అన్వేషించండి

Vijay Deverakonda Rashmika Wedding : విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం - వెడ్డింగ్ కార్డ్ లీక్... టీం తీవ్ర అసహనం

Vijay Deverakonda Reaction : విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో లీక్ కావడంపై విజయ్ టీం స్పందించింది. పెళ్లి విషయాలు ఇలా లీక్ చేయడంపై అసహనం వ్యక్తం చేసింది.

Vijay Deverakonda Team Reaction About Wedding Invitation Card Leak : యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికల వివాహం ఈ నెల 26న జరగనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్ కార్డు లీకై సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. దీనిపై తాజాగా విజయ్ దేవరకొండ టీం స్పందించింది.

'సంయమనం పాటించండి'

విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి, రిసెప్షన్లకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 'హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక వివాహం ప్రచార విషయంలో కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పెళ్లి, రిసెప్షన్‌కు సంబంధించిన అన్ని వివరాలు తమ పోస్ట్‌ల్లో వెల్లడిస్తున్నారు. దీని వల్ల వివాహ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులైన అతిథులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు హాజరు కానున్నారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఆ వివరాలన్నీ వెల్లడి చేయడం కరెక్ట్ కాదు. వెడ్డింగ్ కార్డులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం అనేది ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి. అతిథులు కాంటాక్ట్ కావాల్సిన నెంబర్‌ను వెడ్డింగ్ కార్డుపై ప్రింట్ చేశారు. ఆ నెంబర్ కూడా పోస్ట్ చేశారు. దీంతో ప్రైవసీకి ఇబ్బంది కలగొచ్చు. కాబట్టి ఈ విషయంలో సోషల్ మీడియా పోస్టులు చేసేవారు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. అలాంటి పర్సనల్ ఈవెంట్‌కు సంబంధించి పోస్ట్‌లు చేసే ముందు ఆ పోస్ట్‌ల ద్వారా ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది చూసుకోవాలి.' అంటూ విజయ్ టీం పేర్కొంది.

Also Read : ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ 'డాటరాఫ్ ప్రసాదరావు' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

హైదరాబాద్‌లో రిసెప్షన్

రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో ఈ నెల 26న విజయ్, రష్మికల పెళ్లి జరగనుందని ప్రచారం సాగుతోంది. తాజాగా టీం రియాక్షన్‌తో అది కన్ఫర్మ్ అయిపోయింది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వివాహం జరగనున్నట్లు తెలుస్తుండగా... హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ లగ్జరీ హోటల్‌లో మార్చి 4న రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ లీడర్స్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Imtiaz Ali Visits Hyderabad: హైదరాబాద్‌లో ఇంతియాజ్ అలీ... అభిమానులతో కలిసి 'మై వాపస్ ఆవుంగా' విజయోత్సవం
హైదరాబాద్‌లో ఇంతియాజ్ అలీ... అభిమానులతో కలిసి 'మై వాపస్ ఆవుంగా' విజయోత్సవం
Jayasudha: 'సమ్మర్ హాలిడేస్'లో సహజ నటి... అమ్మమ్మ పాత్రలో జయసుధ ఫస్ట్ లుక్ రిలీజ్
'సమ్మర్ హాలిడేస్'లో సహజ నటి... అమ్మమ్మ పాత్రలో జయసుధ ఫస్ట్ లుక్ రిలీజ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Balakrishna Health Bulletin: నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం... హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన AIG Hospital... డాక్టర్లు ఏం చెప్పారంటే?
నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం... హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన AIG Hospital... డాక్టర్లు ఏం చెప్పారంటే?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget