Vijay Deverakonda: సింపతీ కోసం ట్రై చేస్తున్న విజయ్ దేవరకొండ? స్టార్ కిడ్స్ మీద కామెంట్స్ ఎందుకు?
Vijay Deverakonda On Nepo Kids: ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ మీద విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ పట్ల సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఆయన సింపతీ కోసం ట్రై చేస్తున్నాడని విమర్శలు వచ్చాయి.

విజయ్ దేవరకొండ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇండస్ట్రీలో స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్న హీరోలకు... వారసులు (స్టార్ కిడ్స్)కు కథలు నచ్చకపోతే నో చెప్పే ఫ్రీడం ఉంటుందని, ఇన్నాళ్లు తాను ఆ ఫ్రీడం కోసం కష్టపడ్డానని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. దాంతో ఆయన సింపతి కోసం ట్రై చేస్తున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
అసలు విజయ్ దేవరకొండ ఏమన్నారు?
''నాకు తెలిసిన హీరోలు కొంత మంది ఉన్నారు. దర్శక నిర్మాతలకు 'స్క్రిప్ట్ మీద మళ్ళీ వర్క్ చేయండి. దీనితో నేను షూటింగ్ చేయలేను' అని చాలా ధైర్యంగా చెబుతారు. ఎందుకంటే వాళ్లకు బ్యాక్ గ్రౌండ్ ఉంది. సపోర్టు ఉంటుంది. పెద్ద కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలకు ఆ ధైర్యం ఉంటుంది. ఇండస్ట్రీలో ఆ సపోర్టు లేకపోతే నచ్చని కథలకు నో చెప్పలేవు. గ్యాప్ తీసుకున్నా మంచి రైటర్లను తీసుకువచ్చే ఫాదర్స్ వాళ్లకు ఉన్నారు. కెరీర్ ప్రారంభంలో నాకు ఆ అవకాశం లేదు. ఇప్పుడిప్పుడే కథ నచ్చకపోతే చేయనని బలంగా చెబుతున్నాను'' విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఇప్పుడు తాను కూడా నెపో కిడ్స్ స్థాయికి చేరుకున్నానని చెప్పారు.
విజయ్ దేవరకొండకు బ్యాక్ గ్రౌండ్ లేదా?
విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు ఇండస్ట్రీ మనిషే. సీరియల్స్ కొన్ని డైరెక్ట్ చేశారని ఇండస్ట్రీలో జనాల్లో చెబుతారు. అయితే తనకు ఎటువంటి నేపథ్యం లేదని, అవుట్ సైడర్ అన్నట్టు విజయ్ దేవరకొండ చెబుతారు. 'పెళ్లి చూపులు' నిర్మాతలలో ఒకరైన యష్ రంగినేని తెలుసు కదా! ఆయన విజయ్ దేవరకొండకు మామ వరస. ఎంతో కొంత బ్యాక్ గ్రౌండ్ విజయ్ దేవరకొండకు ఉంది.
Also Read: అమెరికా వీధుల్లో చెట్టాపట్టాల్... తెరపైకి మళ్లీ సమంత డేటింగ్ వ్యవహారం
బ్యాక్ గ్రౌండ్ విషయం పక్కన పెడితే... విజయ్ దేవరకొండ కెరీర్ స్టార్టింగ్‌లో ఆయన హీరోగా గీతా ఆర్ట్స్ రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేసింది. అందులో 'టాక్సీవాలా' మోస్తరు విజయం సాధించగా... 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ అందించింది. వైజయంతి మూవీస్ సంస్థ అతనికి 'మహానటి'లో అవకాశం ఇచ్చింది. హీరో అవ్వక ముందు 'ఎవడే సుబ్రమణ్యం'లో సెకండ్ లీడ్ ఆఫర్ చేసింది. విజయ్ దేవరకొండతో దిల్ రాజు (ఫ్యామిలీ స్టార్), మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ (ఖుషి) సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల్లో అవకాశాలు వచ్చాయి. అయితే విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆయన సింపతి కోసం ట్రై చేస్తున్నారని సెటైర్లు పడుతున్నాయి.
Ive thagginchukunte manchidhi @TheDeverakonda
— Vamc Krishna (@lyf_a_zindagi) July 8, 2025
Appatlo directors ki cheppe stage lo lenu annav kani ave Geetha Govindam,Taxiwala lu,nuvv cheppinavi emo Liger,Kushi lu ayyay.
Focus on scripts rather than these statements.Stop this Sympathy drama!!#VijayDeverakonda #Kingdom pic.twitter.com/tpZbJR0b9W
Unnecessary and immature statement from #VijayDeverakonda. Trying to gain sympathy ahead of #Kingdom release.
— Cinemania (@CinemaniaIndia) July 8, 2025
He’s an established star and definitely in a position to say no to a director/ask for script amendments if he’s smart.pic.twitter.com/z7Rfl5Ct7y
'లైగర్' రిలీజ్ కంటే ముందు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరొక సినిమా 'జనగణమణ' స్టార్ట్ చేశారు విజయ్ దేవరకొండ. అయితే 'లైగర్' డిజాస్టర్ కాగానే ఆ సినిమాను పక్కన పెట్టేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మొదలైన 'హీరో' సినిమాను కూడా అలాగే పక్కన పెట్టేశారు. వారం రోజులు షూటింగ్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేశారు. అందువల్ల, విజయ్ దేవరకొండకు నో చెప్పే అవకాశం ముందు నుంచి ఉందని, ఇప్పుడు కొత్తగా సంపతి కార్డు ట్రై చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన 'కింగ్ డమ్' జూలై 31న విడుదల కానుంది.
Also Read: మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ 'మంజుమ్మేల్ బాయ్స్' నిర్మాతల అరెస్ట్, బెయిల్ మీద విడుదల... అసలు ఏమైందంటే?





















