అన్వేషించండి

King Of Kotha: ‘లైగర్’తో పోలుస్తూ ‘కింగ్ ఆఫ్ కోథా’పై కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ - దుల్కర్ రెస్పాన్స్ ఇది

‘కింగ్ ఆఫ్ కోట’లో హీరోగా నటించిన దుల్కర్ సల్మాన్.. విజయ్ దేవరకొండతో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. అంతే కాకుండా విజయ్ కూడా ‘కింగ్ ఆఫ్ కోట’ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

‘కింగ్ ఆఫ్ కోథా’ మూవీ ప్రమోషన్స్ కోసం రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను రంగంలోకి దించారు మేకర్స్. ఈ సందర్భంగా ఇద్దరు.. ఒకరి మూవీని మరొకరు ప్రమోట్ చేసుకున్నారు. ‘కింగ్ ఆఫ్ కొథా’లో హీరోగా నటించిన దుల్కర్ సల్మాన్.. విజయ్ దేవరకొండతో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. అంతే కాకుండా విజయ్ కూడా ‘కింగ్ ఆఫ్ కోథా’ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇద్దరూ బిజీ..
విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్.. ఈ ఇద్దరు హీరోలకు యూత్‌లో, ముఖ్యంగా అమ్మాయిల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఈ ఇద్దరి కెరీర్ దాదాపుగా ఒకేవిధంగా సాగింది. ప్రస్తుతం వీరిద్దరు బాక్సాఫీస్ వద్ద ఒకవారం తేడాతో తమ సినిమాలను విడుదల చేసి, ఎవరిది పైచేయి సాధించనుందో పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. దుల్కర్ సల్మాన్.. తను నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘కింగ్ ఆఫ్ కోథా’ను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉంటే.. విజయ్ దేవరకొండ తను చేసిన లవ్ స్టోరీ ‘ఖుషి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇక ప్రమోషన్స్‌కు హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశ్యంతో వీరిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూలో వైరల్ అవుతోంది.

జోనర్ ఎక్స్‌ఛేంజ్..
‘సీతారామం’ లాంటి లవ్ స్టోరీ తర్వాత ‘కింగ్ ఆఫ్ కోథా’ లాంటి యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు దుల్కర్ సల్మాన్. ఇక ‘లైగర్’ లాంటి యాక్షన్ సినిమా తర్వాత ‘ఖుషి’ లాంటి ప్రేమకథతో ప్రేక్షకులను పలకరించనున్నాడు విజయ్ దేవరకొండ. ఇది చూస్తుంటే ఒకరి జోనర్‌ను మరొకరు ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది పరిస్థితి. విజయ్‌కు ప్రేమకథలే ఎక్కువగా కలిసొచ్చాయి. కానీ దుల్కర్ మాత్రం తనకు సక్సెస్ ఇచ్చిన ఫీల్ గుడ్ చిత్రాలను కాదని, యాక్షన్ జోనర్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నాడు. 

నా సినిమాలాగా అవ్వకూడదు..
విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కలిసి ఇంటర్వ్యూ చేసిన సమయంలో ‘నీ యాక్షన్ సినిమా నాదానికంటే బెటర్‌గా ఆడాలని కోరుకుంటున్నాను.’ అంటూ విష్ చేశాడు. అంటే ‘లైగర్’ను ఉద్దేశించి విజయ్ మాట్లాడాడా అంటూ ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ‘లైగర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే ‘కింగ్ ఆఫ్ కోథా’ బెటర్‌గా ఆడాలని విజయ్ కోరుకుంటున్నట్టు అనిపిస్తోంది ఈ కామెంట్ చూస్తుంటే. తన సినిమాల రిజల్ట్ గురించి విజయ్ ఎప్పుడూ ఇలా ఫన్నీగానే తీసుకుంటాడు. కానీ ‘లైగర్’లాగా ‘ఖుషి’ అవ్వకూడదని, ఈ ప్రేమకథతో తనకు సక్సెస్ రావాలని విజయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక విజయ్ చేసిన కామెంట్‌కు సమాధానంగా దుల్కర్ కూడా ‘నీ ప్రేమకథ నా ప్రేమకథలాగానే విచ్చుకోవాలని కోరుకుంటున్నాను’ అన్నాడు. అంటే ‘సీతారామం’ లాంటి సక్సెస్‌ను ‘ఖుషి’తో చూడాలని దుల్కర్ కోరుకుంటున్నట్టు చెప్పకనే చెప్పాడు.

Also Read: ఝలక్ ఇచ్చిన అనసూయ - సోషల్ మీడియా నెగిటివిటీకి కాదు, ఏడ్చింది అందుకేనట!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Embed widget