Devatha August 5th Update: రుక్మిణిని అమ్మలా చూసుకున్న చిన్మయి- తన ఫోటోకి మీసాలు గీసి మానాయన ఇలాగే ఉంటాడు వెతకమంటున్న దేవి
రుక్మిణిని దేవి తన తండ్రి గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.వాటికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక రుక్మిణి బాధపడుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
రుక్మిణిని దేవి తన తండ్రి గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఏంది బిడ్డ ఇది ఆ మాధవగాడు దేవి మనసు ఇంత విషం నింపాడు అని భాగ్యమ్మ బాధపడుతుంది. వాళ్ళ నాయన రాక్షసుడు కాదు దేవుడు అని దేవమ్మ ఎలా అర్థం అయ్యేలా చెప్పాలో తెలియడం లేదని రుక్మిణి కూడా బాధపడుతుంది. నువ్వు నవ్వుతూ నిద్ర లేచి నాతో కాసేపు సరదాగా మాట్లాడి అత్తయ్య వాళ్ళని పలకరించి వాళ్ళతో సరదాగా మాట్లాడి ఎన్ని రోజులైందో గుర్తు తెచ్చుకో ఆదిత్య అని సత్య అంటుంది. ఇంతక ముందు ఇంటికి టైం కి వచ్చేవాడివి ఇప్పుడు ఇంటికి ఎప్పుడు వస్తున్నావో కూడా తెలియడం లేదు. నువ్వు ఇంతక ముందులా ఉండటం లేదు. పిల్లల కోసం ఆంటీ నువ్వు బాధపడటం చూడలేక అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందామని ఏర్పాటు చేసుకుంటే సింపుల్ గా ఇప్పుడు కాదని ఆపేశావ్. నువ్వు ఎప్పుడు వెళ్దాం అంటే ఇప్పుడే వెళ్దాం నువ్వు అవసరం లేదంటే అసలు వెళ్ళకుండా కూడా ఉందాం అనేసి బాధగా వెళ్ళిపోతుంది.
Also Read: యష్, వేద, మధ్యలో ఓ దొంగోడు - దొంగతో కామెడీ చేసిన యష్
ఆదిత్య దేవిని కలిసేందుకు వస్తాడు. దేవి ఫోటో గీస్తూ ఉంటుంది. ఏంటమ్మా నీ ఫోటోకి నువ్వే మీసాలు గీసుకుంటున్నావ్ అని ఆదిత్య అడుగుతాడు. మాయమ్మ నేను మా నాయనలెక్క ఉంటాడని చెప్పింది. మా నాయన ఎట్లా ఉంటాడో తెలవక వెతకడానికి ఇబ్బంది పడుతున్నారు కదా నేను మానాయన పోలీకని మాయమ్మ చెప్పింది కదా అందుకే నా ఫోటోకి మీసాలు పెడితే గట్లనే అగుపిస్తే మానాయన్ని పట్టుకుంటారు కదా అని ఆదిత్యకి చెప్తుంది. ఇక మీసాలు పెట్టిన తన ఫోటో ఇచ్చి ఈ ఫోటో సరిపోతుంది కదా నేను ఏది అడిగినా మీరు చేస్తారు కదా మానాయన్ని వెతికిపెట్టండి, మాయమ్మని బాధపెట్టినందుకు మానాయనకి బుద్ది చెప్పాలి అని దేవి అంటుంది.
Alo Read: తన గెలుపుకి కారణం తులసి అంటున్న సామ్రాట్ - రగిలిపోతున్న నందు
రుక్మిణి నిద్రలేచేసరికి చిన్మయి కాఫీ తెచ్చి ఇస్తుంది. నీకు జ్వరం వచ్చిందని అర్థం అయ్యింది అందుకే వెళ్ళి నీకు కాఫీ పెట్టి తీసుకు వచ్చాను అని చెప్పి ముందు జ్వరం ట్యాబ్లెట్ ఇస్తుంది. అది చూసి రుక్మిణి మురిసిపోతుంది. ఇటువంటి పనులు చేసే వయసు నీకు ఇంక రాలేదు వయసు వచ్చాక చెయ్యాలి ఇప్పుడు నువ్వు మంచిగా చదువుకోవాలని చెప్తుంది. మాకు బాగోకపోతే నువ్వు నిద్రకూడా పోకుండా చూసుకుంటావ్ కదా మరి మేము చూసుకుంటే తప్పేంటమ్మా అని అంటుంది. నన్ను చూసి ఈ బిడ్డ నా మీద మస్త్ ప్రేమ్ పెంచుకుంటుంది.. ఈ బిడ్డని విడిచి పెట్టి నేను ఎట్లా పోవాలి అని రుక్మిణి మనసులోనే కుమిలిపోతుంది. నా పానం బాగోలేదని నన్ను లేపకుండా నాకు కాఫీ తెచ్చి గోలి ఇచ్చి నన్ను అమ్మ లెక్క చూసుకుంది.. అంత ప్రేమ చూపించిన చిన్మయికి నేను ఏం చెయ్యగలను ఆ బిడ్డని ఎట్లా ఇడిచిపెట్టలో అర్థం కావడం లేదని రుక్మిణి బాధపడుతుంది. అది నీ బిడ్డ కాదు ఆ మాధవగాడి బిడ్డ తనతో నీకేంది నీ బిడ్డని నువ్వు మంచిగా చూసుకో చాలు అని భాగ్యమ్మ కోపంగా చెప్తుంది. ఆ మాటలకి రుక్మిణి కోప్పడుతుంది. ఆడి గురించి ఆడి బిడ్డ గురించి ఆలోచిస్తే నువ్వు ఇక్కడానే ఉండాలి నువ్వు గడప దాటినీకు ఉండదు, వాడేమమో నీకు చుట్టూ కంచె వేస్తున్నాడు ఆడి బిడ్డ ఏమో నీ కాళ్ళకి బంధం వేస్తుంది అని అంటుంది. అట్లా అని పసి బిడ్డని బాధపెట్టమంటావా అని రుక్మిణి కోపంగా అంటుంది. వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉంటే నీ బతుకు ఇలాగే ఉంటదని అంటుంది. నా బిడ్డ మంచిగా ఉండాలి నా పెనిమిటి దగ్గరకి వెళ్ళాలి. అలా అని నా బిడ్డ కోసం ఈ బిడ్డని బాధపెట్టడానికి నేనేమైనా మాధవ సారునా అని రుక్మిణి భాగ్యమ్మని నిలదిస్తుంది. నాకు నా బిడ్డ ఎంతో ఈ బిడ్డ అంతే అనేసి కోపంగా వెళ్ళిపోతుంది.