Devatha July 18th Update: ఆఫీసర్ సారుకి దత్తత పోకుండా తప్పు చేశానన్న దేవి, పట్టరాని ఆనందంలో రుక్మిణి, ఆదిత్య-పగతో రగిలిపోతున్న మాధవ
దేవిని అదిత్యకి ఎలాగైనా దగ్గర చెయ్యాలని రుక్మిణి ప్రయత్నిస్తుంది. కానీ మాధవ మాత్రం అలా జరగకూడదని కుట్రలు పన్నుతు ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
చెస్ పోటీల్లో గెలవాలంటే ప్రాక్టీస్ చేయాలి నువ్వు రా నాయన ఆడుకుందామని దేవి మాధవని పిలుస్తుంది. ఇక దేవి, మాధవ చెస్ ఆడుతూ ఉంటారు. ఇక ఆటలో దేవి గెలవడంతో అందరూ చప్పట్లు కొడుతూ మెచ్చుకుంటారు. అది చూసి రుక్మిణి మురిసిపోతుంది. ఇక దేవుడమ్మ గుడిలో జరిగిన ఘటన గుర్తు చేసుకుని బాధపడుతూ కూర్చుంటే అక్కడికి ఈశ్వరపసాద్ వస్తాడు. గుడిలో అమ్మవారు చెప్పింది రుక్మిణి గురించే, అమ్మవారు భవిష్యవాణి చెప్తుంటే అర్థమవుతుందని అంటుంది. రుక్మిణి ఎక్కడ ఉందో తెలిస్తే తనని ఎప్పుడో ఇంటికి తీసుకొచ్చేదాన్ని అని బాధపడుతుంది. ఇక దేవి జడ వేయించుకుంటూ ఆఫీసర్ సారు నాకు ఆటలో ట్రిక్కులు నేర్పించారో తెలుసా, దేవుడమ్మ అవ్వ వాళ్ళు నన్ను ఎంత బాగా చూసుకున్నారో అని సంబరంగా చెప్తుంది. అక్కడే మాధవ కూడా ఉంటాడు. నువ్వు ఎప్పుడు ఆఫీసర్ గారితో అలాగే ఉండాలని రామూర్తి చెప్తాడు. ఆటలో ఒడిపోతే బాధపడకూడదు గెలిచే దాకా పోరాడాలి అని చెప్పాడని దేవి చెప్పడంతో మాధవ రగిలిపోతాడు. 'ఆఫీసర్ సారు దగ్గర ఉంటే మంచి మంచి విషయాలు చెప్తాడు, గందుకే ఆ పొద్దు నేను తప్పు చేసిన అనిపిస్తుంది. ఆఫీసర్ సార్ నన్ను దత్తత తీసుకుంటానని చెప్పినప్పుడు పోయి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ఆయన దగ్గర ఉంటే ఆటలే కాదు మంచిగా చదువు కూడా చెప్తాడు. నన్ను కలెక్టర్ ని చేస్తాడు' అని దేవి చెప్పడంతో రుక్మిణి మురిసిపోతుంటే మాధవ ఉడికిపోతాడు. అది చూసిన రుక్మిణి దానికి దత్తత పోవడం ఎందుకు ఆఫీసర్ సారు జీవితాంతం నీతోనే ఉంటాడని చెప్తుంది. నిజంగా ఉంటాడా అని దేవి అడిగితే ఉండేటట్టు నేను చేస్తాగా అని రుక్మిణి అంటుంది. ఆ మాటలకి మాధవ షాక్ అవుతాడు.
Also Read: పాపం మిస్టర్ యారగెంట్, వేద ముందు పరువు పోయే- ఎట్టకేలకు సారికను పట్టుకున్న యష్, నిజం బట్టబయలు
రుక్మిణి సంబరంగా అదిత్యకి ఫోన్ చేసి దేవమ్మ నీ గురించి ఎంత బాగా చెప్తుందో అది వింటే మస్త్ సంబరంగా ఉంది పెనిమిటి అని అంటుంది. ఆ మాటలు మాధవ వింటూ ఉంటాడు. నువ్వు ఇంత స్వచ్చంగా నవ్వి, ఆ నవ్వు విని ఎంత కాలం అయ్యిందో తెలుసా రుక్మిణి అని ఆదిత్య ఆనందంగా చెప్తాడు. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకున్న కానీ నువ్వు నీ నవ్వు రెండు నాకు దూరం అయ్యాయని బాధపడతాడు. ఆఫీసర్ సారుకి దత్తత పోయి ఉంటే బాగుండేది, పోకుండా తప్పు చేశానని అన్నదని చెప్పడంతో ఆదిత్య ఆనందానికి అవధులు ఉండవు. ఆటలో గెలుస్తాది, నువ్వు నీ బిడ్డ కలుస్తారని నమ్మకం కూడా నాకు వచ్చిందని చెప్పడంతో నాకు కావలసింది అదే రుక్మిణి అని ఆదిత్య అంటాడు. ఆ మాటలన్నీ విని మాధవ రగిలిపోతూ ఉంటాడు.
'పరిస్థితులు మారిపోతున్నాయి. రాధలో నమ్మకం పెరిగిపోతుంది అదే జరిగితే నా మాటకి తన దగ్గర విలువ తగ్గిపోతూ వస్తుంది. నో అలా జరగకూడదు. రాధకి మరో అవకాశం ఆలోచన కల్పించకూడదు. ఇక్కడ ఏం జరిగిన అక్కడ ఆ అదిత్యకి చేరిపోతుంది. ఆదిత్య ఇంకో అడుగు ముందుకు వేస్తాడు. ఇప్పటికే నా ఆలోచనాలకి రాధ దూరం అయిపోతుంది. ఇంక దూరం అయ్యిందంటే నా ఇంటి తలుపులు తనని ఎక్కువ రోజులు ఆపలేవు. ఈలోపే ఏదో ఒకటి చేయాలి. ఏం చెయ్యాలి' అని ఆలోచిస్తుండగా దేవి, రాధ వస్తారు. ఇక దేవుడమ్మ దేవి చెస్ పోటీల్లో తప్పకుండా గెలుస్తుందని అంటుంది. చెస్ పోటీలు జరిగే దగ్గరకి వస్తూ ఉంటారు. దేవి వాళ్ళు వస్తుంటే గెట్ దగ్గరే ఆపేస్తారు. పాస్ లేకుండా లోపలికి అనుమతించేది లేదని చెప్తాడు. అప్పుడే ఆదిత్య అక్కడికి రావడంతో దేవి సంబరంగా కౌగలించుకుంటుంది. ఇక గెట్ దగ్గర ఉన్న వ్యక్తి సార్ మీరు చెప్పింది ఈ పాపే అని తెలియక ఆపాను సారీ లోపలికి వెళ్లండని చెప్తాడు. చెస్ పోటీలు ప్రారంభమవుతాయి.
Also Read: శౌర్యకి మళ్ళీ ఐ లవ్యూ చెప్పిన డాక్టర్ సాబ్- హిమ, నిరుపమ్ పెళ్లి చెడగొట్టేందుకు ప్రేమ్ స్కెచ్