అన్వేషించండి

Venkatesh AK47 : చిట్టిబాబుగా వెంకటేశ్ - ఆదర్శ కుటుంబంలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్

Aadarsha Kutumbam Update : విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఏకే 47' నుంచి మరో సర్ప్రైజ్ వచ్చేసింది. ఈ సినిమాలో వెంకీ రోల్ ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్.

Venkatesh As Chittibabu In Aadarsha Kutumbam : విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47'. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్‍తో పాటు క్రేజీ కాంబో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ప్రమోషన్స్‌లో భాగంగా ఒక్కో పాత్రను రివీల్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా వెంకీ రోల్‌పై మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు.

చిట్టిబాబుగా...

ఈ సినిమాలు చిట్టిబాబు పాత్రలో వెంకీ కనిపించనున్నారు. ఫ్యామిలీ మ్యాన్‌గా ఆయన డీసెంట్ లుక్ అదిరిపోయింది. స్పెషల్ వీడియోలో వెంకీ రోల్ నవ్వులు పూయిస్తోంది. కొత్త హౌస్‌లోకి వెంకీ అండ్ ఫ్యామిలీ ఎంట్రీ ఇవ్వగా... 'నాన్నా నువ్వు ఈజీగా వంట చేసుకోవచ్చు. వాషింగ్ మెషీన్ కూడా ఉంది. ఈజీగా పనులు చేసుకోవచ్చు.' అంటూ హీరోయిన్ శ్రీనిధి శెట్టి వెంకటేశ్‌కు చెప్పడం నవ్వులు పూయిస్తోంది. దీనికి కమెడియన్ రఘుబాబు ఎక్స్‌ప్రెషన్స్, వెంకీ ఇరిటేషన్ కామెడీ పండించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ప్రస్తుతానికి వెంకీ చిట్టిబాబు పాత్రను పరిచయం చేయగా... త్వరలోనే హీరోయిన్ శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ పాత్రలను పరిచయం చేయనున్నారు. ఈ నలుగురి పాత్రలు ఈ ఆత్మీయ కుటుంబ కథకు హృదయంగా నిలవనున్నాయి. సహజమైన నటన, అద్భుతమైన కామెడీ టైమింగ్, కుటుంబ కథా చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన వెంకటేష్ మరోసారి అన్ని వయసుల ప్రేక్షకులను అలరించే పాత్రతో రాబోతున్నారు. ఆనందం, అనుబంధాలు, కుటుంబ విలువలకు ప్రతిరూపంగా ఈ పాత్ర ఉండబోతోంది.

Also Read : Rishab Shetty : స్పైడర్ మ్యాన్‌తో రిషబ్ శెట్టి - నేను మీకు బిగ్ ఫ్యాన్... ఫ్యామిలీతో కలిసి మూవీకి...

ఎందుకంత స్పెషల్?

వెంకటేశ్, శ్రీనిధి శెట్టి కపుల్‌గా నటిస్తుండగా... ఇద్దరు పిల్లలు ఓ ఆత్మీయ కుటుంబ కథను త్రివిక్రమ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్‌గా నారా రోహిత్, రఘుబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా... 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.

హీరో వెంకీ కెరీర్‌లో ఇది 77వ సినిమా. త్రివిక్రమ్ - వెంకీ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్రివిక్రమ్ రచయితగా, వెంకీ హీరోగా వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి', 'వాసు' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఇప్పుడు రాబోతోన్న ఏకే 47పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.

Also Read : Sai Kumar Birthday : మై నేమ్ ఈజ్ అగ్ని - హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్... డైలాగ్ కింగ్ బర్త్ డే స్పెషల్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget