Toxic Movie Release Date : యష్ 'టాక్సిక్' మూవీ రిలీజ్ డేట్ - ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన టీం
Toxic Movie Update : రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్' మూవీ రిలీజ్ డేట్‌పై రూమర్లకు చెక్ పడింది. చెప్పిన టైంకే మూవీ రిలీజ్ చేస్తామంటూ మూవీ టీం స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.

Yash's Toxic Movie Team Clarifies About Release Date : రాకింగ్ స్టార్ యశ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న అవెయిటెడ్ మూవీ 'టాక్సిక్'. గీతూ మోహన్ దాస్ హాలీవుడ్ స్థాయికి దీటుగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుండగా... మూవీ రిలీజ్ వాయిదా పడుతుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో రూమర్స్ హల్చల్ చేశాయి. తాజాగా దీనిపై టీం క్లారిటీ ఇచ్చింది.
140 డేస్ వర్క్ లెఫ్ట్
'టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' షూటింగ్ శరవేగంగా జరుగుతుందని... ఇంకా 140 రోజుల వర్క్ మిగిలి ఉందంటూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. చెప్పిన టైంకే అంటే మార్చి 19, 2026న రిలీజ్ అవుతుందని స్పష్టం చేసింది. సినిమా రిలీజ్ వాయిదా అంటూ రూమర్స్ వచ్చిన నేపథ్యంలో ఫేమస్ ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ టీంను కలిసి క్లారిటీ తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదని దర్శక నిర్మాతలు చెప్పినట్లు వెల్లడించారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా వీఎఫ్ఎక్స్ పనులు ప్రారంభం అయ్యాయని మేకర్స్ తెలిపారు. ప్రమోషన్స్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానున్నట్లు చెప్పారు. మరోవైపు, యష్ ముంబైలో 'రామాయణ' మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ మూవీని KVN ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంగ్లీష్, కన్నడ భాషల్లో మూవీ తెరకెక్కుతుండగా... హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.
140 days to go…
— KVN Productions (@KvnProductions) October 30, 2025
His Untamed Presence,
Is Your Existential Crisis.#ToxicTheMovie releasing worldwide on 19-03-2026 https://t.co/9RC1D6xLyn
Also Read : 'బాహుబలి ది ఎపిక్' ట్విట్టర్ రివ్యూ - ఎక్స్‌పీరియన్స్ వేరే లెవల్... నెటిజన్స్ ఏమంటున్నారో తెలుసా?
ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన లుక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. హాలీవుడ్ యాక్టర్ డారెల్ డిసిల్వాతో పాటు అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు నయనతార, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ హైలైట్‌గా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. 'జాన్ విక్', 'డే షిఫ్ట్', 'ఫాస్ట్ అండ్ ఫ్రూరియస్' వంటి హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన టాప్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె జె ఫెర్రీ ఈ ప్రాజెక్టు కోసం వర్క్ చేశారు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు






















