Devatha October 18th Update: అక్కాచెల్లెళ్ల త్యాగాల మధ్య నలిగిపోతున్న ఆదిత్య ఊహించని నిర్ణయం- ఆందోళనలో దేవుడమ్మ
రుక్మిణి, ఆదిత్య మాట్లాడుకోవడం చూసిన సత్య ఇద్దరినీ అనుమానిస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
దేవుడమ్మ సత్య గురించి ఆందోళన పడుతుంది. ఆదిత్య తన దగ్గర ఏదో విషయం దాస్తున్నాడు అది అర్థం కావడం లేదని అంటుంది. ఏ విషయం గురించి బాధపడుతున్నాడో తెలుసుకోవాలని దేవుడమ్మ రాజమ్మతో తన బాధ చెప్తుంది. సత్య ఆదిత్య దగ్గరకి వచ్చి అయిపోయిందా రొమాంటిక్ ట్రిప్ అని అడుగుతుంది. ఆదిత్య నా మాట వింటాడు ఏదైనా చేస్తాడు అని గట్టిగా నమ్మేదాన్ని అంతగా చెప్పినా కూడా మా అక్కని వెళ్ళి ఎందుకు కలుస్తున్నావో అర్థం కావడం లేదు నువ్వు మారవా ఇంక అని అడుగుతుంది. రుక్మిణి గురించి తెలిసి కూడా అనుమానిస్తున్నావా అని అడుగుతాడు. నువ్వు మా అక్క కలిసి నాటకాలు ఆడుతున్నారా అని సత్య అడిగేసరికి ఆదిత్య కోపంగా అరుస్తాడు. ఆ మాటకి దేవుడమ్మ గదిలోకి వస్తుంది.
ఇద్దరూ మౌనంగా ఉండేసరికి ఏదో గొడవ జరిగిందని అనుకుని వెళ్ళిపోతుంది. ఎందుకు ఆదిత్య మమ్మల్ని మోసం చేయాలని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావ్ అని సత్య ప్రశ్నిస్తుంది. అటు ఆదిత్య, ఇటు దేవుడమ్మ ఒకే విషయం గురించి ఆలోచిస్తుంటారు. దేవి చాలు అనుకుంటే రుక్మిణి ఏమైపోవాలి అని ఆలోచిస్తుండగా రుక్మిణి ఫోన్ చేస్తుంది. దేవమ్మ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నా నాయన ఎవరు అని అడుగుతుంది నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్తుంది. ఇద్దరూ ఒకచోట కలుస్తారు.
Also read: సులోచనకి యాక్సిడెంట్ చేసిన మాళవికని కాపాడిన యష్- భర్త మీద అంతులేని నమ్మకం పెట్టుకున్న వేద
ఆదిత్య: భార్య పిల్లలతో ఆనందంగా ఉండే రాత నాకు లేదు. ఇలా ఇష్టాలకి దూరంగా కష్టాలతో బతకమని రాసి పెట్టి ఉంది
రుక్మిణి: ఏం కష్టం వచ్చింది పెనిమిటి
ఆదిత్య: నా భార్య అంటే నువ్వు.. కానీ నా దగ్గరకి రాలేవు, నా బిడ్డ దేవి కళ్ళెదురుగా ఉన్నా నాన్న అని పిలిపించుకోలేను. నేనే నాన్న అని చెప్పుకోలేను. దేవి ప్రవర్తన రోజు రోజుకి నరకంగా అనిపిస్తుంది. నేను దగ్గరకి తీసుకోవాలని అనుకుంటే దేవి దూరం అయిపోతుంది
రుక్మిణి: ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటి పెనిమిటి
అప్పుడే సత్య అక్కడికి వస్తుంది. మీరు మారరా త్యాగం త్యాగం అన్నావ్ ఇదేనా నీ త్యాగం, నా భర్తని కలవకు అన్నాను అయినా నువ్వు మారడం లేదని సత్య అరుస్తుంది. ఇక్కడ ఇలా మీరిద్దరు కలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదిస్తుంది. ఆ మాటకి సత్య అని ఆదిత్య కోపంగా అరుస్తాడు. అరిచి నా నోరు మూయించడం కాదు నాకు సమాధానం కావాలి, అసలు ఏం చేస్తున్నారు నా జీవితం ఏం చేయాలని అనుకుంటున్నారని అడుగుతుంది.
Also Read: మేడమ్ తన ప్రాధాన్యత అనేసిన వసు, ఇంప్రెస్ అయిపోయిన ఇగో మాస్టర్- జగతి తరపున క్షమాపణ అడిగిన రిషి
ఆదిత్య: మీ జీవితాలు బాగానే ఉన్నాయి, మీ త్యాగాలకి బలైపోయింది నేను, కాలేజీలో అందరినీ కాదని నిన్ను ప్రేమించడం నేను చేసిన మొదటి తప్పు, నిన్ను కాదని మీ అక్కని పెళ్లి చేసుకోవడం నేను చేసిన రెండో తప్పు. మీ అక్క కోసం నీ ప్రేమని త్యాగం చేయాలని అనుకున్నావ్. మా ఇద్దరినీ ఒకటి చేయడం కోసం ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నావ్. అక్కడితో ఆగిపోతే కథ వేరేలా ఉండేది. నా చెల్లెలు ఇంత త్యాగం చేస్తే నేను ఎందుకు చెయ్యకూడదు అని చనిపోయాను అని నమ్మించి నన్ను వదిలేసి వెళ్లిపోయావు. అక్కడితో వదిలేశారా అక్క లేని లోటు తీర్చాలి అని నీ మెడలో తాళి కట్టించారు. మా అమ్మ మాట విని నీ మెడలో నేను తాళి కట్టడం నేను చేసిన మరో తప్పు. సత్యని బాధపెట్టకూడదు అని దగ్గర అయ్యేలోపు మళ్ళీ రుక్మిణి కనిపించింది. నువ్వు బతికింది చెప్పలేక సత్యకి దగ్గర కాలేక నరకం అనుభవిస్తున్నా.. మీ త్యాగాలకి నన్ను బలి చేసి నేను తప్పు చేసినట్టు నన్ను నిలదీస్తారు ఏంటి.. అందుకే ఇక నేను ఎవరికి సమాధానం చెప్పలేను, నాకు ఎవరితో ఉండాలని లేదు నన్ను ఒంటరిగా వదిలెయ్యండి