Kingdom: విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు రాబట్టాలంటే?
Kingdom Pre Release Business: విజయ్ దేవరకొండకు క్రేజ్ బావుందని 'కింగ్‌డమ్' మరోసారి నిరూపించింది. సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? ఎన్ని కోట్లు రాబట్టాలి? అంటే...

'ది' రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'కింగ్‌డమ్' (Kingdom Telugu Movie). 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు. ఈ ముగ్గురి కాంబినేషన్‌కు తోడు నిర్మాణ సంస్థ మీద ఉన్న నమ్మకంతో మార్కెట్టులో సినిమాకు మంచి రేటు వచ్చింది. ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది.
'కింగ్‌డమ్'ను ఎన్ని కోట్లకు అమ్మారంటే?
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్టాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్టులోనూ మంచి రేటు వచ్చిందని చెప్పాలి. తెలంగాణ (నైజాం) ఏరియాలో 'కింగ్‌డమ్' డిస్ట్రిబ్యూషన్ హక్కులను 15 కోట్ల రూపాయలకు విక్రయించారు. ఏపీలో అన్ని ఏరియాలను విడివిడిగా అమ్మినప్పటికీ... ఏపీ రైట్స్ ద్వారా 15 కోట్లు, రాయలసీమ (సీడెడ్) డిస్ట్రిబ్యూషన్ హక్కుల ద్వారా మరొక 15 కోట్ల రూపాయలు వచ్చాయని ట్రేడ్ టాక్.
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల ద్వారా 'కింగ్‌డమ్' నిర్మాతలకు రూ. 36 కోట్ల రూపాయలు వచ్చాయి. ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ. 9.5 కోట్లు రాగా... కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ కలిపి మరో 3.5 కోట్లు వచ్చాయని తెలిసింది. డబ్బింగ్ రైట్స్ రూ. 3.5 కోట్లకు అమ్మారట. సో... 'కింగ్‌డమ్' టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ రూ. 52.50 కోట్లు. మినిమమ్ రూ. 54 కోట్ల షేర్ వస్తే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తాయి. సినిమా హిట్ అనిపించుకుంటుంది. అంత రావాలంటే రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టాలి.
Daily sales of #Kingdom on BMS
— ABP Desam (@ABPDesam) July 30, 2025
Sunday: 29.39K
Monday: 34.81k
Tuesday: 70.42k#VijayDeverakonda #BhagyashriBorse #KingdomOnJuly31st #AnirudhRavichander pic.twitter.com/OBzsUDJ0kt
థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు రాబడితే హిట్?
విజయ్ దేవరకొండ కెరీర్ మొత్తంలో హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమా అంటే 'లైగర్'. ఆ మూవీ రైట్స్ రూ. 88.50 కోట్లకు అమ్మారు. ఆ తర్వాత 53 కోట్ల రూపాయలతో 'ఖుషి' నిలిచింది. ఇప్పుడు 'కింగ్‌డమ్' మూడో స్థానంలో ఉంది. ఈ సినిమా బిజినెస్ రూ. 52.50 కోట్లు. 'ది ఫ్యామిలీ స్టార్' రూ. 43 కోట్లు, 'వరల్డ్ ఫేమస్ లవర్' రూ. 30.50 కోట్లు, 'డియర్ కామ్రేడ్' రూ. 34.60 కోట్లు, 'టాక్సీవాలా' రూ. 18 కోట్లు, తెలుగు - తమిళ్ బైలింగ్వల్ ఫిల్మ్ 'నోటా' రూ. 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి. ఇప్పుడు 'కింగ్‌డమ్' కలెక్షన్స్ మీద నెక్స్ట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది.
Also Read: నాగ్ మామ కాదు... నాగ్ సామ - అదీ జపాన్‌లో మన కింగ్ క్రేజ్!
విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించిన 'కింగ్‌డమ్' సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర చేశారు. మలయాళ నటుడు వెంకిటేష్ విలన్ రోల్ చేశారు. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు.





















