అన్వేషించండి

Vidya Vasula Aham Teaser: ‘విద్య వాసుల అహం’ టీజర్ - అమ్మాయిలను పడేయడం కాదు, వారితో పడటమే కష్టం!

Vidya Vasula Aham Teaser: రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘విద్య వాసుల అహం’ మూవీ టీజర్ తాజాగా విడుదలయ్యింది. ఈ టీజర్ చూస్తుంటే ఇదొక యూత్‌ఫుల్ కథ అని అర్థమవుతోంది.

Vidya Vasula Aham Teaser Is Out Now: ఈరోజుల్లో యూత్‌కు కనెక్ట్ అయ్యే కథలు చాలావరకు బ్లాక్‌బస్టర్ సాధిస్తున్నాయి. కథ రొటీన్‌గా ఉన్నా యూత్‌కు కనెక్ట్ అయితే చాలు.. సినిమా మినిమమ్ హిట్ అని మేకర్స్ కూడా నమ్ముతున్నారు. తాజాగా విడుదలయిన ‘విద్య వాసుల అహం’ టీజర్ చూస్తుంటే.. ఈ సినిమా కూడా అదే కేటగిరికి చెందుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా ఇన్నాళ్లకు నేరుగా ఓటీటీలో విడుదల అవ్వడానికి సిద్ధమయ్యింది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.

పెళ్లి వద్దు..

‘దాంపత్యం యొక్క విలువేంటో చెప్పే చిన్న కథ ఒకటి చెప్తాను’ అంటూ తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్‌తో ‘విద్య వాసుల అహం’ టీజర్ మొదలవుతుంది. విద్యగా శివానీ రాజశేఖర్, వాసుగా రాహుల్ విజయ్ పరిచయమవుతారు. ‘నాకు ఏ పెళ్లి అక్కర్లేదు’ అనే డైలాగ్‌తో విద్య క్యారెక్టర్‌ను, ‘పెళ్లొక్కటేరా వద్దనుకున్నది’ అనే డైలాగ్‌తో వాసు క్యారెక్టర్‌ను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నారు మేకర్స్. ‘అమ్మాయిలను పడేయడం కష్టం కాదు మాస్టారు.. అమ్మాయిలతో పడడమే కష్టం’ లాంటి డైలాగ్స్.. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ‘విద్య వాసుల అహం’ టీజర్‌లోని డైలాగ్‌లతో హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌ను పర్ఫెక్ట్‌గా ప్రజెంట్ చేశాడు దర్శకుడు మణికాంతె గెల్లి.

ఇద్దరికీ ఈగో..

వాసును పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో వాళ్ల దగ్గర నుండి, ఫ్రెండ్స్ దగ్గర నుండి ఒత్తిడి మొదలవుతుంది. అదే సమయంలో విద్యతో వాసుకు పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. ఆ పెళ్లిచూపుల్లో ‘మద్యం అలవాటు లేదా’ అని విద్య అడగగా.. ‘మధ్యాహ్నం అలవాటు లేదు’ అంటూ వాసు ఇచ్చే సమాధానం ప్రేక్షకులను నవ్విస్తుంది. అలా విద్య, వాసు పెళ్లి చేసుకునే విషయాన్ని కూడా టీజర్‌లోనే రివీల్ చేశారు. పెళ్లయిన తర్వాత తనకు ఈగో ఉందనే విషయాన్ని విద్య రివీల్ చేస్తుంది. విద్యతో సమానంగా తనకు కూడా ఈగో ఉందని వాసు కూడా నిరూపించాలని చూస్తాడు. అందుకే ‘ఎందుకైనా మంచిది.. మనం ముందు నుండే కొంచెం స్టిఫ్‌గా ఉంటే బెటర్’ అని తనకు తాను అనుకుంటాడు.

కెమిస్ట్రీ హైలెట్..

ఇద్దరి మధ్య ఉన్న ఈగో వల్ల విద్య, వాసుల పెళ్లి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి అన్నది ‘విద్య వాసుల అహం’ సినిమా కథ అని టీజర్‌లోనే క్లియర్‌గా చెప్పేశాడు మణికాంత్ గెల్లి. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కలిసి ఇప్పటికీ రెండు సినిమాల్లో నటించారు. ఈ రెండిటిలో వీరి కెమిస్ట్రీ, కాంబినేషన్ బాగా వర్కవుట్ అయ్యింది. అదే విధంగా ‘విద్య వాసుల అహం’లో కూడా వీరి కెమిస్ట్రీనే హైలెంట్‌గా నిలవనుందని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ మూవీలో అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి లాంటి నటీనటులు కూడా ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా టీజర్‌లో ఇంకా ఎవ్వరి క్యారెక్టర్లను రివీల్ చేయలేదు. అంతే కాకుండా ఆహాలో ‘విద్యా వాసుల అహం’ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయం కూడా ఇంకా ప్రకటించలేదు.

Also Read: 'సలార్ 2'పై పృథ్వీరాజ్ ట్వీట్ - 'కెజియఫ్'తో లింక్ చేస్తారా? ఎన్టీఆర్ సినిమాతోనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Embed widget