Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - పవన్ బర్త్ డేకు 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి సాలిడ్ ట్రీట్!
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఒకే రోజు రెండు సాలిడ్ ట్రీట్స్ ఫ్యాన్స్‌కు అందనున్నట్లు తెలుస్తోంది. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ నుంచి అప్డేట్స్ వస్తాయని సమాచారం.

Solid Treat From Pawan Kalyan Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఈ ఏడాదంతా పండుగే అని చెప్పాలి. గత కొంతకాలంగా ఆయన సినిమాలు రిలీజ్ కాకపోవడంతో కొంత నిరాశ చెందినా వరుస లైనప్స్ ఫుల్ ట్రీట్స్ అందించనున్నాయి. పవర్ స్టార్ హీరోగా హిస్టారికల్ అడ్వెంచరస్ డ్రామా 'హరిహర వీరమల్లు' ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా లైనప్‌లో ఉన్నాయి.
పవన్ బర్త్ డే సందర్భంగా...
ఇప్పటికే 'ఓజీ' మూవీ షూటింగ్ కంప్లీట్ కాగా... ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో పవర్ ఫుల్ రోల్ 'గంభీర'గా మాస్ లుక్‌లో పవన్ కల్యాణ్ అదరగొట్టారు. పవర్ స్టార్‌ను అలా చూసిన ఫ్యాన్స్ ఎప్పుడు ఈ మూవీ వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ ట్రీట్ ఉండొచ్చు అనే టాక్ వినిపిస్తోంది. స్పెషల్ వీడియో కానీ ఓజీ నుంచి టీజర్ కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది.
ఈ మూవీకి 'సాహో' ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా... పవన్ సరసన అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తుండగా... ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Also Read: న్యూ రూల్స్... న్యూ కంటెస్టెంట్స్ - బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ నాగార్జున కీ డెసిషన్
ఉస్తాద్ భగత్ సింగ్ కూడా...
ఇక పవర్ స్టార్ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి కూడా సెప్టెంబర్ 2వ తేదీనే ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందని ఫిలింనగర్ వర్గాల టాక్. ఇదే నిజమైతే ఫుల్ ట్రీట్ ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఈసారి పవర్ స్టార్ బర్త్ డే ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఒకే రోజు రెండు బిగ్ మూవీస్ నుంచి అప్డేట్స్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా...
ఈ మూవీలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పవన్ సరసన బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండగా... రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. వీరిద్దరి కాంబోలో మళ్లీ మూవీ వస్తుండడంతో హైప్ మామూలుగా లేదు. కచ్చితంగా హిట్స్ ఖాయమంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
చాలా కాలం తర్వాత పవన్ మూవీ రిలీజ్ కానుండడంతో ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు. ఈ నెల 24న థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. 'హరిహర వీరమల్లు' కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.





















