D/O Prasad Rao OTT : ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ 'డాటరాఫ్ ప్రసాదరావు' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
D/O Prasad Rao OTT Platform : రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ సిరీస్ 'డాటరాఫ్ ప్రసాదరావు'. ఈ సిరీస్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగా తాజా ట్రైలర్ హైప్ క్రియేట్ చేస్తోంది.

Rajeev Kanakala's D/O Prasad Rao Kanabadutaledhu OTT Release Date Locked : రాజీవ్ కనకాల, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'డాటరాఫ్ ప్రసాద్ రావు'. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
'రెక్కీ', 'విరాటపాలెం' మేకర్స్ నుంచి వచ్చిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ 'ZEE5'లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రాజీవ్ కనకాల, ఉదయభానులతో పాటు వసంతిక, శ్రీరామ్ కీలకపాత్రలు పోషించారు. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించారు. తాజాగా సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా హైప్ క్రియేట్ చేస్తోంది.
'అమ్మికి ఏమైందో అని భయంగా ఉంది రమేషా' అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ఓపెన్ చేశారు. ఆ తరువాత కూతురి మీద తండ్రికి ఉన్న ప్రేమను చూపించారు. 'నాకు జాబ్ ఎక్కడ వచ్చిందో తెలుసా?'.. 'ఫస్ట్ జీతం రాంగానే తీసుకెళ్లి మా నాన్న చేతిలో పెట్టాలి' అని చెప్పే డైలాగ్స్‌తో కూతురికి తండ్రి మీదున్న ప్రేమను చూపించే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత కూతురు మిస్ అవ్వడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యే సీన్లతో ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా మారింది. 'కళ్ల ముందే ఏదో ఉంది.. కానీ నేను ఏదో మిస్ అవుతున్నాను.. నేను ఏం మిస్ అవుతున్నాను' అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రెబెకా జోసెఫ్ పాత్రలో ఉదయ భాను చెప్పిన డైలాగ్స్‌తో చాలానే ట్విస్టులు ఉన్నాయని అర్థం అవుతోంది.
Also Read : విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్! - క్యూట్ కపుల్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
స్వాతి మిస్సింగ్‌కు కారణం ఎవరు?
తండ్రికి కూతురంటే ప్రాణం... కూతురికి తండ్రి అంటే అమితమైన ప్రేమ. అలాంటి కూతురు పల్లెటూరి నుంచి జాబ్ కోసం పట్నం వెళ్లి మిస్ అయితే ఆ తండ్రి పడే బాధ వర్ణనాతీతం. ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా సాగే సిరీస్‌లో స్వాతి ఎలా మిస్ అయింది? దీని వెనకున్నది ఎవరు? హాస్టల్‌లో స్నేహితులు కారణమా? ఆఫీసులో గొడవలా? ఈ కేసులో తండ్రి పాత్ర ఏంటి? అనే పలు రకాల ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సిరీస్ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఈ సిరీస్‌కు మైదాల శృతి మాటల్ని రాయగా.. శ్రీ రామ్ మద్దూరి నేపథ్య సంగీతాన్ని అందించారు. చంద్రశేఖర్ జి.వి. ఎడిటర్‌గా, రామ్ కె మహేష్ కెమెరా మెన్‌గా పని చేశారు. మున్ముందు మరింత ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది.
D/O ప్రసాదరావు నటీనటులు - రాజీవ్ కనకాల, వాసంతిక, ఉదయ్ భాను, గాయత్రి భార్గవి, హిమ బిందు తదితరులు.
టెక్నికల్ టీం - నిర్మాత పేరు - కె.వి.శ్రీరామ్, ప్రొడక్షన్ హౌస్ - సౌత్ ఇండియా స్క్రీన్స్, దర్శకుడు - కృష్ణ పోలూరు, స్క్రీన్ ప్లే - కృష్ణ పోలూరు
డైలాగ్ రైటర్ - మైదాల శృతి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - శ్రీ రామ్ మద్దూరి, ఎడిటర్ - చంద్రశేఖర్.జి.వి, సినిమాటోగ్రాఫర్ - రామ్ కె మహేష్.
























