అన్వేషించండి

Pongal 2024 : సంక్రాంతి బరిలో మరో పెద్ద మూవీ, ‘తంగలాన్’తో రెడీ అంటున్న విక్రమ్!

సంక్రాంతి వస్తుందంటే చాలా టాలీవుడ్ లో పెద్ద సినిమాలు విడుదలకు రెడీ అవుతాయి. వచ్చే సంక్రాంతి కోసం ఇప్పటికే పలు సినిమాల రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యాయి. ఇప్పుడు మరో పెద్ద సినిమా బరిలోకి దిగబోతోంది.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ పండగకు చుట్టాలు పక్కాలు అంతా సొంతూళ్లకు చేరుకుని మూడు రోజుల పాటు అంగరంగం వైభవంగా వేడుక చేసుకుంటారు. ఇక సంక్రాంతి సీజన్ అంటే చాలు టాలీవుడ్ లో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలు పొంగల్ బరిలో నిలుస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని టార్గెట్ చేసుకుని ఇప్పటికే అర డజన్ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మహేష్ బాబు ‘గుంటూరుకారం’, వెంకటేష్ ‘సైంధవ్’, రవితేజ ‘ఈగల్’, ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సహా పలు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి.   

తమిళంలోనూ పొంగల్ కు పెద్ద సినిమాల విడుదల

తెలుగులోనే కాదు, తమిళ నాట కూడా సంక్రాంతికి చాలా సినిమాలు విడుదల అవుతుంటాయి. ఈ ఏడాది పొంగల్ కు విడుదలైన అజిత్ ‘తునివు’, విజయ్ దళపతి ‘వారిసు’ సినిమాలు చక్కటి విజయాన్ని అందుకున్నాయి. వచ్చే ఏడాది కోసం పలు సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే శివ కార్తికేయన్ మూవీ ‘అయలాన్’ సంక్రాంతికి విడుదలకాబోతోంది. శివ కార్తికేయన్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా రూపొందుతున్నఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఆర్‌. రవికుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని కోటపాడి రాజేష్‌, ఆర్‌ డి.రాజా నిర్మిస్తున్నారు.

సంక్రాంతి బరిలో విక్రమ్ మూవీ

తాజా సమాచారం ప్రకారం రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ‘తంగలాన్’ మూవీ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించకపోయినా, ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో  విక్రమ్ సరికొత్త గెటప్ లో కనిపించనున్నారు. ‘తంగలాన్’ అనే ఆదివాసి తెగకు చెందిన వ్యక్తిగా నటిస్తున్నారు. సినిమాలో చాలా వరకు అతడు కేవలం గోచీతోనే కనిపించనున్నాడు.  యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో పీరియాడికల్ జానర్ లో ఈ మూవీ రూపొందుతోంది. పాన్ ఇండియా సినిమాగా పా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘తంగలాన్’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఇందులో మాళవిక వారియర్ రోల్‌లో కనిపించింది.  

నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ‘తంగలాన్’

ఇక ‘తంగలాన్’  సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ తో పాటు, పార్వతి హీరోయిన్ గా నటిసతోంది. పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. చియాన్ విక్రమ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియా తో పాటు విదేశీ భాషల్లో 2డీ, 3డీలో విడుదలకు సిద్ధమవుతోంది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాని స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్లపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.

Read Also: ‘మంగళవారం‘ కోసం అంత రిస్క్ చేసిందా? అసలు విషయం బయటపెట్టిన హాట్ బ్యూటీ!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today August 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – గుడిలో ఎంక్వైరీ చేసిన భ్రమరాంబ  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – గుడిలో ఎంక్వైరీ చేసిన భ్రమరాంబ  
Illu Illalu Pillalu Serial Today August 4th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భద్రావతితో వల్లీ చేతులు కలిపిందని తెలుసుకున్న నర్మద ఇంతలోనే..! ధీరజ్‌ని గెంటించేసిన ప్రేమ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భద్రావతితో వల్లీ చేతులు కలిపిందని తెలుసుకున్న నర్మద ఇంతలోనే..! ధీరజ్‌ని గెంటించేసిన ప్రేమ!
Kalyan: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Jagadhatri Serial Today August 3rd:వైజయంతి చావుకొచ్చిన శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: వైజయంతి చావుకొచ్చిన శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్‌

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Embed widget