Rachita Ram: 'కూలీ'లో విలన్‌గా సర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్... మహానటిని మించిన అపరిచితురాలు - ఎవరీ రచితా రామ్?
Rachita Ram Movies: రజనీకాంత్ 'కూలీ'లో కన్నడ హీరోయిన్ రచితా రామ్ నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. అసలు ఎవరీ నటి? కన్నడలో చేసిన సినిమాలు ఏమిటి? అనేది తెలుసుకోండి.

Rachita Ram Role In Coolie: రచితా రామ్... ఇప్పుడు తమిళనాట మార్మోగుతున్న పేరు. అందుకు కారణం సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ'. అందులో నెగిటివ్ లేదా గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే... విలన్! 'కూలీ'లో విలన్ నాగార్జున. ఆయన పాత్ర పేరు సైమన్. డబ్బు కోసం ఆయన కుమారుడిని వలలో వేసుకునే మహిళగా రచితా రామ్ నటించారు. ఓ సన్నివేశంలో 'అపరిచితుడు'లో విక్రమ్ తరహాలో వేరియేషన్స్ చూపించారు. అందులో నటనకు అందరూ క్లాప్స్ కొడుతున్నారు. ఆవిడ క్యారెక్టర్, ట్విస్టులకు 'వావ్' అంటున్నారంతా! అసలు ఎవరీ రచితా రామ్? ఆవిడ బ్యాగ్రౌండ్ ఏంటి? అనేది తెలుసుకోండి.
తెలుగులో ఓ సినిమా చేసిన రచిత!
Rachita Ram Tamil Movie List: 'కూలీ'తో రచితా రామ్ తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆమెకు ఫస్ట్ కోలీవుడ్ సినిమా ఇది. అయితే తెలుగులో ఆల్రెడీ ఆవిడ ఓ సినిమా చేశారు. కళ్యాణ్ దేవ్ గుర్తున్నారా? మెగాస్టార్ చిరంజీవి ఇంటి అల్లుడిగా ఉన్న రోజుల్లో కొన్ని సినిమాలు చేశారు. ఆయన 'సూపర్ మచ్చి'లో రచితా రామ్ హీరోయిన్. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. అయితే కన్నడలో ఈవిడ పాపులర్ హీరోయిన్.
కన్నడ 'అత్తారింటికి దారేది'లో హీరోయిన్!
కన్నడలో కథానాయికగా 30 వరకు సినిమాలు చేశారు రచితా రామ్. తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన కన్నడ హీరో సుదీప్ సరసన 'రణ్ణ' (Ranna Kannada Movie)లో నటించారు. పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది'కి రీమేక్ ఆ సినిమా. ఇక్కడ సమంత చేసిన పాత్రను కన్నడలో ఆవిడ చేశారు.
కన్నడ ప్రేక్షకులు రచితా రామ్ (Rachita Ram Nickname)ను ముద్దుగా డింపుల్ క్వీన్ అంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో హయ్యస్ట్ ఫాలోయర్లు ఉన్న హీరోయిన్ కూడా రచితానే. ఆమెకు 2.6 మిలియన్స్ ఫాలోయర్లు ఉన్నారు. ఉపేంద్ర 'ఐలవ్యూ' తెలుగులోనూ విడుదల అయ్యింది. అందులో ఆవిడ బోల్డ్ సీన్స్ చేయడం తల్లిదండ్రులకు నచ్చలేదు. దాంతో రచిత తమ కుమార్తె కాదని ఒకానొక సమయంలో స్టేట్మెంట్ ఇచ్చారు.
Rachita Ram Kannada Hit Movies: పునీత్ రాజ్ కుమార్ సరసన 'చక్రవ్యూహ', దర్శన్ 'అంబరీష', ధృవ్ సర్జా 'భజ్రరి', సుదీప్ 'విలన్' వంటి పలు సినిమాల్లో రచితా రామ్ నటించారు. నాగచైతన్య 'రారండోయ్ వేడుక చూద్దాం'ను కన్నడలో రీమేక్ చేశారు. ఆ సినిమా టైటిల్ 'సీతారామ కల్యాణ'. అందులో రచితా రామ్ హీరోయిన్. తెలుగు రకుల్ ప్రీత్ సింగ్ చేసిన పాత్రను కన్నడలో ఆవిడ చేశారు. అందులో దేవెగౌడ మనవడు నిఖిల్ గౌడ హీరో. ఉపేంద్ర 'ఐ లవ్యూ', శివరాజ్ కుమార్ 'రుస్తుం', దర్శన్ 'క్రాంతి'... చెబుతూ వెళితే స్టార్ హీరోలతో హిట్ సినిమాలు చాలా చేశారు.

అసలు పేరు రచిత కాదు... చెల్లెలు కూడా!
Rachita Ram Birthday, Age: రచితా రామ్ అసలు పేరు బిందియా రామ్. ఆవిడ భరతనాట్యం డ్యాన్సర్. సుమారు 50కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. అక్టోబర్ 3, 1992లో జన్మించారు. ఆవిడకు ఓ సిస్టర్ ఉన్నారు. ఆమె పేరు నిత్యా రామ్. కన్నడ సీరియల్స్ చేస్తున్నారు.
Also Read: కూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?





















