అన్వేషించండి

Kumari Aunty: కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మూసేయడానికి మేం కారణం కాదు - హీరోయిన్ వర్ష ఏమన్నారంటే?

Varsha Bollamma on Kumari Aunty: ఫేమస్ కుమారి ఆంటీ దగ్గరకు 'ఊరు పేరు భైరవకోన' టీం భోజనం చేశారు. ఆ తర్వాత ఆమె దగ్గరకు జనాలు క్యూ కట్టారు. ట్రాఫిక్ సమస్య, గొడవలతో మధ్యలో స్టాల్ మూసేసిన సంగతి తెలిసిందే. 

Ooru Peru Bhairavakona actress Varsha Bollamma reacts on Kumari Aunty Issue: కుమారి ఆంటీ... ఇప్పుడు ఈమె గురించి తెలియని తెలుగు ప్రజలు లేరు. మీడియాలో, సోషల్ మీడియాలో ఆవిడ పాపులర్. కుమారి ఆంటీ అడ్రస్ ఎక్కడ? అని కనుక్కుని మరి ఆవిడ దగ్గర భోజనం చేయడానికి చాలా మంది వెళుతున్నారు. దాంతో దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడుతోంది. క్యూ లైన్లో నిలబడి కుమారి ఆంటీ దగ్గర భోజనాలు చేస్తున్న జనాలు ఉన్నారు. ఆ పాపులారిటీ తెలుసుకున్న 'ఊరు పేరు భైరవకోన' సినిమా టీం కుమారి ఆంటీ దగ్గరకు వెళ్ళింది.

కుమారి ఆంటీ దగ్గర భోజనం చేసిన సందీప్ కిషన్!
'వివాహ భోజనంబు' రెస్టారెంట్లలో హీరో సందీప్ కిషన్ పార్ట్నర్! ఆ పేరుతో ఆయన ఒక సినిమా కూడా ప్రొడ్యూస్ చేశారు. తనకు రెస్టారెంట్ ఉన్నప్పటికీ... 'ఊరు పేరు భైరవకోన' సినిమా ప్రచారం కోసం కుమారి ఆంటీ దగ్గరకు వెళ్లారు హీరో సందీప్ కిషన్. ఆయనతో పాటు దర్శకుడు వీఐ ఆనంద్, హీరోయిన్లు కావ్య థాపర్, వర్ష బొలమ్మ కూడా వెళ్లారు.

'ఊరు పేరు భైరవకోన' సినిమా టీం కుమారి ఆంటీ దగ్గరకు వెళ్లి వచ్చిన తర్వాత ఆవిడ మరింత పాపులర్ అయింది. ప్రజల తాకిడి విపరీతంగా పెరిగింది. ఒక దశలో ఆవిడ స్టాల్ మూసేశారు కూడా. ఆ విషయం హీరోయిన్ వర్షా బొల్లమ్మ దగ్గర ప్రస్తావించగా... ''కుమారి ఆంటీ స్టాల్ మూసేయడానికి మేం కారణం కాదు‌. ఆవిడ పాపులర్ కావడానికి కారణం కూడా మేము కాదు. మేము వెళ్లేసరికి ఆవిడ పాపులర్. పాపులర్ కాబట్టే మా టీం అందరం వెళ్ళాం. ఒకవేళ మేము వెళ్ళినా వెళ్లకపోయినా సరే ఆవిడ పాపులర్ అయ్యేది'' అని వర్ష సమాధానం ఇచ్చారు.

Also Read'కెజియఫ్' రూటులో పుష్పరాజ్ - ఐకాన్ స్టార్ తగ్గేది లే

Kumari Aunty: కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మూసేయడానికి మేం కారణం కాదు - హీరోయిన్ వర్ష ఏమన్నారంటే?

ఫిబ్రవరి 16న 'ఊరు పేరు భైరవకోన' విడుదల
'ఊరు పేరు భైరవకోన' సినిమాను తొలుత ఈ శుక్రవారం విడుదల చేయాలని ప్లాన్ చేశారు. 'ఈగల్' సినిమాకు సోలో రిలీజ్ కావాలని ఫిల్మ్ ఛాంబర్ కోరడంతో తమ సినిమాను వారం వాయిదా వేశారు. ఫిబ్రవరి 16న విడుదల చేస్తున్నారు.

Also Read: షాక్ ఇచ్చిన విశాల్ - రాజకీయాలపై కీలక ప్రకటన

'సామజవరగమన' విడుదల తర్వాత రాజేష్ దండా నిర్మించిన సినిమా కావడం, ఈ చిత్రానికి అగ్ర నిర్మాత అనిల్ సుంకర భాగం కావడం, ప్రచార చిత్రాలు, పాటలు హిట్ కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సూపర్ నేచురల్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం'తో దర్శకుడు వీఐ ఆనంద్ విజయాలు అందుకున్నారు. మరోసారి అటువంటి కథతో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సో, సినిమా విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి.

Also Readప్రేక్షకులకు అందుబాటులో 'ఈగల్'... మాసోడి సినిమాకు తెలంగాణ, ఏపీలో టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget