Viraaji Trailer: ‘విరాజి’ ట్రైలర్ - ఆత్మలతో మాట్లాడే వరుణ్ సందేశ్, అసలు ఆ మెంటల్ హాస్పిటల్‌లో ఏం జరిగింది?
Viraaji Trailer: వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన హారర్ చిత్రమే ‘విరాజి’. ఈ మూవీ కోసం వరుణ్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. తాజాగా ‘విరాజి’ ట్రైలర్ విడుదలయ్యి సినిమాపై మరింత ఆసక్తి పెంచేసింది.
Varun Sandesh Viraaji Trailer Is Out Now: ఈ రోజుల్లో డిఫరెంట్ కథలకు ప్రేక్షకులకు ఎక్కువగా ఇంప్రెస్ అవుతున్నారు. అందుకే అందరు హీరోలు కొత్త కథలను ఎంచుకోవడానికి మొగ్గుచూపిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోయిన వరుణ్ సందేశ్ సైతం డిఫరెంట్ కథల వైపు అడుగులేస్తున్నాడు. అదే క్రమంలో ‘విరాజి’ అనే హారర్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్.. అందరిలో ఆసక్తి క్రియేట్ చేశాయి. తాజాగా ‘విరాజి’ ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
1970 నాటి మెంటల్ హాస్పిటల్..
‘విరాజి’ ట్రైలర్ మొదలవ్వగానే వర్షం, ఒక బిల్డింగ్.. అందులో ఒక తల విరిగిపోయిన విగ్రహం కనిపిస్తుంది. అక్కడ లైట్స్ వస్తూ పోతూ ఉంటాయి. మొహాలు కనిపించవు కానీ ఎవరో ఒక వ్యక్తి.. తన ఫ్రెండ్స్‌ను పిలుస్తూ ఉంటాడు. ఒక టేబుల్ చుట్టూ వరుణ్ సందేశ్‌తో పాటు మరో ముగ్గురు కూర్చొని ఉంటారు. ‘‘1970ల్లో ఊరికి దూరంగా మెంటల్ పేషెంట్స్ కోసం ఒక హాస్పిటల్ కట్టారు. అది కొన్ని సంవత్సరాలు బాగానే రన్ అయ్యింది. అదే టైమ్‌లో..’’ అంటూ ప్రమోదిని చెప్పే డైలాగ్‌తో అసలు ఆ పాత బిల్డింగ్ ఏంటి అని ప్రేక్షకులకు క్లారిటీ వస్తుంది. ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు మెంటల్ హాస్పిటల్‌లో జరిగిన సంఘటనలు చూపిస్తారు.
వింత ప్రవర్తన..
‘విరాజి’ ట్రైలర్‌లో వరుణ్ సందేశ్ భయంకరమైన నవ్వు, ఆ మెంటల్ హాస్పిటల్‌లో చిక్కుకుపోయిన మనుషులు, అక్కడ అర్థం కాని రాతలు.. ఇవన్నీ అసలు సినిమాలో ఏముంటుంది అనే ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తాయి. ఆ హాస్పిటల్‌లో చిక్కుకుపోయిన మనుషులకు భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ‘అతడి ప్రవర్తన ముందు నుండే చాలా వింతగా అనిపిస్తుంది’ అని ఒక అమ్మాయి చెప్పే డైలాగ్‌తో వరుణ్ సందేశ్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది అని క్లారిటీ వస్తుంది. ఇందులో వరుణ్ ఒక డ్రగ్ అడిక్ట్‌గా కనిపిస్తాడు. ఆ తర్వాత ఆ హాస్పిటల్‌లోకి వచ్చిన వ్యక్తులు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు.
ఫ్రెష్ ఆత్మతో మాట్లాడతా..
ట్రైలర్‌లోని ఒక సీన్‌లో ‘ఏం చేస్తున్నావు బ్రో’ అని వరుణ్ సందేశ్‌ను అడగగా.. ‘‘ఇప్పుడే చనిపోయాడు కదా.. ఫ్రెష్ ఆత్మ. అందుకే నేను తనను పిలుస్తున్నాను. తిరిగొస్తాడని’’ అని చెప్తాడు. అక్కడ ఉన్నవారికి అసలు తను ఏం చెప్తున్నాడు అనేది అర్థం కాదు. ఆ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ చేతిలో వరుణ్ సందేశ్ దెబ్బలు తినడం, తనే స్వయంగా ఒకరిని గన్‌తో కాల్చి చంపడం, కన్నీళ్లు పెట్టుకోవడం.. ఇలాంటి క్లారిటీ లేని సీన్స్‌తో ‘విరాజి’ ట్రైలర్ నిండిపోయింది. అధ్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ‘విరాజి’ని మహేంద్ర నాథ్ కొండ్లా నిర్మించారు. ఆగస్ట్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమా కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు వరుణ్ సందేశ్.
Also Read: నవ్విస్తూనే, భయపెడుతున్న ‘స్త్రీ 2’ - ట్రైలర్ చూస్తే వెన్నులో వణుకు పుట్టాలంతే!