War 2 Bookings: 'వార్ 2' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయ్... హాట్ కేకుల్లా ఎన్టీఆర్ టికెట్స్ సేల్
War 2 Booking Online: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. వార్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హాట్ కేకుల్లా టికెట్స్ సేల్ అవుతున్నాయి.

ఎప్పుడు? ఎప్పుడు?? ఎప్పుడు??? 'వార్ 2' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడు? అని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ల ఎదురు చూపులకు తెర దించుతూ నైజాంలో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మరో తెలుగు రాష్ట్రం ఏపీలోనూ నెమ్మదిగా బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి.
టికెట్ రేట్స్ పెంచలేదు... తక్కువే...
హాట్ కేకుల్లా సేల్ అవుతున్న 'వార్ 2' టికెట్స్!
తెలుగులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్థాయి హీరోల సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ వారం ముందుగా మొదలు అవుతాయి. అయితే విడుదలకు రెండు రోజుల ముందు వరకు 'వార్ 2' టికెట్స్ ఓపెన్ చేయలేదు. అందుకు కారణం లేకపోలేదు...
ఏపీతో పాటు తెలంగాణలో టికెట్ రేట్స్ పెంచాలని తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్న సూర్యదేవర నాగవంశీ ప్రయత్నించారు. అయితే ఆ విషయం తెలిసి ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచకుండా సాధారణ రేట్లకు బుకింగ్స్ ఓపెన్ చేశారు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 175 నుంచి 200 రూపాయలకు టికెట్లు సేల్ స్టార్ట్ చేశారు.
Also Read: ఎన్టీఆర్‌కు గుడి కట్టిన ఫ్యాన్స్... విజయవాడ శైలజా థియేటర్‌లో పూజలు
#War2 Telangana bookings have started to open up slowly. Check BMS and District for your preferred screens.
— .... (@ynakg2) August 12, 2025
The time has come to ROAR! 🔥🔥🔥#WAR2 bookings will go live in a while now… Get ready to grab your tickets! ❤️🔥@tarak9999 @iHrithik
— Naga Vamsi (@vamsi84) August 12, 2025
'దేవర' ఓపెనింగ్స్ బీట్ చేయడం కుదురుతుందా?
'దేవర'కు రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లు పెంచారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా సినిమా అది. తెలుగు హీరో, తెలుగు దర్శకుడు తెలుగులో తీసిన సినిమా. దేశవ్యాప్తంగా విడుదల చేశారు. ఇతర భాషలలో డబ్బింగ్ చేశారు. అందుకని టికెట్ రేట్లు పెంచారు. 'వార్ 2' విషయానికి వస్తే... హిందీ దర్శకుడు, హిందీ హీరోతో కలసి తెలుగు హీరో హిందీలో చేసిన సినిమా. తెలుగు వరకు డబ్బింగ్ సినిమాగా పరిగణిస్తున్నారు కొంత మంది ప్రేక్షకులు. టికెట్ రేట్లు పెంచాలనుకుంటున్నట్లు వార్తలు రాగానే విమర్శలు రావడానికి కారణం కూడా అదే. డబ్బింగ్ సినిమాకు రేట్లు పెంచడం ఎందుకు అని? అందువల్ల తెలుగు రాష్ట్రాలలో 'దేవర' ఓపెనింగ్ డే కలెక్షన్ రికార్డులను వార్ బీట్ చేయడం సాధ్యమయ్యే పనేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: 'మయసభ' క్లైమాక్స్... ఎన్టీఆర్, చంద్రబాబులను ఒక్కటి చేసిన నారా లోకేష్ - ఎలాగంటే?





















