Thalapathy68 Heroine : తెలుగులో పవన్, తమిళంలో విజయ్ - స్టార్ హీరోలతో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!
తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న ఓ హీరోయిన్, తమిళంలో విజయ్ జోడీగా నటించే అవకాశం అందుకున్నారని సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడులో విజయ్ (Vijay)కు కూడా అటువంటి క్రేజ్ ఉంది. ఇప్పుడీ ఇద్దరితో నటించే అవకాశం ఓ కొత్త కథానాయికకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇంతకీ, ఆ అమ్మాయి ఎవరు? అంటే ప్రియాంకా అరుళ్ మోహన్.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ 'ఓజీ'లో...
'లియో' తర్వాత విజయ్ సినిమాలో!
పవన్ కళ్యాణ్ సరసన 'ఓజీ' సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తున్నారు. ఆ విషయం తెలుసు. ఇటీవల విడుదలైన 'ఓజీ' వీడియో గ్లింప్స్‌లో ఆమె లేరు. కానీ, ఆల్రెడీ సాంగ్ షూటింగ్ చేశారు. పవన్ కళ్యాణ్, ప్రియాంక మీద కొన్ని సన్నివేశాలు సైతం తీశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... విజయ్ సరసన నటించే అవకాశం ఆమె అందుకున్నారట.
విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'లియో'. ఈ నెలాఖరున ఆడియో విడుదల చేసి, వచ్చే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 19న 'లియో' విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆ సినిమా తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు విజయ్. అందులో కథానాయికగా ప్రియాంకా అరుళ్ మోహన్ ఎంపికైనట్లు కోలీవుడ్ టాక్.
Also Read : రాఘవేంద్రరావు క్లాప్‌తో గోపీచంద్ - శ్రీనువైట్ల సినిమా షురూ
View this post on Instagram
తమిళంలో ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan)కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. శివ కార్తికేయన్ జోడీగా ఆమె నటించిన 'వరుణ్ డాక్టర్', 'డాన్' - ఆ రెండు సినిమాలు భారీ విజయాలు సాధించాయి. సూర్యకు 'ఈటీ' (Etharkkum Thunindhavan) ఆమె నటించారు. అయితే... అది అంతగా ఆడలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు మరో సినిమా ఉంది. ధనుష్ పాన్ ఇండియా సినిమా 'కెప్టెన్ మిల్లర్'లో హీరోయిన్ కూడా ఆమే. ఇప్పుడు విజయ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది.
గాంధీ జయంతికి షూటింగ్ మొదలు?
'లియో' విడుదలకు ముందు వెంకట్ ప్రభు సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని విజయ్ భావిస్తున్నారట. అక్టోబర్ 1న పూజతో సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. గాంధీ జయంతి నాడు (అక్టోబర్ 2న) రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావచ్చని చెన్నై టాక్. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేయనున్నారని, ఓ పాత్రలో హీరోని మరింత యంగ్ గా చూపించడానికి అవసరమైన టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి వెంకట్ ప్రభు లాస్ ఏంజిల్స్ వెళతారట.
జ్యోతిక లేదా సిమ్రాన్ కూడా ఉంటారా?
వెంకట్ ప్రభు సినిమా విజయ్ 68వ సినిమా (Thalapathy 68). ఇందులో సీనియర్ హీరోయిన్లు జ్యోతిక, సిమ్రాన్... ఇద్దరిలో ఎవరో ఒకరు నటించే అవకాశం ఉందట. ఆల్రెడీ ఇద్దరితో విజయ్ సినిమాలు చేశారు. సూపర్ హిట్స్ అందుకున్నారు. కొంత గ్యాప్ తర్వాత వాళ్ళ కాంబినేషన్ అంటే క్రేజ్ ఒక రేంజ్ లో ఉంటుంది.
Also Read : షారుఖ్ ఒక్కడికీ 100 కోట్లు - నయనతార, విజయ్ సేతుపతికి ఎంత ఇచ్చారో తెలుసా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial