Virupaksha OTT Release Date : ఆదివారమే నెట్టింట్లోకి 'విరూపాక్ష' - ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే?
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'విరూపాక్ష' ఓటీటీ విడుదల తేదీ ఖరారు అయ్యింది. ఇది ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే?
![Virupaksha OTT Release Date : ఆదివారమే నెట్టింట్లోకి 'విరూపాక్ష' - ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే? Virupaksha OTT Release Sai Dharam Tej Samyuktha Menon's mystic thriller movie to strem on Netflix from May 21st Virupaksha OTT Release Date : ఆదివారమే నెట్టింట్లోకి 'విరూపాక్ష' - ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/16/51861244dd1978af12b1dc815add1f391684213533213313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా 'విరూపాక్ష' (Virupaksha Movie). రెగ్యులర్ కమర్షియల్ కథ కాకుండా... మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంపిక చేసుకుని సినిమా చేయడం కలిసి వచ్చింది. తెలుగు ప్రేక్షకుల్ని సినిమా మెప్పించింది. వంద కోట్ల వసూళ్ళను రాబట్టింది. అతి త్వరలో ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది.
ఆదివారమే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 'విరూపాక్ష'
Virupaksha OTT Release Date : 'విరూపాక్ష' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ (Netflix OTT) సొంతం చేసుకుంది. తమ డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి నెట్ ఫ్లిక్స్ అని థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు నిర్మాతలు తెలిపారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ ఆదివారమే ఓటీటీలో సినిమా సందడి చేయనుంది.
మే 21 నుంచి 'విరూపాక్ష' స్ట్రీమింగ్ అవుతుందని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదిక అనౌన్స్ చేసింది. అయితే, కేవలం తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుందా? లేదంటే తెలుగుతో పాటు హిందీ, మిగతా దక్షిణాది భాషలైన తమిళ, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుందా? అనేది చెప్పలేదు.
Also Read : గాలి జనార్ధన్ రెడ్డి వర్సెస్ సుంకాలమ్మ కథతో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'?
'స్టార్ మా' చేతికి శాటిలైట్ రైట్స్!
Virupaksha Satellite Rights : 'విరూపాక్ష' శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ నెట్వర్క్ 'స్టార్ మా' సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాను రూపొందించారు. 'స్టార్ మా'కు అన్ని భాషల్లో ఛానల్స్ ఉన్నాయి కాబట్టి... ఆ గ్రూప్ ఛానళ్లలో సినిమా టెలికాస్ట్ కావచ్చు.
'విరూపాక్ష'కు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఆయనకు రెండో చిత్రమిది. దీని కంటే ముందు నవదీప్ హీరోగా 'భం బోలేనాథ్' తీశారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో కొన్నాళ్ళు పని చేసి 'విరూపాక్ష' తీశారు.
ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ పతాకాలపై బాపినీడు బి సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. అమెరికా ప్రీమియర్స్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎర్లీ మార్నింగ్ షోస్ వరకు అన్ని ఏరియాల్లో సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో మెయిన్ ట్విస్ట్ రివీల్ చేయవద్దని చిత్ర బృందం ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తోంది. నిజం చెప్పాలంటే... స్పాయిలర్స్ చూడకుండా సినిమాకు వెళితే మంచిది. లేదంటే ఎంజాయ్ చేయలేరు.
Also Read : మహేష్, త్రివిక్రమ్ టైటిల్ రేసులో కొత్త పేరు - 'ఊరికి మొనగాడు'?
సుకుమార్ స్క్రీన్ ప్లే, బి అజనీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ సైతం ప్రశంసలు అందుకుంటున్నాయి. సాయి ధరమ్ తేజ్ విజయం అందుకున్నాడని వచ్చిన ఎర్లీ రివ్యూస్ మెగా అభిమానులు అందరికి సంతోషాన్ని ఇచ్చాయి. సోషల్ మీడియాలో మెగా మేనల్లుడికి కంగ్రాట్స్ చెబుతున్నారు. 'విరూపాక్ష' సినిమాలో సాయి చంద్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సునీల్, అజయ్, సోనియా సింగ్, రవి కృష్ణ, అభినవ్ గోమఠం, యాంకర్ శ్యామల, కామాక్షీ భాస్కర్ల, కమల్ కామరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రతి ఒక్కరూ పాత్రల పరిధి మేరకు చేశారని పేరు తెచ్చుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)