Rana Naidu 2: 'రానా నాయుడు 2' ఎక్స్‌క్లూజివ్ అప్డేట్ - సెట్స్ మీదకు వెళ్ళేది ఎప్పుడంటే?
Venkatesh Rana Naidu 2: విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అతి త్వరలో సీజన్ 2 స్టార్ట్ కానుంది.
తండ్రి కుమారులుగా దగ్గుబాటి బాబాయ్ & అబ్బాయ్ విక్టరీ వెంకటేష్, వెర్సటైల్ స్టార్ రానా నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల అయ్యింది. కంటెంట్ పరంగా తెలుగు వీక్షకుల నుంచి కొన్ని విమర్శలు వ్యక్తం అయినప్పటికీ... బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిందీ సిరీస్. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల ప్రజలు సైతం చూడటంతో మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. దాంతో సెకండ్ సీజన్ తీయడానికి రెడీ అయ్యారు. 'రానా నాయుడు 2' సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుంది? అంటే...
మార్చి నెలాఖరున 'రానా నాయుడు 2' షురూ!
The regular shoot for Rana Naidu 2 web series starts on March 25th: ఈ నెల 25న 'రానా నాయుడు' వెబ్ సిరీస్ సీజన్ 2 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వెంకటేష్, రానా... హీరోలు ఇద్దరితో పాటు ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు.
ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ చేస్తున్నారు రానా. ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం కీలక పాత్ర చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కీలక సన్నివేశాలు తీశారు. 'సైంధవ్' తర్వాత మరొక సినిమా స్టార్ట్ చేయలేదు వెంకటేష్. అనిల్ రావిపూడితో ఓ సినిమా విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. అయితే... అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.
Also Read: ప్రభాస్ ఒక్కడి కోసమే అలా చేశారంతే - పాన్ ఇండియా ఫిల్మ్స్, 'భీమా' గురించి గోపీచంద్ ఇంటర్వ్యూ
యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన 'రానా నాయుడు'లో రానా దగ్గుబాటి భార్య పాత్రలో సుర్వీన్ చావ్లా నటించారు. గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్ళై తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ దర్శకత్వం వహించారు. హాలీవుడ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'రే డొనోవన్' ఆధారంగా ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు మార్పులు, చేర్పులు చేశారు. కొన్ని సన్నివేశాలు, సంభాషణల విషయంలో తెలుగు ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
Also Read: అమ్మ 'రికార్డ్ బ్రేక్' కథ వినలేదు, నేను ఓకే చేశాక చెప్పా: జయసుధ కుమారుడు నిహిర్ కపూర్ ఇంటర్వ్యూ
'రానా నాయుడు 2'కి జాగ్రత్త పడుతున్న వెంకటేష్!
జనవరిలో 'రానా నాయుడు 2' స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే... కాస్త లేటుగా సెట్స్ మీదకు వెళుతోంది. 'సైంధవ్' ప్రచార కార్యక్రమాల్లో 'రానా నాయుడు 2' వెబ్ సిరీస్ గురించి వెంకటేష్ మాట్లాడుతూ... ''ఈసారి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్లు ఏమో 'ఏంట్రా నువ్వు అలా చేశావు' అన్నారు. కుర్రాళ్లు అందరూ చూసేశారు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకుంటాను. 'రానా నాయుడు' చూసి మనవాళ్లు కొంచెం హర్ట్ అయ్యారు. ఈసారి చాలా చక్కగా ఉంటుంది. జాగ్రత్త పడతా. కాకపోతే కొంచెం కొంటెగా, అల్లరిగా ఉంటుంది'' అని వివరించారు.