Vijay Deverakonda: అమెరికాలో రౌడీబాయ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన అభిమానులు - వీడియో వైరల్
VijayDeverakonda: విజయ దేవరకొండ.. మాస్ హీరో. తక్కువ టైంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు ఈ రౌడీ బాయ్. ఇండియాలోనే కాదు.. అమెరికాలో కూడా ఆయన ఫాలోయింగ్ మాములుగా లేదు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్.
Vijay Deverakonda Mass Fan Following In America: రౌడీబాయ్ విజయ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూత్, లేడీస్ లో రౌడీ బాయ్ కి ఫ్యాన్స్ ఎక్కువ. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మాస్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు విజయ్. అందుకే, ఆయన ఎక్కడికి వెళ్లినా ఫొటోలు దిగేందుకు ఎగబడుతుంటారు జనాలు. అది కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. అమెరికాలో కూడా రౌడీ బాయ్‌కు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. బాడీగార్డ్స్ ఉన్నా కూడా వాళ్లను నెట్టేసి మరీ.. విజయ్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు ఫ్యాన్స్. ముఖ్యంగా లేడీస్.
అమెరికాలో ఎగబడ్డ ఫ్యాన్స్..
వరుస షూట్స్ లో బిజీగా ఉన్న విజయ దేవరకొండ ప్రస్తుతం అమెరికాలో వెకేషన్ కి వెళ్లారు. ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లిన ఆయన అక్కడ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ ఫోరమ్ కి హాజరయ్యారు. ఇంకంతే.. అక్కడికి వచ్చిన విజయ్ తో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. బాడీ గార్డ్స్ ఉన్నప్పటికీ వాళ్లను పట్టించుకోకుండా విజయ్ ని కలిసేందుకు ముందుకు వచ్చారు. ఇక ముఖ్యంగా ఆడవాళ్లు పోటీపడ్డారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సింపుల్ గా బ్లాక్ సూట్, పసుపు రంగు టోపీలో కనిపించారు విజయ్. ఇక ఆయన్ను చూడగానే ప్రతి ఒక్కరు కేరింతు కొట్టారు. అయితే, అందరికీ ఓపికగా సెల్ఫీలు ఇచ్చారు విజయ్ దేవరకొండ. దీంతో ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు.
#VijayDeverakonda At ATA - USA.
— Suresh PRO (@SureshPRO_) June 10, 2024
Excellent reception by the USA Telugu people-Women forum ❤️ @TheDeverakonda pic.twitter.com/SvxgdwxWVL
సినిమాల్లో బిజీ..
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కలెక్షన్ల విషయంలో కూడా కొంతమేర నిరాశ మిగిలిందనే చెప్పాలి. ఇక ఆ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు సైన్ చేశారు విజయ్. తన బర్త్ డే రోజు ఆ ప్రాజెక్ట్ ల గురించి ప్రకటించారు. 'వీడీ14', 'ఎస్ వీసి 59'. ఇక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలో హీరో ఒక సీరియస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. భాగ్యశ్రీ భోర్సే ఇప్పటికే హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది. ఇటీవల వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఇక విజయ్ తో పాటు సత్యదేవ్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారట ఈ సినిమాలో.
ఇదిలా ఉంటే.. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తారు విజయ్. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో ప్రేమ వ్యవహారం గురించి. ఇద్దరి మధ్య ప్రేమ ఉందనే విషయంపై ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఇద్దరు ఒకేసారి ఒకే లొకేషన్ నుంచి ఫొటోలు పోస్ట్ చేయడం లాంటి చేస్తుంటారు. అయితే, ఆ వార్తలపై ఎప్పుడూ రష్మిక, విజయ్ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.
Also Read: ఇండియన్ స్టార్ వార్స్ రెడీ అయినట్లే - మనం కొడుతున్నాం!