 names will be announced Jan 1st. pic.twitter.com/nql8fMmcMi
సినిమాలకు వస్తే... పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 25, 2022న సినిమా విడుదల కానుంది.
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
Also Read: సంక్రాంతి కూడా అక్కడే ప్లాన్ చేసిన మహేష్ బాబు...
Also Read: 'ఢీ' నుంచి దర్శకేంద్రుడి దగ్గరకు... దీపికా పిల్లి గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉంది మరి!
Also Read: 'భీమ్లా నాయక్' బ్యూటీకి మరో క్రేజీ సినిమాలో ఛాన్స్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి