అన్వేషించండి

Rishab Shetty : స్పైడర్ మ్యాన్‌తో రిషబ్ శెట్టి - నేను మీకు బిగ్ ఫ్యాన్... ఫ్యామిలీతో కలిసి మూవీకి...

Rishab Shetty Spider Man : తాను చిన్నప్పటి నుంచి స్పైడర్ మ్యాన్‌కు బిగ్ ఫ్యాన్ అని చెప్పారు. మార్వెల్ రూపొందించిన స్పెషల్ వీడియోలో ఆయన స్పైడర్ మ్యాన్‌తో కలిసి కనిపించారు.

Rishab Shetty Meets Spider Man Tom Holland : కన్నడ స్టార్, కాంతార హీరో, డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టి తాను చిన్నప్పటి నుంచి స్పైడర్ మ్యాన్‌కు వీరాభిమాని అని తెలిపారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సోలో మూవీ 'స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే' (Spider Man : Brand New Day). జులై 30న వరల్డ్ వైడ్‌గా సినిమా రిలీజ్ కానుండగా... మార్వెల్ రూపొందించిన స్పెషల్ వీడియోలో రిషబ్ శెట్టి కనిపించారు. ఇందులో ఆయన స్పైడర్ మ్యాన్‌ను కలుసుకుని... సూపర్ హీరోపై తన అభిమానం చాటుకున్నారు. 

'ఆ రోల్ నాకు ఇన్‌స్పిరేషన్'

ఎన్నో ఏళ్ల క్రితం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఫస్ట్ టైం స్పైడర్ మ్యాన్ సినిమా చూశానని తెలిపారు రిషబ్ శెట్టి. 'ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు పీటర్ పార్కర్ పాత్రతో నాకు అనుబంధం ఏర్పడింది. జీవితంలో అవమానాలు జరిగినా, కష్టాలు ఎదురైనా మనలోని మంచితనాన్ని కోల్పోకూడదని ఆ పాత్ర నాకు నేర్పింది. అత్యధిక శక్తి ఉంటే అంతే బాధ్యత కూడా ఉండాలనే సందేశం స్పైడర్ మ్యాన్ ఎప్పటికీ గుర్తు చేస్తాడు. అందుకే నా అభిమానం ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు నా పిల్లలకు కూడా స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. వాళ్ల కోసమే Spider Man : Brand New Day టికెట్లు ముందుగానే బుక్ చేశాను. అందరం కలిసి థియేటర్‌లో ఈ సినిమా చూడబోతున్నాం.' అని చెప్పారు.

ఈ మూవీకి డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించగా... టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్‌గా ప్రధాన పాత్రలో నటించారు. ఆయనతో పాటు జెండయా, సాడీ సింక్, జాకబ్ బటలోన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకూ వచ్చిన మూడు పార్టులు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. జులై 30న (గురువారం) వరల్డ్ వైడ్‌గా ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget