అన్వేషించండి

Vishal - CM Joseph Vijay: తమిళనాడు సీఎం విజయ్ మంత్రివర్గ కూర్పుపై విశాల్ అసంతృప్తి... దళపతి ముందు మూడు డిమాండ్స్

Vishal On Tamil Nadu Cabinet 2026: సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ నాడు కొత్త కేబినెట్‌పై హీరో విశాల్ సంచలన పోస్ట్ చేశారు. అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సీఎం ముందు 3 కీలక డిమాండ్లు ఉంచారు.

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర కథానాయకుడు జోసెఫ్ విజయ్ (CM Joseph Vijay) సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఆయన విజయంపై చిత్రసీమ సంతోషం వ్యక్తం చేసింది. నిన్న మొన్నటి వరకు అభినందించలేదని విమర్శలు ఎదుర్కొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం విజయ్‌ విజయంపై తనకు ఎటువంటి అసూయ లేదని స్పష్టత ఇచ్చారు. కోలీవుడ్ హ్యాపీ అనుకుంటున్నా తరుణంలో యువ కథానాయకుడు విశాల్ (Vishal) 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా బాంబు పేల్చారు. విజయ్ క్యాబినెట్ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు? విశాల్ ఏమన్నారు? వంటి విషయాల్లోకి వెళితే...

సినిమాటోగ్రఫీ మంత్రి ఎంపికపై విశాల్ నిరాశ
ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Tamil Nadu CM Vijay) నేతృత్వంలోని క్యాబినెట్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మంత్రిత్వ శాఖలను కేటాయించడం సంతోషమే అయినప్పటికీ... సినిమాటోగ్రఫీ శాఖను మంత్రి రాజ్‌ మోహన్‌ (Minister Rajmohan)కు కేటాయించడం తనను నిరాశకు గురి చేసిందని విశాల్ ట్వీట్ చేశారు. సినిమా రంగానికి సంబంధించిన సమస్యలపై అవగాహన లేని వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించడం వల్ల చిత్రసీమ ఇబ్బందులు పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు విశాల్.

Also ReadKamal Haasan Reacts To Rajinikanth Jealousy Comment - రజనీకాంత్ 'జెలసీ' కామెంట్‌పై కమల్ హాసన్ రియాక్షన్... మాది పోటీయే

చిత్రసీమ సమస్యలపై విజయ్ చొరవ తీసుకోవాలివిశాల్ ట్వీట్ చూస్తే... చిత్రసీమ సమస్యలను విజయ్‌కు వివరించడం సులువు అని, కొత్త మంత్రికి చెప్పడం కష్టం అనేది అర్థం అవుతోంది. ''మూడు దశాబ్దాలుగా విజయ్ చిత్రసీమలో ఉన్నారు. పరిశ్రమ కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి ఆయన. సీఎం విజయ్ కంటే చిత్రసీమకు కొత్త వ్యక్తి అయిన మంత్రికి మా సమస్యలు ఎలా వివరించాలో అర్థం కావడం లేదు'' అని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:Ravi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?

ప్రస్తుతం చిత్రసీమ, మరీ ముఖ్యంగా నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నాయని, ఈ తరుణంలో సీఎం విజయ్ స్వయంగా చొరవ తీసుకుని ఇండస్ట్రీకి మేలు చేసే చర్యలు తీసుకోవాలని విశాల్ రిక్వెస్ట్ చేశారు. తొమ్మిదేళ్లుగా నిర్మాతలు - తమిళ చిత్రసీమ అడుగుతున్న మూడు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని సీఎం విజయ్‌కు విజ్ఞప్తి చేశారు.

చిత్రసీమ కోసం విశాల్ చేసిన డిమాండ్లు ఇవే!

  • థియేటర్లలో టికెట్ అమ్మకాల కోసం తమిళనాడు ప్రభుత్వం స్వయంగా ఆన్‌లైన్ టికెట్ విండోను తీసుకు రావాలని విశాల్ కోరారు. అలా చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ఒక్కో టికెట్‌పై ప్రేక్షకులకు 30 రూపాయల అదనపు ఛార్జీల భారం పడదని, వాళ్లకు పెద్ద ఉపశమనం లభిస్తుందని చెప్పారు.
  • దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధించాలనే నిబంధన అమలులో ఉందని... కానీ మన దేశంలో సినిమా టికెట్లపై జీఎస్టీతో పాటు లోకల్ బాడీ టాక్స్ విధిస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు మాత్రమే అని, ఆ అదనపు పన్నును తక్షణమే రద్దు చేయాలని విశాల్ కోరారు.
  • అదే విధంగా ప్రస్తుతం చిన్న సినిమాలకు తమిళనాడు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ చాలా తక్కువగా ఉందని, చిన్న చిత్రాల మనుగడ కోసం ఆ సబ్సిడీ మొత్తాన్ని ఎక్కువగా పెంచాలని విశాల్ విజ్ఞప్తి చేశారు.

సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితులైన రాజ్‌ మోహన్‌ను తాను తక్కువగా చేసి మాట్లాడటం లేదని... చిత్రసీమకు చెందిన వ్యక్తిగా తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశానని విశాల్ స్పష్టం చేశారు. తొమ్మిదేళ్లుగా ఈ ప్రతిపాదనలు నెరవేరడం లేదు కనుక వ్యక్తిగతంగా కాకుండా బహిరంగంగా చెప్పినట్టు పేర్కొన్నారు. సీఎం విజయ్ కచ్చితంగా చిత్రసీమకు పరిశ్రమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు విశాల్ తెలిపారు.

Also ReadNaga Vamsi Vs Asian Suniel - ఖతమ్ చేస్తా బిడ్డా... కొట్టుకోవడం ఒక్కటే తక్కువ - ఛాంబర్ మీటింగ్‌లో నాగవంశీ vs ఏషియన్ సునీల్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vadhandhi Season 2 OTT : అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
NTR Dragon Update : ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్? - యాక్షన్ సీక్వెన్స్‌పై క్రేజీ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్? - యాక్షన్ సీక్వెన్స్‌పై క్రేజీ అప్డేట్ ఏంటంటే?
Chinna Chinna Aasai OTT : అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Ram Charan : రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?
రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget