Actor Sandy Master: కిష్కింధపురి విలన్ ఎవరో తెలుసా? 600 కోట్ల కొల్లగొట్టిన మూవీలో నటుడు... కళ్యాణీ ప్రియదర్శన్ 'లోక'లోనూ!
Sandy Master Telugu Movie: కోలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్, విలన్‌గా బ్యాక్ టు బ్యాక్ రెండు సక్సెస్‌లు కొట్టిన శాండీ మాస్టర్, ఇప్పుడు తెలుగుకు ఇంట్రడ్యూస్ అయ్యారు. బెల్లంకొండ 'కిష్కింధపురి'లో నటించారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'కి ఆడియన్స్ నుంచి ఆదరణ దక్కుతోంది. థియేటర్లకు జనాలు వస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు విలన్ రోల్, అందులో నటుడి గురించి కాస్త ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇంతకీ, అతను ఎవరో తెలుసా?
600 కోట్లు కొల్లగొట్టిన సినిమాతో నటుడిగా పాపులర్!
దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'లియో' మూవీ (Thalapathy Vijay Leo Movie) గుర్తు ఉందిగా! బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ 600 కోట్లు కలెక్ట్ చేసింది. అందులో రాబరీ సీన్స్ ఉంటాయ్. గుర్తు ఉన్నాయా? షణ్ముగం గ్యాంగులోని ఓ నటుడి ఎక్స్‌ప్రెషన్స్ వైరల్ అయ్యాయి. అతని పేరు శాండీ. నటుడిగా ఆయనకు ఫస్ట్ బ్రేక్ 'లియో' సినిమా.
తమిళంలో నృత్య దర్శకుడిగా శాండీ మాస్టర్ (Sandy Master) పాపులర్. తాను కొరియోగ్రఫీ చేసిన కొన్ని పాటల్లో తళుక్కున మెరిశారు కూడా! 'లియో'లో 'నా రెడీ' సాంగ్ కొరియోగ్రఫీ చేసినది ఆయనే. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమా 'కూలీ'. అందులోని 'మోనికా' సాంగ్ సోషల్ మీడియాతో పాటు థియేటర్లలో షేక్ చేసింది. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసింది కూడా శాండీ మాస్టర్. బెల్లంకొండ 'కిష్కింధపురి'లో ఆయన విలన్ రోల్ చేశారు.
'కిష్కింధపురి'లో శాండీ నటనకు ప్రశంసలు!
'కిష్కింధపురి' సినిమాలో సువర్ణ మాయా రేడియో స్టేషన్‌లో హీరో హీరోయిన్లతో పాటు అడుగు పెట్టిన 11 మందిని చంపేసే దెయ్యం / ఆత్మగా శాండీ మాస్టర్ నటించారు. విశ్రవ పుత్ర పాత్రలో ఆయన నటన ప్రశంసలు అందుకుంటోంది.
Also Read: 'కూలీ'లో విలన్‌గా సర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్... మహానటిని మించిన అపరిచితురాలు - ఎవరీ రచితా రామ్?
విశ్రవ పుత్ర పాత్రలో నటించడం అంత సులభం కాదు. అంగ వైకల్యం ఉన్నట్టుగా కనిపించాలి. ప్రతి సన్నివేశంలోనూ చేతులకు గూను ఉన్నట్టు చూపించాలి. ఆ పాత్రలో పెర్ఫెక్షన్ చూపించారు శాండీ మాస్టర్. దీనికి ముందు కల్యాణీ ప్రియదర్శన్ ఫిమేల్ సూపర్ హీరో సినిమా 'లోక' సినిమాలో నాచియప్ప పాత్రలో శాండీ మాస్టర్ నటించారు. అందులోని ఆయన నటనకూ ప్రశంసలు లభించాయి.
'లియో'తో తమిళంలో, 'లోక'తో మలయాళంలో, 'కిష్కింధపురి'తో తెలుగులో... మూడు భాషల్లోనూ నటుడిగా ప్రశంసలు అందుకున్నారు శాండీ మాస్టర్. మొదటి రెండు సినిమాలతో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. ఇప్పుడు ఆయన ఓ మలయాళ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. నటుడిగా మరికొన్ని సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి.





















