Vrusshabha Teaser: మోహన్ లాల్ పాన్ ఇండియా సినిమా 'వృషభ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్...
Vrusshabha Teaser Release Date: కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'వృషభ'. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'వృషభ' (Vrusshabha Movie). మైథలాజికల్, యాక్షన్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
సెప్టెంబర్ 18న 'వృషభ' టీజర్ విడుదల!
తెలుగుతో పాటు మలయాళంలో ఏకకాలంలో 'వృషభ' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నారు. మోహన్ లాల్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మైథలాజికల్ ఫాంటసీ ఫిలింలో ఆయన విశ్వరూపం చూపించబోతున్నారని ఆ లుక్ చూస్తే అర్థం అవుతుంది. టీజర్ విడుదల సందర్భంగా డిఫరెంట్ లుక్ కొంచెం చూపించారు. దాంతో లాలెట్టన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
The Battles, The Emotions, The Roar.
— Mohanlal (@Mohanlal) September 16, 2025
Vrusshabha Teaser drops on 18th September.#RoarOfVrusshabha #Vrusshabha #TheWorldofVrusshabha@Connekktmedia @balajimotionpic @FilmDirector_NK #ShobhaKapoor @EktaaRKapoor #CKPadmaKumar #VarunMathur @imsaurabhmishra @abhishekv_77… pic.twitter.com/v1oHpczF7w
అక్టోబర్ 18న థియేటర్లలో 'వృషభ' విడుదల
Vrusshabha Movie Release Date: నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న 'వృషభ' సినిమాను కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శోభా కపూర్, ఏక్తా కపూర్, సీకే పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని నిర్మాతలు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అక్టోబర్ 18న పాన్ ఇండియా లెవల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మలయాళం, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది.
Also Read: రెమ్యూనరేషన్ పెంచిన తేజా సజ్జా... జాంబీ రెడ్డి 2 చేతులు మారడం వెనుక కారణం అదేనా?





















