Dasara: రూ.80 కోట్ల రేంజ్‌లో నాని సినిమా బిజినెస్ - కెరీర్‌లోనే హయ్యెస్ట్!
'దసరా' సినిమా థియేట్రికల్ బిజినెస్ సింగిల్ పాయింట్ కింద అమ్మేశారు.
నేచురల్ స్టార్ నాని ఇటీవల 'అంటే సుందరానికి' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ హీరో 'దసరా' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది.
గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నాని రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నారు. 'దసరా'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. దానికి తగ్గట్లే సినిమా బిజినెస్ కూడా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన నాన్ థియేట్రికల్ బిజినెస్ ను పూర్తి చేశారు. నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలుపుకొని రూ.50 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది.
ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ కూడా సింగిల్ పాయింట్ కింద అమ్మేశారు. ఓవర్సీస్ మినహా మిగిలిన థియేటర్ హక్కులను రూ.27 కోట్లకు అమ్మేశారు. చదలవాడ శ్రీనివాసరావు ఈ సినిమాను కొనుక్కున్నట్లు తెలుస్తోంది. అంటే ఇప్పటివరకు ఎనభై కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగిందన్నమాట. నిజానికి నాని సినిమాలకు ముప్పై నుంచి నలభై కోట్ల రేంజ్ లో ఖర్చవుతుంది. కానీ ఈ సినిమాకి రూ.70 కోట్ల వరకు అవుతుందట.
అవి కాకుండా పబ్లిసిటీ ఖర్చులు, వడ్డీలు ఎలాగూ ఉంటాయి. అలా చూసుకుంటే సినిమాకి మరింత ఎక్కువ బిజినెస్ జరగాలి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ లవ్ ప్లాట్ ప్లాన్ చేశారు దర్శకుడు. రిచ్ అమ్మాయి.. స్లమ్ లో ఉండే అబ్బాయిని ప్రేమించడం ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల 'దసరా' సినిమాలో కూడా ఇలాంటి ఒక లవ్ స్టోరీని చూపించబోతున్నారు. రాజుగారి కోట లాంటి ఇంట్లో ఉండే హీరోయిన్.. స్లమ్ లో ఉండే హీరోని ప్రేమిస్తుంది. ఈ ఎపిసోడ్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసినట్లు సమాచారం. సినిమాకి ఇదొక ప్లస్ పాయింట్ అవుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్, నవీన్ నూలి ఎడిటర్. వచ్చే ఏడాది (2023), మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : గుణశేఖర్ అవుట్ - త్రివిక్రమ్ చేతికొచ్చిన రానా డ్రీమ్ ప్రాజెక్ట్!
Also Read : మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలే - సినిమా జానర్ రివీల్ చేసిన రాజమౌళి