Yogi Babu: తెలుగులో ఎంట్రీ ఇస్తున్న కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు... బర్త్ డేకి ఫస్ట్ లుక్ రిలీజ్, ఆ సినిమా తెల్సా?
Yogi Babu Telugu Movies: కోలీవుడ్ పాపులర్ కమెడియన్ యోగి బాబు తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. నరేష్ అగస్త్య 'గుర్రం పాపిరెడ్డి'లో నటిస్తున్నారు. ఆ సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

కోలీవుడ్ పాపులర్ కమెడియన్ యోగి బాబు (Yogi Babu) తెలుగులోనూ ఫేమస్. డబ్బింగ్ సినిమాల ద్వారా ఏపీ, తెలంగాణ జనాలకు తెలిశారు. ఇప్పుడు ఆయన తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్'లో నటిస్తున్నారు. అలాగే, మరొక సినిమా 'గుర్రం పాపిరెడ్డి' కూడా చేస్తున్నారు. నిజానికి ఆయన ఫస్ట్ ఓకే చేసిన తెలుగు సినిమా అదే. అందులో ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఉడ్రాజుగా యోగిబాబు...
'గుర్రం పాపిరెడ్డి' సినిమాలో!
నరేష్ అగస్త్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'గుర్రం పాపిరెడ్డి' (Gurram Paapi Reddy Movie). ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. డాక్టర్ సంధ్య గోలీ సమర్పణలో వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో యోగి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ (జూలై 22న) ఆయన పుట్టినరోజు (Yogi Babu Birthday) సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
Team #GurramPaapiReddy - Wishing the massy madness himself ‘Udraju’ - @iYogiBabu garu a power-packed Happy Birthday! 🎉#HBDYogiBabu pic.twitter.com/ROCX9MFScS
— Suresh PRO (@SureshPRO_) July 22, 2025
యోగి బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ విడుదల చేసిన బర్త్ డే పోస్టర్‌లో ఆయన ఉడ్రాజు పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు. నిర్మాతలు ఈ సినిమా గురించి మాట్లాడుతూ... ''డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు తెరపై చూడని కాన్సెప్ట్‌తో మా దర్శకుడు మురళీ మనోహర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో యోగి బాబు గారి పర్ఫార్మెన్స్ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. క్యారెక్టర్లు అన్నిటినీ హైదరాబాద్ సిటీ బ్యాక్డ్రాప్ లో కాంటెంపరరీగా, స్టైలిష్ గా దర్శకుడు మురళీ మనోహర్ డిజైన్ చేశారు'' అని చెప్పారు.
Gurram Paapi Reddy Movie Cast: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న 'గుర్రం పాపిరెడ్డి' సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు ప్రధాన తారాగణం.





















