News
News
X

Devata July 2nd Episode: ఆదిత్యతో కలిసి ఉన్న ఫోటో చూసి మురిసిన దేవి, మాధవకి వార్నింగ్ ఇచ్చిన రాధ

రుక్మిణీ కేంద్రంగా సాగిన దేవత సీరియల్ ప్రస్తుతం దేవి చుట్టూ తిరుగుతుంది. దేవి కోసం అటు మాధవ ఇటు ఆదిత్య ఆరాటపడుతున్నారు. నేటి ఎపిసోడ్(588) లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

స్కూల్లో దేవి వాళ్ళ  కోసం భాగ్యమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. పిల్లలు చూడకుండా వెళ్లిపోతూ ఉంటే భాగ్యమ్మ పిలుస్తుంది. ‘‘నా దగ్గర డబ్బులు ఉంచేసి పోయినారు ఉండండి చిల్లర ఇస్తాను’’ అని అంటుంది. ఇక చిల్లర లేకపోవడంతో బయటకి వెళ్ళి తెసుకొస్తాను అని వెళ్ళిపోతుంది. భాగ్యమ్మ స్కూల్ బయట రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక కార్ వేగంగా పక్క నుంచి వెళ్తుండటంతో వాళ్ళని తిడుతుంది. కార్ ఆగిన వెంటనే అందులో నుంచి దేవుడమ్మ దిగుతుంది. ‘‘నువ్వేంటి భాగ్యమ్మ ఇక్కడ’’ అని దేవుడమ్మ అడుగుతుంది. ‘‘నేనొక విషయం చెప్పాలనుకున్న కానీ నువ్వు ఇంట్లో లేవు’’ అని రుక్మిణీ బ్రతికే ఉందట అని చెప్తుంది. 

అప్పుడే స్కూల్ దగ్గరకి రుక్మిణీ వస్తుంది. దేవుడమ్మకి కొంచెం దూరంలో దేవి రుక్మిణీ ఉంటారు. వాళ్ళని చూసి భాగ్యమ్మ షాక్ అవుతుంది. అదేమీ తెలియని దేవుడమ్మ రుక్మిణీ గురించి మాట్లాడుతుంది. రుక్మిణీ బ్రతికే ఉందని స్వామీజీ చెప్పారు తాను ఇంట్లో నుంచి వెళ్లిపోయేటప్పటికి కడుపులో బిడ్డ కూడా ఉందట అని చెప్తుంది. తల్లి బిడ్డలు ఎక్కడో క్షేమంగా ఉన్నారని స్వామీజీ చెప్పారని ఆ మాటలు విన్న దగ్గర నుంచి నాకు ఇంకా నమ్మకం  పెరిగిందని సంతోషంగా చెప్తుంది. కానీ రుక్మిణీ ఎక్కడ ఉందో తెలియడం లేదని అంటుంది. 

రుక్మిణీ ఎక్కడ ఉన్న ఇంటికి వచ్చేలా చేయమని రోజు పూజలు చేస్తున్నాని  అంటుంది. ఇక దేవుడమ్మ వెనక ఉన్న రుక్మిణీని ఎక్కడ చూస్తుందో అని భాగ్యమ్మ టెన్షన్ పడుతుంది. అక్కడ నుంచి దేవుడమ్మని పంపించాలని భాగ్యమ్మ ప్రయత్నిస్తుంది. ఇంటికి వెళ్దాం పద అంటూ భాగ్యమ్మ ని దేవుడమ్మ తీసుకుని  వెళ్ళిపోతుంది. ఇక రాధ కూడా పిల్లలని తీసుకుని వెళ్ళిపోతుంది. 

పిల్లలు ఇంటికి రాగానే నాయన అంటూ ఇద్దరు వెళ్ళి మాధవని కౌగిలించుకుంటారు. ఇక మాధవ దేవికి బహుమతి తెచ్చానని అంటాడు. రాధ కోపంగా మాధవని చూస్తూ నేను కూడా నీకు బహుమతి తెచ్చిన సమయం వొచ్చినప్పుడు ఇద్దామని ఉన్నా తీసుకొస్తా ఉండు అంటూ లోపలికి వెళ్తుంది. ఆదిత్య దేవి కలిసి దిగి ఉన్న ఫోటో ని ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చి దేవికి ఇస్తుంది. అది చూసి దేవి మురిసిపోతుంటే మాధవ రగిలిపోతాడు. ఒక్కరే ఉంటే ఏ బొమ్మ మంచిగా ఉండదు ఎవరితో ఉంటే మంచిగా ఉంటుందో వాళ్ళతో గీయలే అది బొమ్మ లెక్క అని రాధ మాధవకి కౌంటర్ ఇస్తుంది. వెంటనే మాధవ ఆదేముందిలే గోడకి తగిలించుకునేది మీరు  ఆడుకోవడానికి మంచి బొమ్మలు తీసుకొచ్చాను అని అంటాడు. వెంటనే ట్యాబ్  ఇచ్చి మీకోసం చాలా గేమ్స్ ఎక్కించానని అంటాడు. దాన్ని తీసుకున్న పిల్లలు సంతోషంగా చూస్తూ ఉంటే రాధ కోపంగా దాన్ని లాగేస్తుంది. చదువుకునే పిల్లలకి గీసువంటివెన ఇచ్చేది అని రాధ కోపంగా మాధవని తిడుతుంది. 

అప్పుడప్పుడు ఆడుకుంటామని దేవి అంటుంది కానీ రాధ వినకుండా ఆడుకోడానికి స్కూల్ లో, ఇంటి ముందు జాగా ఉంది అని కోప్పడుతుంది. దీంతో పిల్లలు లోపలికి వెళ్లిపోతారు. పిల్లలకి ఇచ్చే బహుమతి కూడా తీసుకుంటావ్ ఏంటి రాధ అని మాధవ అడుగుతాడు. పిల్లలకి ఇచ్చేది ఉపయోగంగా ఉండాలి ఇలాంటివి కాదు నీ ఇష్టానికి చేసావంటే మంచిగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది. ఇక భాగ్యమ్మ ని దేవుడమ్మ ఇంటికి తీసుకుని వస్తుంది. అమ్మని చూసి సత్య చాలా సంతోషిస్తుంది. కమల, భాష భాగ్యమ్మని కోపంగా చూస్తుంటే ఆమె అక్కడ నుంచి  వెళ్ళిపోతుంది. మా దగ్గర నువ్వు ఏదో దాస్తున్నవని కమల వాళ్ళు ప్రశ్నిస్తారు. నా  కడుపులో పెరుగుతున్న బిడ్డ మెడ ఒట్టు పెట్టి చెప్పు రుక్మిణీ గురించి నేకు తెలుసు కదా అని ప్రశ్నిస్తారు. అదంతా వింటున్న ఆదిత్య వెంటనే వచ్చి భాగ్యమ్మని  అమ్మ పిలుస్తుంది అని అబద్దం చెప్పి పంపించేస్తాడు. సీన్ కట్ చేస్తే మాధవ వాళ్ళ ఇంట్లో రామూర్తి దేవిని పొగుడ్తూ ఉంటాడు. స్కూల్లో చాలా బాగా మాట్లాడవని మెచ్చుకుంటాడు. ఆఫీసర్ సర్ లెక్క నేను కూడా కలెక్టర్ అవుతానని దేవి అంటుంటే అది చూసి రామూర్తి  దంపతులు మురిసిపోతారు. అక్కడికి మాధవ వస్తాడు. తన చేతి మీద ఉన్న పచ్చ బొట్టు చూసి దేవి బాధపడుతుంది. నేటితో ఎపిసోడ్ ముగుస్తుంది.   

Also Read: ఇంటింటి గృహలక్ష్మి జులై 2 - తులసి స్కెచ్, రోడ్డు మీద పరుగులు పెట్టిన లాస్య, భాగ్య

Published at : 02 Jul 2022 10:59 AM (IST) Tags: Devata Serial July 2nd Devata Today Episode Devata Serial Today Episode

సంబంధిత కథనాలు

Khudiram Bose: భరత మాత ముద్దుబిడ్డ 'ఖుదీరాం బోస్' బయోపిక్, ఇదిగో టైటిల్ అనౌన్స్‌మెంట్‌

Khudiram Bose: భరత మాత ముద్దుబిడ్డ 'ఖుదీరాం బోస్' బయోపిక్, ఇదిగో టైటిల్ అనౌన్స్‌మెంట్‌

తరణ్ ఆదర్శ్ రివ్యూ: ‘లాల్ సింగ్ చడ్డా’ అలా - ‘రక్షాబంధన్’ ఇలా, బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుందా?

తరణ్ ఆదర్శ్ రివ్యూ: ‘లాల్ సింగ్ చడ్డా’ అలా - ‘రక్షాబంధన్’ ఇలా, బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుందా?

Laal Singh Chaddha Review - లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?

Laal Singh Chaddha Review - లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?

Rishabh Pant on Urvashi Rautela: నన్ను వదిలెయ్‌ చెల్లెమ్మా! ఊర్వశి రౌటెలాపై పంత్‌ పంచ్‌లు!

Rishabh Pant on Urvashi Rautela: నన్ను వదిలెయ్‌ చెల్లెమ్మా! ఊర్వశి రౌటెలాపై పంత్‌ పంచ్‌లు!

Allu Arjun: రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్ - అభిమానుల కోసమే అలా చేశాడట!

Allu Arjun: రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్ - అభిమానుల కోసమే అలా చేశాడట!

టాప్ స్టోరీస్

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !

Munugode Congress :

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !

Maharastra News : మహారాష్ట్రలో మరో పార్థా - లీడర్ మాత్రేమ కాదు నోట్ల గుట్టలు మాత్రం సేమ్ టు సేమ్ !

Maharastra News : మహారాష్ట్రలో మరో పార్థా - లీడర్ మాత్రేమ కాదు నోట్ల గుట్టలు మాత్రం సేమ్ టు సేమ్ !