అన్వేషించండి

Yatra 2 Twitter Review: క్లైమాక్స్‌లో రియల్ జగన్ ఎంట్రీ - 'యాత్ర 2'పై ఆడియన్స్ ఏమంటున్నారంటే?

YS Jagan's Yatra 2 twitter review in Telugu: వైఎస్ జగన్ జీవితం ఆధారంగా మహి వి రాఘవ్ తీసిన సినిమా 'యాత్ర 2'. యూకేలో ప్రీమియర్ షో పూర్తి అయ్యింది. ఆడియన్స్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం

Yatra 2 Movie Review Telugu: వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా 'యాత్ర' తీసిన దర్శకుడు మహి వి రాఘవ్... ఆయన మరణం నుంచి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన కాలాన్ని తీసుకుని, అప్పట్లో జరిగిన అంశాల నేపథ్యంలో 'యాత్ర 2' తీశారు. విజయవాడలోని జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు విడుదలకు ఒక్క రోజు ముందు స్పెషల్ షో వేశారు. అమెరికా, యూకేలోని కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు సైతం పూర్తి అయ్యాయి. మరి, ఈ సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారు? వాళ్ల రియాక్షన్ & సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది? ఒక్కసారి చూడండి. 

వైఎస్ఆర్‌సీపీ అభిమానులకు నచ్చుతుంది...
ప్రత్యర్థి పార్టీ వాళ్లకు తలనొప్పిలా ఉంటుంది!
'యాత్ర 2'కు రేటింగ్ ఇవ్వడం  కష్టమని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. వైఎస్ఆర్‌సీపీ అభిమానులకు ఇది బ్రిలియంట్ సినిమా అన్నారు. అపోజిషన్ పార్టీ అభిమానుల విషయానికి వస్తే తలనొప్పిలా ఉంటుందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ పాత్రలో జీవా అద్భుతంగా నటించాడని చెప్పారు. అచ్చం జగన్ తరహాలో ఉన్నాడని, ఈ సినిమాలో డైలాగ్స్ బావున్నాయని తెలిపారు.

Also Read: 'విరూపాక్ష'తో పోలికలు... పెళ్లి పుకార్లు... 'ఊరు పేరు భైరవకోన' సంగతులు... వర్ష బొల్లమ్మ ఇంటర్వ్యూ

సినిమా చివర్లో స్క్రీన్ మీద కనిపించిన జగన్!
'యాత్ర' గుర్తుందా? చివర్లో ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి పాత్రధారి మమ్ముట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్క్రీన్ మీద రియల్ రాజశేఖర్ రెడ్డిని మహి వి రాఘవ్ చూపించారు. 'యాత్ర 2'లో కూడా ఆయన సేమ్ మేజిక్ రిపీట్ చేశారు. సినిమా చివరలో స్క్రీన్ మీద జగన్ మోహన్ రెడ్డిని చూపించారు. ఆ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. 

'పిల్లిని తీసుకువెళ్లి అడవిలో వదిలిస్తే అది పిల్లే. కానీ, అక్కడ ఉన్నది పులి. అడవిలో ఉన్నా, బోనులో ఉన్నా గర్జిస్తుంది' అని మూవీలో డైలాగ్ కూడా ట్వీట్ చేశారు.

Also Read: తమిళ్, హిందీలో అనసూయ సినిమా రీమేక్ - విడుదలకు ముందు క్రేజీ ఆఫర్స్!

స్టార్టింగ్ నుంచి గూస్ బంప్స్ గ్యారెంటీ!
'యాత్ర 2' బెస్ట్ బయోపిక్ అని మరో నెటిజన్ పేర్కొన్నారు. దర్శకుడు మహి వి రాఘవ్ స్టార్టింగ్ నుంచి గూస్ బంప్స్ వచ్చేలా సినిమా తీశారని తెలిపారు. ఇంతకు ముందు జగన్ మీద కొంచెం ద్వేషం ఉన్నప్పటికీ అది ప్రేమలా మారిందని, 4/5 రేటింగ్ ఇస్తున్నానని చెప్పారు. 'యాత్ర 2'కు మరొక నెటిజన్ 3/5 రేటింగ్ ఇవ్వగా... ఇంకొకరు హేటర్స్ అయితే 1/5 ఇస్తారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మీద వ్యతిరేకత సోషల్ మీడియాలోనూ కనబడుతోంది. సినిమా బాలేదని ట్వీట్స్ చేస్తున్న నెటిజనులు కూడా ఉన్నారు.

Also Readకుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మూసేయడానికి మేం కారణం కాదు - హీరోయిన్ వర్ష ఏమన్నారంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun to Sandhya Theater: పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్తారా! అసలేం జరుగుతోంది?
Allu Arjun to Sandhya Theater: పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్తారా! అసలేం జరుగుతోంది?
Tirumala : తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
తిరుపతిలో అపచారం - అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
Allu Arjun At Chikkadapalli Police Station: విచారణకు హాజరైన అల్లు అర్జున్ - లాయర్ సమక్షంలో బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు
విచారణకు హాజరైన అల్లు అర్జున్ - లాయర్ సమక్షంలో బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు
Telangana News: తెలంగాణ హైకోర్టులో మాజీ సీం కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
తెలంగాణ హైకోర్టులో మాజీ సీం కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun to Sandhya Theater: పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్తారా! అసలేం జరుగుతోంది?
Allu Arjun to Sandhya Theater: పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్తారా! అసలేం జరుగుతోంది?
Tirumala : తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
తిరుపతిలో అపచారం - అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
Allu Arjun At Chikkadapalli Police Station: విచారణకు హాజరైన అల్లు అర్జున్ - లాయర్ సమక్షంలో బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు
విచారణకు హాజరైన అల్లు అర్జున్ - లాయర్ సమక్షంలో బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు
Telangana News: తెలంగాణ హైకోర్టులో మాజీ సీం కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
తెలంగాణ హైకోర్టులో మాజీ సీం కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
Unstoppable 4 Latest Promo: మోసం చేశారంటూ ఎమోషనలైన వెంకటేష్ - 'అన్‌స్టాపబుల్ 4' వెంకీ మామతో బాలయ్య ప్రోమో వచ్చేసిందోచ్
మోసం చేశారంటూ ఎమోషనలైన వెంకటేష్ - 'అన్‌స్టాపబుల్ 4' వెంకీ మామతో బాలయ్య ప్రోమో వచ్చేసిందోచ్
Viral News: పుష్ప 2 సినిమా చూసొచ్చి ఏకంగా బస్సు ఎత్తుకెళ్లాడు, ట్విస్ట్ ఏంటంటే!
పుష్ప 2 సినిమా చూసొచ్చి ఏకంగా బస్సు ఎత్తుకెళ్లాడు, ట్విస్ట్ ఏంటంటే!
Prayagraj Mahakumbh 2025 : రూ.5కే మహా కుంభమేళా చరిత్ర..ప్రయాగ్ రాజ్ లో ఏర్పాట్లు మొత్తం టెక్నాలజీ మయం!
రూ.5కే మహా కుంభమేళా చరిత్ర..ప్రయాగ్ రాజ్ లో ఏర్పాట్లు మొత్తం టెక్నాలజీ మయం!
TollyWood: ఫిల్మ్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకెళ్లేందుకు పవన్ ప్రయత్నాలు - ఎంత వరకు సక్సెస్ అవుతాయి ?
ఫిల్మ్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకెళ్లేందుకు పవన్ ప్రయత్నాలు - ఎంత వరకు సక్సెస్ అవుతాయి ?
Embed widget