అన్వేషించండి

OMG 2: ఆ ఒత్తిళ్ల వల్లే ‘ఓఎమ్‌జీ 2’ మూవీకి ‘A’ సర్టిఫికెట్ - ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ ఫైర్

'నేను సీబీఎఫ్‌సీలో భాగం అయినా కూడా దానికి పూర్తిగా వ్యతిరేకిని కాదు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై సీబీఎఫ్‌సీపై కూడా ఒత్తిడి ఉంటుంది.’

ఒక సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చిందంటే.. ఆడియన్స్ దానిని చూసే దృక్ఫథమే మారిపోతుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘ఓఎమ్‌జీ 2’కి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. సెన్సార్ బోర్డ్.. ఈ చిత్రానికి క్లీన్ ఏ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత అదేంటి? అని చాలామంది ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దీనిపై మూవీ టీమ్ మాత్రం పెద్దగా స్పందించడానికి ముందుకు రాలేదు. సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ)లో ఒక మెంబర్ అయిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాత్రం దీనిపై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. ఈ నిర్ణయం అనేది సీబీఎఫ్‌సీపై మతపరంగా వచ్చిన ఒత్తిడి వల్లే తీసుకోవాల్సి వచ్చిందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తమ నిర్ణయాన్ని తాము సమర్థించుకోవడం లేదు కానీ.. జరిగింది మాత్రం అదే అని చెప్తున్నాడు వివేక్ అగ్నిహోత్రి.

‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ ఫైర్..
‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి సెన్సేషనల్ సినిమాను తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి.. అటు తను పనిచేస్తున్న సీబీఎఫ్‌సీ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించకుండా ‘ఓఎమ్‌జీ 2’కి ఏ సర్టిఫికెట్ ఇవ్వడంపై స్పందించాడు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తను ఇంకా సినిమా చూడలేదని, రివ్యూ కమిటీలో తను భాగం కాదని స్పష్టం చేశాడు వివేక్. ‘ఓఎమ్‌జీ 2’లో అనేక మార్పులు చెప్పి, ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సీబీఎఫ్‌సీ బోర్డ్ లిస్ట్‌లో తను లేనని క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర పోషించాడు. కానీ సెన్సార్.. సినిమాను చూసిన తర్వాత ఈ పాత్రను మెసెంజర్ ఆఫ్ గాడ్‌గా మార్చేశారు. అయితే దీనిని ఎలా సమర్ధిస్తారు అనే ప్రశ్న వివేక్‌కు ఎదురయ్యింది. ‘‘లేదు నేను దానిని సమర్ధించను. నేను దానికి అసలు ఒప్పుకోను. నేను సీబీఎఫ్‌సీలో భాగం అయినా కూడా దానికి పూర్తిగా వ్యతిరేకిని కాదు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై సీబీఎఫ్‌సీపై కూడా ఒత్తిడి ఉంటుంది’’ అని వివేక్ చెప్పుకొచ్చాడు.

27 కట్స్ అంటే దారుణం..
‘సీబీఎఫ్‌సీపై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. కానీ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో.. అదంతా సమాజం నుంచి మతపరంగా వస్తున్న ఒత్తిడి వల్లే జరుగుతోంది. అందరికీ సీబీఎఫ్‌సీ అనేది ఎలా పనిచేస్తుందో అర్థమయ్యింది. దానిపై ఒత్తిడి పెడితే.. ఏదైనా చేస్తుందని అనుకుంటున్నారు. అసలు ఒక సినిమాలో ఇన్ని కట్స్ ఏంటి అని నాకే అర్థం కావడం లేదు. 27 కట్స్ అంటే మీరు ఎవరు అది డిసైడ్ చేయడానికి.’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు వివేక్. అసలు సినిమాలకు సెన్సార్‌షిప్ అనేది ఎందుకు ఉంటుంది అని ప్రశ్నిస్తూ.. అసలు సీబీఎఫ్‌సీ లాంటిది ఉండకూడదు అని తన అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పాడు. 

ప్రేక్షకులను ఆలోచించుకోనివ్వండి..
‘నేను నిరసనలు, సినిమా బ్యాన్ లాంటి వాటికి వ్యతిరేకిని. నేను స్వేచ్ఛగా మాట్లాడడాన్ని నమ్ముతాను. వారు తప్పుగా మాట్లాడినా కూడా అనిపించి మాట్లాడుతున్నారు కదా అని ఆలోచిస్తాను. ప్రేక్షకులు తెలివైన వారు. వారే సినిమాను చూడాలి, అర్థం చేసుకోవాలి. మీరు సినిమాలోని ప్రతీ అంశాన్ని వారి వరకు చేరకుండా ఆపితే.. మరి ప్రేక్షకులను మరింత తెలివిగా ఆలోచించే స్వేచ్ఛను అందించనట్టే కదా.. ఒకవేళ ఒక ఫిల్మ్ మేకర్ ఇంటెన్షన్ తప్పుగా లేకపోతే.. వదిలేయొచ్చు కదా..’ అని ‘ఓఎమ్‌జీ 2’పై సెన్సార్ ప్రవర్తనను పూర్తిగా ఖండించాడు వివేక్ అగ్నిహోత్రి. ‘ఓఎమ్‌జీ 2’ 27 కట్స్‌ను తీసుకున్న తర్వాత కూడా దానికి ఏ సర్టిఫికెట్ రావడం అనేది చాలామంది ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ సినిమా ఆగస్ట్ 11న థియేటర్లలో సందడి చేయనుంది.

Also Read: సమంత పేరు మీద ఇడ్లీ స్టాల్ పెట్టాలని ప్లాన్ చేశాం, కానీ..: విజయ్ దేవరకొండ

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons Day 2 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు రోజుల కలెక్షన్స్ - 60 కోట్లు దాటేసిన సూర్య కొత్త మూవీ
Aasmaan First Look : శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్
శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్

వీడియోలు

Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget