Venkatesh: వెంకటేష్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఫిక్స్... వాళ్ళిద్దరి టార్గెట్ అదేనా!?
Venkatesh Trivikram Movie: విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఆ మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారని తెలిసింది. అది ఏమిటంటే?

Venkatesh Trivikram Movie Title News: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి'... వెంకీ త్రివిక్రమ్ కలిసి చేసిన సినిమాలు వినోదాన్ని పంచాయి. కుటుంబ ప్రేక్షకులకు అమితంగా నచ్చాయి. ఇప్పుడు మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వాళ్ళిద్దరూ సినిమా చేస్తున్నారట. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇప్పుడు ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దానికి టైటిల్ ఖరారు చేశారట.
'వెంకటరమణ'గా వెంకటేష్?
వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్న చిత్రానికి 'వెంకటరమణ' టైటిల్ ఖరారు చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇంతకు ముందు వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన సినిమాల తరహాలో ఇది కూడా ఫక్తు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అట.
వెంకీ సినిమా స్క్రిప్ట్ త్రివిక్రమ్ ఫినిష్ చేసేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా జరుగుతున్నాయి. త్వరలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్ ఎవరు? అనే విషయం మీద కొత్త కబురు వినబడుతోంది.
వెంకటేష్ సరసన త్రిష...!?
Trisha to pair up with Venkatesh in Trivikram's Venkata Ramana movie?: వెంకటేష్ - త్రివిక్రమ్ సినిమాలో కథానాయికగా కన్నడ భామ, 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్ నటించనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్త పేరు వినపడుతోంది.
Also Read: నితిన్ గురి తప్పింది... 'తమ్ముడు' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్న ఈ 'వెంకటరమణ' సినిమాలో వెంకటేష్ సరసన త్రిష కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయట. 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే', 'ఓం నమోః వెంకటేశాయ'... వెంకీ - త్రిష కాంబినేషన్ సూపర్ హిట్. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన కల్ట్ క్లాసిక్ 'అతడు'లోనూ త్రిష నటించారు. మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందా? లేదా? అనేది చూడాలి. త్వరలో హీరోయిన్ సహా ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు.

'వెంకటరమణ' చిత్రీకరణ మూడు నుంచి నాలుగు నెలల సమయంలో ఫినిష్ చేసి, వీలైనంత త్వరగా సినిమాను రెడీ చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇది పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ హీరోగా తీయబోయే మైథాలాజికల్ ఫాంటసీ పాన్ ఇండియా సినిమా పనుల్లో బిజీ అవుతారు.





















