అన్వేషించండి

Laila Release Date: విశ్వక్ సేన్ ‘లైలా’ రిలీజ్ డేట్ ఫిక్సయింది... భలే డేట్ పట్టారుగా!

మెకానిక్ రాకీ తర్వాత విశ్వక్ సేన్ చేస్తోన్న చిత్రం ‘లైలా’. ఒక్క ఐ లుక్‌తోనే అంచనాలు పెంచుకున్న ఈ సినిమా, ఇప్పుడు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. లైలా రిలీజ్‌కు ఓ ప్రత్యేక డేట్‌ని మేకర్స్ ఫిక్స్ చేశారు.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’ మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలై, పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్నప్పటికీ, కలెక్షన్ల పరంగా నిరాశనే మిగిల్చింది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ సినిమా రిజల్ట్ తర్వాత విశ్వక్ సేన్ ఆశలన్నీ ప్రస్తుతం చేస్తున్న ‘లైలా’ మూవీ పైనే ఉన్నాయి. అసలు ఇటువంటి టైటిల్‌తో మూవీ, అందులోనూ విశ్వక్ సేన్ హీరో అనగానే ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోయారు. మాస్ కా దాస్ విశ్వక్ ఏంటి? ఇలాంటి టైటిల్‌లో సినిమా చేయడం ఏంటని అంతా అనుకున్నారు. కారణం ఆయనకున్న మాస్ ఫాలోయింగ్, మాస్ ఇమేజ్ అలాంటిది మరి. కానీ నటుడన్నాక.. అన్ని రకాల పాత్రలు చేయాలి. ఈ సినిమాలో ఉన్న మరో విశేషం ఏమిటంటే.. ఇందులో విశ్వక్ సేన్ ఇప్పటి వరకు కనిపించిన సరికొత్త అవతార్‌లో.. మరీ ముఖ్యంగా అబ్బాయిగానూ, అమ్మాయిగానూ నటిస్తుండటం.

మరి ఇంత విశేషం ఉన్న ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో.. అనే థింకింగ్‌లో ఉన్న ప్రేక్షకుల కోసం, సోమవారం చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా విడుదల తేదీకి కూడా ఓ స్పెషల్ ఉండేలా మేకర్స్ భలే ప్లాన్ చేశారు. ఏంటా స్పెషల్ అనుకుంటున్నారా? ‘లైలా’ సినిమాను ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న మేకర్స్ విడుదల చేయబోతున్నారు. రొమాంటిక్ జానర్‌‌లో వస్తున్న ఇలాంటి సినిమాకి లవ్ సీజన్‌ అయిన ఫిబ్రవరి 14కు మించిన డేట్ కంటే మంచి డేట్ ఇంకేం ఉంటుంది. అందుకే మేకర్స్ కావాలని ఈ డేట్‌ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ డేట్ అనౌన్స్‌మెంట్‌తో ఒక్కసారిగా ఈ సినిమా వార్తలలో నిలుస్తోంది.

Read Also :  Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!

ఇక రిలీజ్ డేట్ ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ కూడా వైవిధ్యంగా ఉంది. ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఆయన ధరించిన స్పోర్టింగ్ ట్రెండీ ఎటైర్, సన్ గ్లాసెస్‌.. అలాగే చొక్కాతో ముఖాన్ని కప్పుకున్న తీరు.. అన్నీ కూడా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేసేలా చేస్తున్నాయి. ఫిబ్రవరి 14న విడుదల అని చెప్పిన మేకర్స్, 2025 నూతన సంవత్సరం రోజున ‘లైలా’ ఫస్ట్ రోజ్ అదే ఫస్ట్ లుక్‌ని విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. 

Also Readబిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి

ఇంతకు ముందు ‘లైలా’కు సంబంధించి రిలీజ్ చేసిన ఐ లుక్‌తో విశ్వక్ సేన్ పాత్రలోని వెరైటీని పరిచయం చేసిన మేకర్స్.. ఫస్ట్ లుక్‌తో ఈ సినిమా స్వరూపమే మారిపోతుందని చెబుతున్నారు. ఆ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రాబోయే నూతన సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే. విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ప్రజంట్ ఈ మూవీ హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
US Latest News: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Tirumala News: వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
Embed widget