Samantha Defamation Case: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన..
సమంత వేసిన పరువు నష్టం దావా కేసులో ఎట్టకేలకు కోర్టు తీర్పు ఇచ్చింది.
హీరోయిన్ సమంత తన భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేయకముందు నుంచే మీడియాలో వార్తలు వచ్చాయి. అఫీషియల్ గా చెప్పిన తరువాత సమంతను టార్గెట్ చేస్తూ కొన్ని వార్తలు వచ్చాయి. సమంత విడాకులకు కారణమిదే అంటూ యూట్యూబ్ లో కొన్ని విశ్లేషణలు కూడా వచ్చాయి. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ అయితే ఆమెకి ఎఫైర్ ఉందని.. అందుకే పెళ్లి బంధాన్ని తెంచుకుందని వార్తలు ప్రచురించాయి. దీంతో సమంత తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన యూట్యూబ్ ఛానెల్స్ పై పరువు నష్టం దావా కేసు వేసింది.
Also Read: 'నేను.. మానస్ టాప్ 5 లో ఉంటాం..' పింకీ కాన్ఫిడెన్స్ చూశారా..?
కొన్ని రోజులుగా హైదరాబాద్ కూకట్ పల్లిలోని న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరుగుతోంది. తాజాగా ఈ కేసులో సమంతకు ఊరట లభించింది. సమంత వ్యక్తిగత వివరాలు ఎవరూ ప్రసారం చేయకూడదని, యూట్యూబ్ ఛానల్స్‌లో ఆమెకి సంబంధించిన వీడియోలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. సమంత కూడా తన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మానుకోవాలని సూచించింది.
సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ డాక్టర్ సీఎల్ వెంకట్రావుతో పాటు సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ యూట్యూబ్ ఛానళ్లపై సమంత కేసు పెట్టింది. నాగచైతన్యతో ముగిసిన తన వైవాహిక జీవితానికి సంబంధించి అసత్య ప్రచారాలు చేస్తూ తనను అవమానించారని.. సమంత పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న అనంతరం కోర్టు మంగళవారం నాడు తీర్పునిచ్చింది. ఆ రెండు యూట్యూబ్ ఛానెల్స్, సీఎల్ వెంకట్రావు ప్రసారం చేసిన వీడియో లింక్స్‌ని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అలానే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడానికి ఛాన్స్ మీరే ఇస్తున్నారంటూ పరోక్షంగా జడ్జి కామెంట్ చేశారు. అలానే విడాకుల విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడాన్ని పాయింట్ అవుట్ చేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. సమంత కెరీర్ పరంగా బిజీ అవ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే తెలుగులో 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసింది. రీసెంట్ గా ఓ బైలింగ్యువల్ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. అలానే తెలుగులో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతుంది. త్వరలోనే బాలీవుడ్ సినిమాను కూడా అనౌన్స్ చేయబోతుంది.
Also Read: 'గని' యాంథెమ్.. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని'..
Also Read: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?
Also Read: వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని... తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని అంటున్న చిరంజీవి!
Also Read: సర్కారు వారి పాట... ఇంతే ఒక వెయ్యి... లీకయ్యిందిగా!
Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి