Kamal Haasan - Ram Charan : రామ్ చరణ్ సినిమా పక్కనపెట్టి 'భారతీయుడు 2' రీ స్టార్ట్ చేయడం వెనుక అసలు కారణం ఇదే!

రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా సినిమా చేస్తున్న సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్, ఆ సినిమాను పక్కన పెట్టి 'భారతీయుడు 2' రీస్టార్ట్ చేయడం వెనుక అసలు కారణం ఇదే!

FOLLOW US: 

'విక్రమ్ : ది హిట్ లిస్ట్' సినిమాతో లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశారు. సరైన సినిమా పడితే థియేట్రికల్ బాక్సాఫీస్ దగ్గర నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించే సత్తా తనకు ఉందని నిరూపించారు. 'విక్రమ్' తర్వాత ఆయన చేయబోయే సినిమా ఏది? ఈ ప్రశ్నకు కొన్ని రోజుల క్రితమే సమాధానం లభించింది. 'విక్రమ్' కంటే ముందు కొంత షూటింగ్ చేసి, వివిధ కారణాల వల్ల పక్కన పెట్టిన 'ఇండియన్ 2' (తెలుగులో 'భారతీయుడు 2') సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళనున్నారనేది తెలిసిన విషయమే.

సెప్టెంబర్ 13 నుంచి 'ఇండియన్ 2' కొత్త షెడ్యూల్
'విక్రమ్' తర్వాత కమల్ హాసన్ 'ఇండియన్ 2' చేస్తారనేది తెలిసిన విషయమే. అయితే... ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందనేది ఎవరికీ క్లారిటీ లేదు. ఎందుకు అంటే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా 'దిల్' రాజు నిర్మాణంలో ఆయన పాన్ ఇండియా సినిమా స్టార్ట్ చేయడంతో అది పూర్తయ్యే వరకూ కమల్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళరని అంతా భావించారు. అయితే... కాజల్ అగర్వాల్ గురువారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో సెప్టెంబర్ 13 నుంచి 'ఇండియన్ 2' షూటింగ్ రీ స్టార్ట్ అవుతుందని, తాను కూడా ఆ షెడ్యూల్ లో జాయిన్ అవుతున్నానని తెలిపారు.

రామ్ చరణ్ సినిమాను పక్కన పెట్టారా? రెండూ చేస్తారా?
కాజల్ అగర్వాల్ ప్రకటన చాలా మందికి షాక్ ఇచ్చింది. 'ఇండియన్ 2' స్టార్ట్ చేస్తే... రామ్ చరణ్ (RC 15) సంగతి ఏంటి? అని మెగా అభిమానులకు డౌట్ వచ్చింది. రామ్ చరణ్ సినిమాను దర్శకుడు శంకర్ పక్కన పెట్టారా? లేదంటే పది రోజులు ఒక సినిమా షూటింగ్ చేసి, మరో పది రోజులు ఇంకో సినిమా షూటింగ్ చేస్తారా? అని!

'ఇండియన్ 2' రీ స్టార్ట్ చేయడానికి అసలు కారణం ఏంటంటే?
ఇప్పుడు 'ఇండియన్ 2' రీ స్టార్ట్ కావడానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సినిమా షూటింగులను తాత్కాలికంగా నిలిపివేయడమే ఒక కారణం అయితే... రామ్ చరణ్ లుక్ చేంజ్ మరో కారణం! మళ్ళీ షూటింగులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో? క్లారిటీ లేదు. ఈ పరిస్థితుల్లో 'ఇండియన్ 2' రీ స్టార్ట్ చేయాల్సిందిగా శంకర్‌ను నిర్మాతలు రిక్వెస్ట్ చేశారట. ఈ నెల 15 లేదంటే 16లో విశాఖలో రామ్ చరణ్ సినిమా షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేశారు. అప్పటికి నిర్మాతల చర్చలు ఒక కొలిక్కి వచ్చి షూటింగులు స్టార్ట్ చేస్తే... శంకర్ ఈ సినిమా షూటింగ్ చేస్తారు.

రామ్ చరణ్ లుక్ చేంజ్ చేయాలి!
విశాఖ షెడ్యూల్ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ కోసం హీరో రామ్ చరణ్ లుక్ చేంజ్ చేయాల్సి ఉంది. అందుకు ఎలా లేదన్నా నెల పడుతుందని టాక్. ఆ గ్యాప్ లో కమల్ 'ఇండియన్ 2' షెడ్యూల్ ప్లాన్ చేశారు. పది పదిహేను రోజుల పాటు ఆ సినిమా షూటింగ్ చేసి... ఆ తర్వాత రామ్ చరణ్ సినిమా రాజమండ్రి షెడ్యూల్ ప్లాన్ చేశారట. అదీ అసలు సంగతి!

Also Read : ‘బింబిసార’ రివ్యూ: మద గజ మహా చక్రవర్తిగా నందమూరి కళ్యాణ్ రామ్ మెప్పించారా? లేదా?

సాధారణంగా ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత మరో సినిమా స్టార్ట్ చేయడం  శంకర్‌కు అలవాటు. అయితే... కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఆయన రెండు సినిమాల షూటింగ్స్ చేయనున్నారు.

Also Read : సీతా రామం రివ్యూ: హృదయాన్ని తాకే సీతారాముల కథ!

Published at : 05 Aug 2022 01:01 PM (IST) Tags: ram charan kajal aggarwal Shankar RC 15 Movie Kamal Haasan Indian 2

సంబంధిత కథనాలు

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!

NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!

Bimbisara: 'బింబిసార' సినిమాను రిజెక్ట్ చేసిన రవితేజ?

Bimbisara: 'బింబిసార' సినిమాను రిజెక్ట్ చేసిన రవితేజ?

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

NTR: భుజం నొప్పితో బాధపడుతోన్న ఎన్టీఆర్ - రెండు నెలల పాటు రెస్ట్!

NTR: భుజం నొప్పితో బాధపడుతోన్న ఎన్టీఆర్ - రెండు నెలల పాటు రెస్ట్!

టాప్ స్టోరీస్

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?

PF Data Leak: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలి - ఎందుకంటే మీ డేటా?

PF Data Leak: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలి - ఎందుకంటే మీ డేటా?

Flag Hoisting: జాతీయ జెండాను RSS ఎందుకు ఎగరేయటం లేదు? కాషాయ రంగుని మాత్రమే గుర్తిస్తోందా?

Flag Hoisting: జాతీయ జెండాను RSS ఎందుకు ఎగరేయటం లేదు? కాషాయ రంగుని మాత్రమే గుర్తిస్తోందా?