War 2 Box Office Prediction Day 1: 'వార్ 2'తో వసూళ్ల సునామీ... ఫస్ట్ డే 100 కోట్లు వస్తాయా? 'దేవర'ను బీట్ చేస్తుందా?
War 2 First Day Collection Prediction: 'వార్ 2' వరల్డ్ వైడ్ రిలీజ్‌కు అంతా రెడీ. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయ్. మరి, ఫస్ట్ డే ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటే?

NTR's War 2 first day 1 records: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ సినిమా 'వార్ 2' మొదటి రోజు ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది? అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ రిలీజ్‌కు అంతా రెడీ అయిన నేపథ్యంలో ఫస్ట్ డే వంద కోట్లు కొడుతుందా? లేదా? అనే డిస్కషన్ నడుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ చేయడంతో!
హిందీ సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో స్టార్ట్ ఉంటుంది. 'వార్ 2' అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ ఇండియాలో ఓపెన్ అయినా సరే అంత బజ్ ఏమీ కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ మొదలైన తర్వాత జోరు పెరిగింది.
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 800 స్క్రీన్లలో సినిమా రిలీజ్ అవుతోంది. బుధవారం సాయంత్రం వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ చూస్తే ప్రస్తుతానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల గ్రాస్ గ్యారంటీ.
ఎన్టీఆర్ సినిమాకు 30 కోట్లు అంటే చాలా తక్కువ. ఆయన తెలుగు సినిమా చేస్తే అంత ఓపెనింగ్ వస్తుంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆయనకు పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయ్యింది. 'దేవర'తో మొదటి రోజు ఎన్టీఆర్ 172 కోట్ల కలెక్షన్స్ సాధించారు. అయితే... 'వార్ 2'ను ఎక్కువ మంది హిందీ సినిమాగా చూడటం, బుకింగ్స్ ఆలస్యంగా ఓపెన్ కావడం వల్ల అడ్వాన్స్ సేల్స్ ఆశించినట్టు లేవు.
ప్రస్తుతానికి హిందీ మార్కెట్టు నుంచి కేవలం పది కోట్ల కలెక్షన్ మాత్రమే వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ పోర్టల్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అయితే అక్కడ నుంచి మొదటి రోజు రూ. 40 కోట్లు వచ్చే అవకాశం ఉందట. తెలుగులో మినిమమ్ 35 కోట్లు గ్యారెంటీ. ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా కలెక్షన్స్ కలిపితే వంద కోట్లకు అటు ఇటుగా సాధించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ టాక్. మౌత్ టాక్ బావుంటే మరో పది పదిహేను కోట్లు రావచ్చు. అయితే 'దేవర'ను బీట్ చేయడం కష్టమే అంటున్నారు ట్రేడ్ జనాలు. తెలంగాణలో టికెట్ రేట్ హైక్ లేకపోవడం ఎఫెక్ట్ చూపించే అంశమే. తెలంగాణలో తెలుగు సినిమాల టికెట్స్ 300 అమ్ముతారు. కానీ, 'వార్ 2'కు 200 లోపే ఉండటం కలెక్షన్లకు మైనస్.
Also Read: కూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?





















