రణబీర్ కపూర్, ఆలియా భట్.. బాలీవుడ్‌లో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరూ 2022 ఏప్రిల్‌లో పెళ్లితో ఒకటయ్యారు. 2022 నవంబర్‌లో వీరికి కూతురు కూడా పుట్టింది. రణబీర్, ఆలియా పేర్లు కలిసేలా తనకు రాహా అని పేరు పెట్టుకున్నారు. ఈ బాలీవుడ్ కపుల్‌కు సంబంధించిన విలువైన వస్తువుల గురించి, వాటి ధరల గురించి తెలిసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. రణబీర్, ఆలియా కలిసి ఉంటున్న ఇంటి పేరు ‘వాస్తు’. ఆ ఇంటి విలువ రూ.35 కోట్లు. అదే కాంప్లెక్స్‌లో ఆలియా భట్‌కు రూ.32 కోట్లు విలువ చేసే మరో ఇల్లు కూడా ఉంది. ఆలియా భట్ సొంత ప్రొడక్షన్ హౌజ్ అయిన ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ఆఫీస్ విలువ రూ.2 కోట్లు. ‘యానిమల్’ సక్సెస్ అయిన తర్వాత రూ.8 కోట్ల విలువ చేసే బెంట్లీ కాంటినెంటల్ కారును కొనుగోలు చేశాడు రణబీర్. ఆలియా వ్యానిటీ వ్యాన్‌ను షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ డిజైన్ చేశారు. దాని ధరపై క్లారిటీ లేదు. All Images Credit: Alia Bhatt/Instagram