ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' జూన్ 27న రిలీజ్! ఈ సినిమాలో ఎవరి లుక్ ఎలా ఉంటుందో ఫస్ట్ లుక్ పోస్టర్లలో చూడండి

'కల్కి'లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు టాక్. లేదంటే రెండు లుక్కులో కనిపించే ఛాన్స్ ఉంది. ఇదొక లుక్!

భైరవగా ప్రభాస్ లుక్ ఇది! ఆల్రెడీ విడుదలైన 'బుజ్జి అండ్ భైరవ' సిరీస్ చూస్తే... ఈ రోల్ ఫన్నీగా ఉండొచ్చు.

ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ఓ నాయికగా నటిస్తోంది. 'కల్కి'లో ఆమె లుక్ ఇది!

కమల్ హాసన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నట్టు తెలిసింది. ఆయన లుక్ ఇంకా రిలీజ్ చేయలేదు.

'కల్కి'లో అమితాబ్ బచ్చన్ సైతం రెండు లుక్కులో కనిపిస్తారు. డీ ఏజింగ్ టెక్నాలజీ ద్వారా యంగ్ లుక్ క్రియేట్ చేశారు.

అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ ఓల్డ్ లుక్ ఇది. కథలో రెండు కాలాల మధ్య ఆయన రోల్ కీలకం కానుందట.

'కల్కి'లో దిశా పటానీ మరొక నాయిక. ప్రభాస్, దిశ మీద ఇటలీలో సాంగ్ కూడా తీశారు. ఇంకా ఆవిడ లుక్ రిలీజ్ కాలేదు

'కల్కి' సినిమాలో బుజ్జి కార్ రోల్ కూడా కీలకమే. ఆ కారును పరిచయం చేసినప్పుడు ప్రభాస్ డ్రైవ్ చేశారు.

బుజ్జి అండ్ భైరవ ఈవెంట్ విజువల్స్... రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ చేశారు.

'కల్కి 2898 ఏడీ' సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

'కల్కి 2898 ఏడీ'కి అశ్వనీదత్ నిర్మాత. ఆయనకు కుమార్తెలు స్వప్న, ప్రియాంక అండగా ఉన్నారు.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్... 'కల్కి' క్రియేటర్ నాగ్ అశ్విన్. ఆయన దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది.

తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 27న 'కల్కి 2898 ఏడీ' విడుదల అవుతోంది.