News
News
X

Devatha August 17th Update: దేవి ముందు ఆదిత్యని ఇరికించి పైశాచికానందం పొందిన మాధవ- రాధ, ఆదిత్యల ఆవేశం

దేవి మనసు చెడగొట్టేందుకు మాధవ మళ్ళీ కొత్త ప్లాన్ వేశాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

ఆదిత్యకి మాధవ ఫోన్ చేసి మా ఊరి రైతులకి ఒక సమస్య వచ్చింది, నువ్వే మా ఇంటికి వస్తే బాగుంటుంది.. ఒకవేళ నువ్వు రాను అంటే.. అని ఫోన్ కట్ చేస్తాడు. మాధవ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది. రాకపోతే అని ఫోన్ కట్ చేసాదంటే వాడు మళ్ళీ ఏదో చెయ్యబోతున్నాడు నేను ఇంటికి వెళ్లడమే మంచిదని ఆదిత్య మనసులో అనుకుంటాడు. మాధవ భాగ్యమ్మని కూరగాయలు తీసుకురమ్మని ఇంట్లో నుంచి పంపించేస్తాడు. వాడి మాటలు తేడా కొడుతున్నాయి జర భద్రం బిడ్డ అని భాగ్యమ్మ చెప్పి వెళ్ళిపోతుంది. నీ ఆఫీసర్ వస్తున్నాడు ఇంటికి మనం మనం ఉన్నప్పుడు ప్రైవసీ కావాలి కదా అందుకే భాగ్యమ్మని పంపించేశాను అని మాధవ రాధకి వచ్చి చెప్తాడు. అప్పుడే పిల్లలు వచ్చి ఎండి నాయన ఆఫీసర్ సారు వస్తున్నాడా అని సంతోషంగా అడుగుతారు. ఆఫీసర్ సారు మంచోడు కదా అందుకే అందరికీ చాలా ఇష్టమని మాధవ వెటకారంగా అంటాడు. నీకు చెప్పకుండా ఇంటికి రావడం ఏంటా అని ఆలోచిస్తున్నావా? ఇప్పుడు జరగబోయే ఈ మాధవ నాటకంలో ఆఫీసర్ కూడా ఉంటే బాగుండు అని రమ్మన్నాను అని మాధవ చెప్పడంతో రాధ షాక్ అవుతుంది.

Also Read: అభిమన్యుతో ఎందుకు చేతులు కలిపారని నిలదీసిన కాంచన- అభి, మాళవిక చేతిలో యష్ బిజినెస్ సీక్రెట్స్

సత్య ఆదిత్య ప్రవర్తన తలుచుకుని బాధపడుతుంది. ఎందుకు ఆదిత్య ఇలా చేస్తున్నాడు, అక్కడ అక్క ఉందని భాష చూస్తే గుర్తు పడతాడని ఇలా తనని దూరం పెడుతున్నాడా ఏదో జరుగుతుందని సత్య అనుకుంటుంది. ఆదిత్య మాడవ ఇంటికి వస్తాడు. నువ్వు వస్తున్నావు స్కూల్ కి కూడా తీసుకెళ్తావని మా నాయన చెప్పాడని దేవి చెప్తుంది. మాధవ దేవిని మాత్రమే ఉంచి చిన్మయిని పంపించేస్తాడు. రైతుల గురించి మాట్లాడాలి అన్నావ్ ఏంటి చెప్పు అని అడుగుతాడు. తర్వాత మాట్లాడుకుందాం ముందు కూర్చో అని మాధవ అంటాడు. నలుగురు అనాథ పిల్లలు చందా కోసం మాధవ ఇంటికి వస్తారు. రాధ ఇండకే చెప్పాను కదా ఒక ముఖ్యమైన ఘట్టం అని మాధవ అంటాడు. దేవి గదిలో నుంచి వస్తుంది. అప్పుడే మాధవ ఆ పిల్లలతో మాట్లాడతాడు.

ఏం తల్లి మీకు అమ్మ నాన్న లేరా  అని అడుగుతాడు. లేరని వాళ్ళు చెప్తే అందుకే మీకు ఈ కష్టాలు అని వాళ్ళకి చందా వేస్తాడు. ఒక అమ్మాయి తన దగ్గరకి వస్తే తనతో మాట్లాడుతూ నీ గురించి నాకు తెలుసు మీ నాన్న ఒక తాగుబోతు మిమ్మల్ని పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు కాబట్టే నువ్వు అనాథవి అయ్యావు అని అంటాడు. ఆ పసి పాప నిజంగా మా నాన్న మీకు తెలుసా ఎక్కడ ఉంటారో చెప్పండి నేను కలవాలని అంటుంది. అనాథ ఆశ్రమంలో మీరు సంతోషంగానే ఉంటున్నారు కదా అని మాధవ అంటాడు. పగలు ఎంత ఆనందంగా ఉన్నా రాత్రి పూట ఎవరు లేరనే బాధ నిద్రపోనివ్వడం లేదు సర్.. మా నాన్న తాగుబోతు అయినా పరవాలేదు మంచోడు కాకపోయినా పర్వాలేదు ఎక్కడ ఉంటాడో చెప్పండి వెళ్ళి చూస్తాను అని దీనంగా అడుగుతుంది. తాగుబోతు అయినఅ తిరుగుబోతు అయినఅ మీ నాన్న అంటే ఎంత ప్రేమ నీకు అంతేలే ఏ బిడ్డకి అయినఅ తండ్రిని చూడాలని ఆశ ఉంటుంది కదా అందరికీ ఆ అదృష్టం ఉండదు కదా అని అంటాడు. ఆ మాటలకి దేవి చాలా బాధపడుతుంటే ఆదిత్య, రాధ కోపంగా చూస్తూ ఉంటారు. ఆ పాప వెనక్కి వచ్చి మా నాన్న ఎక్కడ ఉన్న ఒక్కసారి చూపించండి నాన్నని చూస్తే నాకు ఎవరు లేరనే బాధ దిగులు ఉండదని అంటుంది. మీ నాన్న ఎక్కడ ఉన్నా నేను వెతికి తీసుకొస్తాను అని చెప్తాడు. దేవమ్మ స్కూల్ కి టైం అవుతుంది కదా నువ్వు వెళ్ళు ఆఫీసర్ సారు మళ్ళీ వస్తారు అని దేవికి చెప్తాడు. దీంతో దేవి కోపంగా ఆదిత్య, రాధ వైపు కోపంగా చూసి వెళ్ళిపోతుంది.

Also Read: డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!

ఆదిత్య కోపంగా లేచి మాధవ కలర్ పట్టుకుంటాడు. నువ్వు మనిషివెనా పాపం సాయం కోసం వచ్చిన ఆ పాపకి లేని నాన్నని ఉన్నాడని చెప్పి ఆశలు రేపుతున్నావ్ నీ మాటలు నమ్మి తండ్రి కోసం ఆ పసి మనసు ఎంత అల్లాడిపోతుంది. నాకు నీతులు చెప్తున్నావ్ మరి దేవికి తండ్రివి అయ్యి ఉండి ఎందుకు నిజం చెప్పడం లేదు, నేను మంచిగా బతుకుతుంటే నాలోని మృగాడ్ని నిద్ర లేపింది మీరిద్దరు అని మాధవ కోపంగా అంటాడు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నువ్వు ప్రాణాలతో ఉండవని ఆదిత్య వార్నింగ్ ఇస్తాడు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు ఆఫీసర్ కష్టాలు ఇంక పెరుగుతాయని అంటాడు.. ఆదిత్య మాధవని కొట్టబోతే టైం కి దేవి వస్తుంది. సారు నాకు మా నాయన కావాలి, మా నాన్న ఎంత గలిజోడు అయినఅ పరవాలేదు నాకు నాయనేగా అని ఏడుస్తూ అడుగుతుంది. ఆ మాటలకి మాధవ పైశాచిక ఆనందం పొందుతాడు.   

Published at : 17 Aug 2022 08:36 AM (IST) Tags: devatha serial devatha serial today episode Devatha Serial Today Devatha Serial Today Episode Written Update Devatha Serial August 17th

సంబంధిత కథనాలు

Shrihan: హీరోగా మారిన బిగ్ బాస్ కంటెస్టెంట్ - ‘ఆవారా జిందగీ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు!

Shrihan: హీరోగా మారిన బిగ్ బాస్ కంటెస్టెంట్ - ‘ఆవారా జిందగీ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు!

Navya Swami - Ravi Krishna: మొత్తానికి ఒప్పేసుకుంది - రవికి ఆ మాట చెప్పేసి షాకిచ్చిన నవ్యస్వామి

Navya Swami - Ravi Krishna: మొత్తానికి ఒప్పేసుకుంది - రవికి ఆ మాట చెప్పేసి షాకిచ్చిన నవ్యస్వామి

Bigg Boss 6 Telugu: ఏం ఫిట్టింగ్ పెట్టావు బిగ్‌బాస్, ఇలాంటి నామినేషన్ అని పాపం ఊహించి ఉండరు, నామినేషన్లో ఆ ఎనిమిది మంది

Bigg Boss 6 Telugu: ఏం ఫిట్టింగ్ పెట్టావు బిగ్‌బాస్, ఇలాంటి నామినేషన్ అని పాపం ఊహించి ఉండరు, నామినేషన్లో ఆ ఎనిమిది మంది

Hunt Movie Teaser : నన్ను ఎవరూ ఆపలేరు - సుధీర్ బాబు స్టైలిష్ యాక్షన్ అవతార్ 

Hunt Movie Teaser : నన్ను ఎవరూ ఆపలేరు - సుధీర్ బాబు స్టైలిష్ యాక్షన్ అవతార్ 

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

టాప్ స్టోరీస్

AP BJP : ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

AP BJP :  ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Palnadu District News: పల్నాడులో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమం, కారులోనే వదిలి నిందితులు పరార్

Palnadu District News: పల్నాడులో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమం, కారులోనే వదిలి నిందితులు పరార్