Teja Sajja Remuneration: రెమ్యూనరేషన్ పెంచిన తేజా సజ్జా... జాంబీరెడ్డి 2 చేతులు మారడం వెనుక కారణం అదేనా?
Teja Sajja Hikes Remuneration: బ్యాక్ టు బ్యాక్ రెండు పాన్ ఇండియా సక్సెస్ ఫుల్ ఫిలిమ్స్ చేయడంతో యంగ్ హీరో తేజ సజ్జ తన రెమ్యూనరేషన్ పెంచినట్లు ఇండస్ట్రీ టాక్.

తేజ సజ్జ స్టోరీ సెలక్షన్ మీద ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు కామన్ ఆడియన్స్ నుంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ 'హను - మాన్', ఈ ఏడాది 'మిరాయ్'... బ్యాక్ టు బ్యాక్ రెండు పాన్ ఇండియా హిట్స్ అందించాడు తేజ. వరుస విజయాలు రావడం వల్ల తన రెమ్యూనరేషన్ కూడా పెంచాడట.
ప్రజెంట్ 12 కోట్లు అడుగుతున్న తేజ
Teja Sajja Remuneration For Zombie Reddy 2: 'హను - మాన్'కు తేజ సజ్జ ఎంత తీసుకున్నాడు? అనేది తెలియదు. 'మిరాయ్' కోసం లగ్జరీలు లేకుండా వర్క్ చేశాడని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చెప్పాడు. హీరోగా తేజ సజ్జ మొదటి నుంచి జాగ్రత్తగా అడుగులు వేస్తూ వస్తున్నాడు. కథల ఎంపికపై ఫోకస్ చేశాడు. ఇప్పుడు కూడా స్టోరీలు స్ట్రాంగ్ ఉండేలా చూసుకుంటున్నాడు. తన కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా ఆశిస్తున్నాడు.
'మిరాయ్' సక్సెస్ తర్వాత తేజ సజ్జ రెమ్యూనరేషన్ పెంచినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ప్రజెంట్ ఈ యంగ్ హీరో 12 కోట్లు అడుగుతున్నాడట. 'హను - మాన్' మూవీ 300 కోట్లు కలెక్ట్ చేసింది. 'మిరాయ్' కూడా మంచి నంబర్స్ రాబడుతోంది. సో తేజకు 12 కోట్లు ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు కూడా ముందుకు వస్తున్నారు.
'జాంబీ రెడ్డి' చేతులు మారడానికి రీజన్ అదేనా?
'హను - మాన్'కు ముందు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కలిసి 'జాంబీ రెడ్డి' చేశారు. ఆ మూవీ మంచి సక్సెస్ అయ్యింది. దానికి సీక్వెల్ కూడా అప్పట్లో అనౌన్స్ చేశారు. సీక్వెల్ కోసం లీడ్ ఇచ్చి ఎండ్ చేశారు సినిమాను. ఇప్పుడు 'జాంబీ రెడ్డి 2'ను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి ప్లాన్ చేశారు తేజ సజ్జ. అయితే ఫస్ట్ పార్ట్ ప్రొడ్యూస్ చేసిన రాజశేఖర్ వర్మ కాకుండా, 'జాంబీ రెడ్డి 2'ను 'మిరాయ్' ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి కారణం తేజ సజ్జ రెమ్యూనరేషన్ పెరగడం అని టాక్.
Also Read: అనుపమ 'పరదా' టోటల్ కలెక్షన్స్... మూడు వారాలకు ఓటీటీలోకి, థియేటర్లలో ఎంత వచ్చిందో తెల్సా?
ఇప్పుడు తేజ సజ్జ చేతిలో మూడు సీక్వెల్స్ ఉన్నాయ్. ఒకటి 'జాంబీ రెడ్డి 2' అయితే మరొకటి 'మిరాయ్' సీక్వెల్ 'మిరాయ్ జైత్రయా'. 'హను - మాన్' సీక్వెల్ 'జై హను మాన్'లోనూ అతను కనిపించే అవకాశం ఉంది. అదీ సంగతి! హిట్ వచ్చినప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి.





















