Devara Movie : ‘దేవర’ సెట్స్‌లో ఎన్టీఆర్, సైఫ్ యాక్షన్ సీక్వెన్స్ షూట్.. ఇది సినిమాకే హైలెట్ అట!
జూ.ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం ‘దేవర’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతోంది. స్పెషల్ సెట్స్ లో ఎన్టీఆర్, సైఫ్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.
‘RRR’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం ‘దేవర’ అనే సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘RRR’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ చివరి నాటికి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సినిమాకు సంబంధించిన VFX పనులు కూడా మొదలైనట్లు సమాచారం.
స్పెషల్ సెట్స్‌లో ఎన్టీఆర్, సైఫ్ యాక్షన్ సీక్వెన్స్ షూట్
‘దేవర’ను హై వోల్టేజ్ట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా వెండితెరపై చిత్రీకరించేందుకు దర్శకుడు కొరటాల శివ, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్లో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ మధ్య అదిరిపోయే యాక్షన్ సీన్స్ రూపొందిస్తున్నారట. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో పెద్ద సంఖ్యలో ఫైటర్స్ పాల్గొంటున్నారట. సైఫ్ అలీ ఖాన్‌తో ఎన్టీఆర్ చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలువబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అండర్ వాటర్ సన్నివేశాలను చేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు సైఫ్‌తో ఫైట్ సీన్లు చేస్తున్నారట. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను రంగంలోకి దించారు కొరటాల. అభిమానుల అంచనాలకు సైతం అందరిని రీతిలో ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
రెండు మూడు రోజులు జోరుగా ‘దేవర’ చర్చ
ఇక ‘దేవర’ సినిమా గురించి గత రెండు మూడు రోజులు చర్చ జరుగుతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే, రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ ఒకేసారి పూర్తి చేస్తారా? లేదంటే? ఫస్ట్ పార్ట్ విడుదలైన తర్వాత చేస్తారా? అనే విషయాన్ని ప్రస్తుతం వెల్లడించలేదు.
వచ్చే ఏడాది సమ్మర్ లో ‘దేవర 1’ విడుదల
‘దేవర’ మొదటి భాగం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రాబోతుంది. రెండో పార్ట్‌కి సంబంధించిన విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 2025లో రెండో పార్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ‘వార్ 2’లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారు.
Read Also: ‘లియో’ స్టోరీని హాలీవుడ్ మూవీ నుంచి కొట్టేశారా - సాక్ష్యం ఇదిగో!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial