By: ABP Desam | Updated at : 03 May 2023 02:58 PM (IST)
విజయ్ దేవరకొండ, శ్రీలీల
పాన్ ఇండియా సెన్సేషన్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా ఈ రోజు (మే 3, బుధవారం) కొత్త సినిమా పూజా కార్యకమ్రాలతో మొదలైంది. హీరోగా విజయ్ దేవరకొండ 12వ చిత్రమిది (VD 12 Movie).
సితారలో 'జెర్సీ' తర్వాత గౌతమ్ తిన్ననూరి
తొలిసారి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు సితార సంస్థలో గౌతమ్ తిన్ననూరి 'జెర్సీ' తీశారు. అది విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు... జాతీయ పురస్కారాలు కూడా తెచ్చి పెట్టింది. ఉత్తమ తెలుగు చిత్రంగా 'జెర్సీ' జాతీయ అవార్డు అందుకుంది. అలాగే, ఆ చిత్రానికి పని చేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్ అవార్డు అందుకున్నారు.
"I don't know where I belong, to tell you whom I betrayed - Anonymous Spy" అంటూ జనవరిలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అప్పుడు విడుదల చేసిన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభమైంది.
హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ ఆవరణలో గల దేవాలయంలో జరిగిన ప్రారంభోత్సవంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి హానరరీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ సౌత్ కొరియా శ్రీ చుక్కపల్లి సురేష్ క్లాప్ ఇవ్వగా... ప్రగతి ప్రింటర్స్ ఎండీ శ్రీ పరుచూరి మహేంద్ర కెమెరా స్విచాన్ చేశారు.
విజయ్ దేవరకొండ జోడీగా శ్రీలీల
ఈ సినిమా (VD 12 Movie)లో విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల (Sreeleela) కథానాయికగా నటించనున్నారు. చిత్ర ప్రారంభోత్సవంలో ఆమె కూడా సందడి చేశారు. విజయ్ దేవరకొండ, శ్రీలీల కలయికలో తొలి చిత్రమిది. 'జెర్సీ'కి సంగీతం అందించిన రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మరోసారి గౌతమ్ తిన్ననూరి, సితార సంస్థతో కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి కూర్పు : నవీన్ నూలి, ఛాయాగ్రహణం : గిరీష్ గంగాధరన్, కళా దర్శకత్వం : అవినాష్ కొల్లా.
జూన్ నుంచి చిత్రీకరణ షురూ
రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుందని నిర్మాతలు తెలిపారు. ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ''పీరియడ్ డ్రామాగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. దీనికి ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని చెప్పారు.
Also Read : డివోర్స్ ఫోటోషూట్‌తో వైరల్ అయిన నటికి కొత్త సమస్య? - భర్త ఒక్కడే కాదు, ఇంకా 99!
ఇప్పుడు ఈ సినిమా కాకుండా శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. అందులో సమంత కథానాయిక. ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆల్రెడీ చిత్రీకరణ చాలా వరకు పూర్తి అయ్యింది. బహుశా... జూన్ నెలకు ఆ సినిమా కంప్లీట్ కావచ్చు.
Also Read : నేను ఆత్మహత్య చేసుకుంటే కారణం వీళ్ళే, నన్ను చంపేందుకూ ప్రయత్నించారు - లిరిసిస్ట్ శ్రేష్ఠ షాకింగ్ పోస్ట్
LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!
Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!
'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్
కోలీవుడ్ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్
Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!
IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!
YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి