అన్వేషించండి
Nihir Kapoor Interview: అమ్మ 'రికార్డ్ బ్రేక్' కథ వినలేదు, నేను ఓకే చేశాక చెప్పా: జయసుధ కుమారుడు నిహిర్ కపూర్ ఇంటర్వ్యూ
Jayasudha son Nihir Kapoor Interview: పాన్ ఇండియా మూవీ 'రికార్డ్ బ్రేక్'లో సహజ నటి జయసుధ తనయుడు నిహిర్ కపూర్ హీరోగా నటించారు. మార్చి 8న సినిమా విడుదల కానున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
నిహిర్ కపూర్
1/7

సహజ నటి జయసుధ తనయుడు నిహిర్ కపూర్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'రికార్డ్ బ్రేక్'. మార్చి 8న థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. సినిమా విడుదల సందర్భంగా హీరో నిహిర్ కపూర్ మీడియాతో ముచ్చటించారు. హీరోగా నిహిర్ తొలి సినిమా 'రికార్డ్ బ్రేక్' అయినప్పటికీ... ఇంతకు ముందు 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' సినిమాలో విలన్ రోల్ చేశారు. అందులో చదలవాడ శ్రీనివాసరావు తనయుడు లక్ష్య్ హీరో. ఆ సినిమా చేసేటప్పుడు 'రికార్డ్ బ్రేక్' కథ చెప్పారని, కథతో పాటు క్యారెక్టరైజేషన్ నచ్చడంతో ఓకే చేశానని నిహిర్ కపూర్ తెలిపారు.
2/7

'రికార్డ్ బ్రేక్' కథ గురించి నిహిర్ కపూర్ మాట్లాడుతూ... ''ఈ సినిమాలో నేను, మరొక హీరో నటించాం. నాన్ ఐడెంటికల్ ట్విన్స్ రోల్స్ చేశాం. వాళ్లిద్దరూ అనాథలు. ఓ అడవిలో పెరిగిన వాళ్లు... కుస్తీ పోటీలు నేర్చుకుని ఇంటర్నేషనల్ స్థాయిలో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరకు వెళ్లడం సినిమా కథ'' అని చెప్పారు. 'దంగల్' ఈ తరహా కథ అయినప్పటికీ... అందులో, ఇందులో వేర్వేరు ఎమోషన్స్ ఉంటాయని నిహిర్ చెప్పారు. మదర్ సెంటిమెంట్, యాక్షన్, కుస్తీ పోటీలు 'రికార్డ్ బ్రేక్'ను కొత్తగా మార్చాయని అన్నారు.
Published at : 05 Mar 2024 07:13 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















