అన్వేషించండి

Gopichand interview: ప్రభాస్ ఒక్కడి కోసమే అలా చేశారంతే - పాన్ ఇండియా ఫిల్మ్స్, 'భీమా' గురించి గోపీచంద్ ఇంటర్వ్యూ

Gopichand interview ahead of Bhimaa release: మార్చి 8న 'భీమా' విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గోపీచంద్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సినిమాతో పాటు పాన్ ఇండియా ఫిల్మ్స్, ఫ్లాప్స్ గురించి మాట్లాడారు.

ప్లాన్ చేసి పాన్ ఇండియా ఫిలిమ్స్ చేయలేమని టాలీవుడ్ కథానాయకుడు, మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand Interview) అన్నారు. ఇప్పటి వరకు పాన్ ఇండియా సక్సెస్ సాధించిన సినిమాలు చూస్తే, ముందు నుంచి ప్లాన్ చేసుకుని చేయలేదని, ఒక్క ప్రభాస్ కోసమే ప్లాన్ చేసి మరీ పాన్ ఇండియా సినిమాలు చేశారని ఆయన గుర్తు చేశారు. తనకు పాన్ ఇండియా ప్లాన్స్ లేవని, ముందు తెలుగులో మంచి మంచి సినిమాలు చేయాలని ఉందని చెప్పుకొచ్చారు గోపీచంద్.

'భీమా'కు ముందు మరో కథ చెబితే వద్దన్నాను
గోపీచంద్ కథానాయకుడిగా నటించిన 'భీమా' సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా ఆయన ప్రింట్ అండ్ వెబ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 'భీమా'తో పాటు పాన్ ఇండియా ఫిలిమ్స్, ఫ్లాప్స్ గురించి మాట్లాడారు.
 
'భీమా' విడుదల తేదీ గురించి గోపీచంద్ మాట్లాడుతూ... ''మహా శివరాత్రికి మేం ఈ సినిమాను విడుదల చేయాలనుకోలేదు. తొలుత డిసెంబర్ అనుకున్నాం. అప్పుడు 'సలార్' వచ్చింది. సంక్రాంతికి అనుకుంటే ఎక్కువ సినిమాలు ఉన్నాయి. అలా అలా మార్చి 8కి వచ్చాం. మహా శివరాత్రికి ప్రేక్షకుల ముందుకు వస్తుందీ సినిమా. ఇదీ శివుని ఆజ్ఞ అనుకుంటున్నాను'' అని చెప్పారు.

Also Readఅఖండతో పోలిస్తే మంచిదే! కానీ... 'భీమా'లో అఘోరాలపై గోపీచంద్ ఏం చెప్పారంటే?

'భీమా' సినిమా ఎలా మొదలైంది? అనేది గోపీచంద్ చెబుతూ... ''కెకె రాధామోహన్ గారి నిర్మాణంలో 'పంతం' చేశా. ఆయనతో మంచి అనుబంధం ఉంది. 'భీమా' సహ నిర్మాత శ్రీధర్ గారు కూడా చాలా రోజుల నుంచి తెలుసు. కోవిడ్ టైంలో దర్శకుడు హర్షని పరిచయం చేశారు. ఫేస్ టైంలో ఓ కథ చెప్పారు హర్ష. నాకు నచ్చలేదు. ఈ టైంలో అటువంటి కథ కంటే పోలీస్ నేపథ్యంలో డిఫరెంట్ కథ చెప్పమని అడిగా. ఎనిమిది నెలల సమయం తీసుకుని 'భీమా' కథ చెప్పారు. కథతో పాటు భీమా క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది. ఇందులో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ ఉంది. అది ఇంకా నచ్చింది. అలా సినిమా మొదలైంది'' అని చెప్పారు.
 
ఆ పోలీసులకు, ఈ పోలీసుకు సంబంధం లేదు!
'గోలీమార్', 'శౌర్యం', 'ఆంధ్రుడు' సినిమాల్లో గోపీచంద్ పోలీస్ క్యారెక్టర్స్ చేశారు. ఆ సినిమాకు, ఈ 'భీమా'లో పోలీసుకు వ్యత్యాసం ఏమిటి? అని అడిగితే... ''ఈ మూడు పోలీస్ క్యారెక్టర్లకు పూర్తిగా వైవిధ్యమైన క్యారెక్టర్ భీమా. పోలీసు కథలో దర్శకుడు హర్ష సెమీ ఫాంటసీ ఎలిమెంట్ యాడ్ చేయడంతో కథ కొత్తగా ఉంటుంది. ఖాకీ పాత్రతో పాటు ప్రేమ, ఎమోషన్, రొమాన్స్ వంటి అంశాలు అన్నీ సినిమాలో ఉన్నాయి'' అని చెప్పారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు 'భీమా' క్యారెక్టర్ గుర్తుండిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఎమోషన్ వర్కవుట్ అయితే యాక్షన్ బావుంటుంది!
'కెజియఫ్', 'ఆర్ఆర్ఆర్', 'సలార్' వంటి పాన్ ఇండియా ఫిలిమ్స్ తర్వాత యాక్షన్ సీక్వెన్సులను తెరకెక్కించే తీరు మారింది. 'భీమా'లో గోపీచంద్ గెటప్, టీజర్ & ట్రైలర్లలో యాక్షన్ చూస్తే ఆ తరహాలో ప్రయత్నించినట్టు అర్థం అవుతోంది. ఈ విషయాన్ని ప్రస్తావించగా... ''కమర్షియల్ సినిమా మారలేదు. ఇప్పుడు లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ అంటున్నారు. ఏ సినిమా అయినా సరే ఎమోషన్ వర్కవుట్ అయితే యాక్షన్ బావుంటుంది. ఫైట్ ఎందుకు చేస్తున్నారు? అనే ఎమోషన్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయితే హిట్ అవుతుంది'' అని చెప్పారు గోపీచంద్. 'భీమా'లో యాక్షన్ అందరికీ నచ్చేలా ఉంటుందని ఆయన చెప్పారు. 

'కెజియఫ్', 'సలార్' చూసి సంగీత దర్శకుడిని తీసుకోలేదు!
'భీమా' దర్శకుడితో పాటు సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ - ఇలా ఎక్కువ మంది టెక్నికల్ టీం కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినోళ్లే. 'కెజియఫ్', 'సలార్' విజయాలతో సంగీత దర్శకుడు రవి బస్రూర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. దీని గురించి ప్రశ్నించగా... ''సినిమాటోగ్రాఫర్ స్వామి జె గౌడ, హర్ష కలిసి 'భీమా'కు ముందు ఆరు సినిమాలు చేశారు. రవి బస్రూర్ కూడా వాళ్లతో సినిమాలు చేశారు. మా 'భీమా'కు వాళ్లు అయితే బావుంటుందని హర్ష అడిగితే 'ఎస్' అన్నాను'' అని చెప్పారు. తాను ఇంకా నేపథ్య సంగీతంతో సినిమా చూడలేదని గోపీచంద్ చెప్పారు.

మళ్లీ విలన్ రోల్ చేయాలని ఆశ పడటం లేదు!
ఇప్పుడు హీరోలు అందరూ విలన్ రోల్స్ చేస్తున్నారు. గోపీచంద్ విలన్ రోల్స్ చేసి, విజయాలు అందుకుని హీరోగా వచ్చారు. మళ్లీ విలన్ రోల్ చేసే ఆలోచన ఉందా? అని అడిగితే... ''లేదు'' అని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఇప్పుడు విలన్ రోల్స్ చేస్తున్న హీరోలు ఇంతకు ముందు చేయలేదు కనుక వాళ్లకు కొత్తగా ఉంటుంది. నేను చేశా కదా'' అని చెప్పారు.

ప్రభాస్ (Prabhas)తో సినిమా, హిందీ ఎంట్రీ గురించి...
ప్రభాస్, గోపీచంద్ స్నేహం గురించి ప్రేక్షకులకు తెలుసు. వాళ్లిద్దరి కలయికలో ఒక సినిమా వస్తే చూడాలని ఫ్యాన్స్ కోరిక. అసలు, అటువంటి సినిమా చేసే ప్లానింగ్ ఉందా? అని అడిగితే... ''మేం సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మంచి కథ కుదరాలి. దానికి ఎప్పుడు టైం వస్తుందో తెలియదు. కానీ, తప్పకుండా చేస్తాం' అని చెప్పారు గోపీచంద్. 'సలార్'లో మీరిద్దరూ చేస్తే బావుండేది? అని అడిగితే... ''దర్శకుడు అనుకోవాలి కదా'' అని చెప్పారు.

Also Read: ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? - ఇదీ గోపీచంద్ రియాక్షన్

'భీమా' విడుదలకు ముందు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు గోపీచంద్. అది పూర్తిగా శ్రీను వైట్ల శైలి యాక్షన్, కామెడీతో ఉంటుందని చెప్పారు. అది కాకుండా ప్రసాద్ దర్శకత్వంలో ఒక సినిమా, 'జిల్', 'రాధే శ్యామ్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంల్కో యువి క్రియేషన్స్ నిర్మించే మరో సినిమా ఉన్నాయని చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Perni Nani: ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
Embed widget