Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!
మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు గెలుచుకున్న నంజియమ్మ గురించి...
కేరళకు చెందిన నంజియమ్మ 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో అత్యుత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్ అవార్డును గెలుచుకున్నారు. 2020లో వచ్చిన అయ్యప్పనుం కోషియుం సినిమాలో జానపద గీతం ‘కలక్కాతా’ అనే పాటకు ఆవిడకు ఈ అవార్డు దక్కింది. 68 సంవత్సరాల వయస్సులో ఆవిడ ఈ అవార్డును దక్కించుకోవడం విశేషం. ఈవిడ మొదటిసారిగా పాడిన పూర్తి ప్రొఫెషనల్ సినిమా ఇదే.
2015లో అగ్గెడు నాయగ అనే డాక్యుమెంటరీ, అదే సంవత్సరం వెలుత రాత్రికల్ అనే ఇండిపెండెంట్ సినిమాల్లో మాత్రమే ఆవిడ పాటలు పాడారు. ఆ తర్వాత అయ్యప్పనుం కోషియుం సంగీత దర్శకులు జేక్స్ బిజోయ్ ఈవిడ ప్రతిభను గుర్తించి ఆ సినిమాలో మూడు పాటలు పాడే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో ఎంతో ఫేమస్ అయిన ‘అడకచాకో’ పాటను కూడా ఆవిడే పాడారు. అయ్యప్పనుం కోషియుం సినిమా తెలుగు రీమేక్ భీమ్లా నాయక్‌లో సూపర్ హిట్ అయిన ‘లా లా భీమ్లా’ పాట మాతృక ఇదే.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన అట్టప్పాడి ప్రాంతంలో ఉన్న నక్కుపతి అనే ఊరు నంజియమ్మ స్వగ్రామం. ఇది ఒక ట్రైబల్ విలేజ్. ఈవిడ ‘ఇరుల’ అనే తెగకు చెందినవారు. 2015లో అగ్గెడు నాయగ అనే డాక్యుమెంటరీ, అదే సంవత్సరం వెలుత రాత్రికల్ అనే ఇండిపెండెంట్ సినిమాల్లో పాటలు పాడినప్పటికీ ఆవిడకు పెద్దగా అవకాశాలు రాలేదు. 2020లో జేక్స్ బిజోయ్ ఇలా అవకాశం ఇవ్వగానే అలా జాతీయ అవార్డును నంజియమ్మ సాధించారు.
కేవలం పాట మాత్రమే కాకుండా ఆ సినిమాలో బిజు మీనన్ అత్తయ్యగా కూడా నంజియమ్మ నటించి మెప్పించారు. జానపద గీతాలు పాడటం ఆవిడ ప్రత్యేకత. పాత తరం నాటి జానపద గీతాలను ఈ తరం వారిని అలరించే నంజియమ్మ పాడతారు. అంతేకాకుండా తన భాషకు కూడా ఈవిడ ఎంతో సేవ చేశారు. కేరళలో ‘ఇరుల’ భాషను మొదటిసారి పబ్లిక్ రిలేషన్స్ ప్రోగ్రాంలో ఉపయోగించింది ఈవిడ పాట ద్వారానే. అలా తన భాష గురించి పది మందికి తెలిసేలా నంజియమ్మ చేయగలిగారు. జాతీయ అవార్డుల కార్యక్రమంలో ఆవిడ పాడిన పాటకు చుట్టుపక్కల ఉన్నవారు చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు.
#nanjiyamma 🥰 pic.twitter.com/WMZSqVrC8l
— 🕴ഏമാൻ🕴 (@m_visakh) September 30, 2022
View this post on Instagram