Deepavali Movie Trailer: 'దీపావళి' మూవీ నుంచి క్రేజీ అప్ డేట్, ట్రైలర్ రిలీజ్ చేయనున్న రామ్ పోతినేని
స్రవంతి మూవీస్ నిర్మించిన తాజా తమిళ చిత్రం ‘కిడ’. తెలుగులో ‘దీపావళి’ పేరుతో విడుదల కానుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రామ్ పోతినేని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ప్రముఖ నిర్మాత స్రవింతి రవి కిశోర్ తమిళంలో నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘కిడ’. ఆర్ఎ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. నవంబర్ 11న తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ మూవీ ట్రైలర్ ను ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఈనెల 26న ‘దీపావళి’ ట్రైలర్ విడుదల
తెలుగు సినిమా పరిశ్రమలో స్రవంతి మూవీస్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 'లేడీస్ టైలర్'తో సినిమా రంగంలోకి తొలి అడుగు వేసింది. ఈ 38 ఏళ్ళ ప్రయాణంలో 'స్రవంతి' రవికిశోర్ 38 చిత్రాలు నిర్మించారు. ఆయన నిర్మించిన పలు చిత్రాలు చక్కటి ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. చక్కటి కంటెంట్ తో తెరకెక్కి అద్భుత విజయాలు సాధాంచాయి. ఎన్నో గొప్ప చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు కిశోర్. స్రవంతి మూవీస్ సంస్థలో 38వ సినిమాగా 'కిడ' అనే తమిళ సినిమా నిర్మితం అయ్యింది.. 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా కూడా ఇదే కావడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 26న ట్విట్టర్ వేదికగా ఈ సినిమా ట్రైలర్ ను హీరో రామ్ పోతినేని విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
Critically Acclaimed movie #Deepavali Trailer will be unveiled by our Ustaad @ramsayz on OCT 26th at 6PM❤️🔥
— Sri Sravanthi Movies (@SravanthiMovies) October 24, 2023
Releasing in Theaters on November 11th. 💥
Directed by #RAVenkat.#SravanthiRaviKishore @kaaliactor pic.twitter.com/4XDok6hvH4
'దీపావళి' కథ ఏంటంటే?
'దీపావళి'లో ఓ తాత, మనవడు, మేక చుట్టూ కథ తిరుగుతుంది. అలాగే, అందమైన ప్రేమకథ కూడా ఉంది. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ దర్శకుడు వెంకట్ రాసిన కథ నచ్చడంతో 'స్రవంతి' రవికిశోర్ నిర్మించడానికి ముందుకొచ్చారు. 'దిల్' రాజు ఏ విధంగా అయితే 'బలగం' తీశారో... ఆ తరహాలో మానవ సంబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన సినిమా 'దీపావళి'.
ఇక ఈ సినిమలో రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎం. జయప్రకాశ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆడియోగ్రాఫర్ గా తపస్ నాయక్, ఆర్ట్ డైరెక్టర్ గా కె.బి. నందు, లిరిసిస్ట్ గా రాంబాబు గోసాల, ఎడిటర్ గా ఆనంద్ గెర్లడిన్ బాధ్యతలు నిర్వహించారు. థీసన్ అదిరిపోయే సంగీతం అందించారు. ఈ చిత్రం నవంబర్ 11న తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. స్రవంతి కిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
Read Also: సంక్రాంతి బరిలో మరో పెద్ద మూవీ, ‘తంగలాన్’తో రెడీ అంటున్న విక్రమ్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial