Devatha August 26th Update: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మాధవ్- దేవిని ఎక్కడికి తీసుకెళ్లావని మాధవ్ ని నిలదీసిన జానకి
దేవి మనసులో మరింత విషం నింపేందుకు మాధవ్ మరో కొత్త కుట్రకు తెర తీశాడు. దీంతో కథ కొత్త మలుపు తీసుకుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తన బాధ ఏంటి, ఎవరి వల్ల భయపడుతున్నావని జానకి రాధని అడుగుతుంది. కానీ రాధ మాత్రం అవేమీ వినిపించుకోకుండా మాధవ్ సారు ఏం చేయబోతున్నాడని ఆలోచిస్తూ కంగారుగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోయింది ఏదో జరుగుతుందని జానకి అలవాటు పడుతుంది. ఇక మాధవ్ దేవిని గతంలో ఆదిత్య తీసుకొచ్చిన అనాథ ఆశ్రమానికి తీసుకుని వస్తాడు. ఆ పిల్లల్లో మాట్లాడుదుగాని అని మాధవ్ అంటాడు. సరే నేనే వెళ్ళి వాళ్ళని తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక వ్యక్తి రుక్మిణి, దేవి ఫోటో పట్టుకుని ఫోటోలో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా చూశావా అని అడుగుతూ ఉంటాడు. సరిగ్గా అతను మాధవ్ దగ్గరకి వచ్చి ఫోటో చూపించి అడుగుతాడు. అది చూసి మాధవ్ షాక్ అయినట్టుగా చూసి దేవిని పిలుస్తాడు.
దేవి మాధవ్ దగ్గరకి వస్తుంటే పక్కన ఉన్న వ్యక్తి నా బిడ్డ నా కళ్ల ముందే ఉందా అని అంటాడు. ఏంది నాయన పిలిచినావ్ అని దేవి వచ్చి అడుగుతుంది. ఇంతకీ నువ్వు ఎవరు మా దేవిని చూసి నీ కూతురు అని అడుగుతావ్ ఏంటి అని మాధవ్ అంటాడు. ఇది నా భార్యబిడ్డల ఫోటో సార్ అని దేవి, రాధ కలిసి ఉన్న ఫోటో చూపిస్తాడు. అది విని దేవి షాక్ అవుతుంది. తాగుడుకు బానిసై కడుపుతో ఉన్న నా భార్యని విపరీతంగా కొట్టేవాడిని అందుకే నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నా భార్యకి బిడ్డ పుట్టింది, ఎక్కడో ఉందని తెలిసాక కష్టపడి వాళ్ళ ఫోటో సంపాదించాను అని చెప్తాడు. మాధవ్ ఆ ఫోటో తీసుకుని దేవికి చూపిస్తాడు. ఇతను వెతుకుతుంది మీ గురించే.. పాపం తల్లి తను చేసిన తప్పులు తానే ఒప్పుకుంటున్నాడు కదా అని మాధవ్ అంటాడు. అవును తల్లి ఇంత కాలానికి నా బిడ్డ నాకు కనిపించింది నేను మీ నాన్నని అని దేవి దగ్గరకి వెళ్తాడు. దేవి ఏడుస్తూ చూస్తూ నిలబడిపోతుంది.
Also Read: ఖైలాష్ చెంప పగలగొట్టిన వేద, మాళవికకి బుద్ధి చెప్పిన ఖుషి, బద్ధలైన తండ్రి హృదయం
మీ నాన్నని నువ్వు అయినా క్షమించమ్మా అని అతను దేవి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అంత దీనంగా తన తప్పులు ఒప్పుకుంటున్నాడంటే ఈయనే మీ నాన్న అని నాకు అనిపిస్తుందని మాధవ్ చెప్తాడు. నువ్వు నిజంగా మా నాయనవా అని అడుగుతుంది.. అవును నేనే మీ నాయన్ని అని చెప్తాడు. నిన్ను చూస్తుంటే మస్త్ కోపం వస్తుంది, మాయమ్మని చాలా బాధ పెట్టావ్ కదా అని దేవి అంటే తప్పు అయిందమ్మా అని చెంపలేసుకుంటూ ఏడుస్తూ ఇంకెప్పుడు తప్పు చెయ్యను నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటాను. మీ అమ్మని నేను వెంటనే చూడాలి. నా రాధతో వెంటనే మాట్లాడాలి అని దేవిని దగ్గరకి తీసుకోబోతాడు కానీ దేవి దూరంగా వెళ్ళిపోతుంది. నీ పేరెంటని మాధవ్ అడుగుతాడు. మల్లికార్జున్ అని చెప్తాడు.
దేవిని పక్కకి తీసుకెళ్లిన మాధవ్ ఇన్ని రోజులు మీ నాన్న ఎక్కడ ఉన్నాడో తెలియక చాలా బాధపడ్డావ్ కదా అదిగో చూడు మీ నాన్న కనిపించాడు. కానీ ఎవ్వరికీ చెప్పకు అని అంటాడు. ఎందుకని అంటుంది. ఎవరికైనా చెప్తే మళ్ళీ మీ అమ్మని కోడతాదేమో అని అనుకుంటారు. అందుకే నేరుగా మీ అమ్మని తీసుకొచ్చి చూపిద్దాం అతనే క్షమించమని అడుగుతాడని మాధవ్ దేవికి నూరిపోస్తాడు. ఇంటికి తీసుకెళ్తూ దేవిని కారు ఎక్కించిన తర్వాత అతన్ని చూసి మాధవ్ సైగ చేస్తాడు. దేవి ఏడ్చుకుంటూ ఇంటికి రావడం చూసి రుక్మిణి కంగారు పడుతుంది. అటు ఆదిత్య దేవి కోసం స్కూల్ దగ్గరకి వస్తాడు. దేవిని నాన్న బయటకి తీసుకెళ్లాడని చిన్మయి చెప్తుంది. మళ్ళీ ఎక్కడకి తీసుకెళ్ళాడు తన మనసు మార్చడానికా అని ఆదిత్య అనుమానపడతాడు.
Also Read: తరగతి గది దాటి తరలిన కథ , ఐ లవ్ యూ రిషి సార్ నన్ను క్షమించండి నా ప్రేమని అంగీకరించండని చెప్పేసిన వసు